Tuesday, December 14, 2010

మీ రాశి - మీ క్యేరెక్టర్

మీ రాశిని పట్టి మీ క్యేరెక్టరును తెలుసుకోవచ్చు. మీ ప్లస్ మైనస్ ఏమిటో తెలుస్తే జీవన పోరాటంలో విజయం తధ్యం కదా! అలానే మీ చుట్టూ ఉన్నవారి క్యేరెక్టర్ ఏమిటో వారి ప్లస్ మైనస్ ఏమిటో తెలుస్తే పబ్లిక్ రిలేషన్స్  ఇంకా భాగా ఉంటాయి.

మేషం:
మీరు జస్ట్ ఒక సైనికులు వంటివారు. మీకు ఖచ్చితంగా ఒక కమాండర్/సలహాదారు అవసరం( కేవిపి వంటి వారు కాదు ముర్రో)
ఈ సోమరి ప్రపంచంలో చురుగ్గా ఉండి మరి విమర్శలకు గురయ్యేది మీరొకరే. బాస్ తో ప్రత్యక్ష సంభంధమున్న పొజిషన్ లో ఉంటే భాగా రానిస్తారు. లేకుంటే సాటి ఉధ్యోగులు మిమ్మల్ని శతృవుగా పరిగణించే అవకాశం  కూడా ఉంది. తగిన ప్లానింగ్ లేకుండా తలకు మించిన పనుల్లో దిగి  తిక మక పడతారు. ముందంజలో ఉండాలని ఉవ్విళ్ళురుతారు. కాని దాని కోసం పెద్ద పోరాటమే చెయ్యవలసి వస్తుంది.వీరు అగ్ర సంతానంగా, లెదా కుటుంభాన్ని,సంస్థను ముందుకు తీసుకెళ్ళే పొజిషన్లో ఉంటారు. కాని దీనికోసం ఎన్నో పోగొట్టుకుంటారు. చివరికి ఇతరుల విమర్శలకు సైతం గురవుతారు

2.వృషభం:
వీరిది చిన్నపిల్లల మనస్తత్వం . అల్ప సంతోషులు, ఎదుటివారు కొద్దిగా ఆప్యాయంగా మాట్లాడితే చాలు తమ మనస్సులో మాట ఇట్టే కక్కేసి చిక్కున పడతారు. వీరికి మాట,కుటుంభం, దనం అంటే ప్రాణం.
జీవితం చాలా కౄరమైంది .ఎవరికి ఏదంటే ప్రాణమో దానినే దూరం చేస్తుంది, వీరు అత్యవసర పరిస్థితిలో సైతం  టూకిగా మాట్లాడలేనంతగా మాటలకు భానిసలై ఉంటారు. ఇచ్చిన మాట నిలుపుకోవాలని చూస్తారు. దీనినే ఎదుటివారి వద్దనుండి కూడ ఎదురు చూస్తారు.లేకుంటే అలుగుతారు.
కుటుంభాన్ని ప్రేమిస్తారు. ప్రేమతో కుటుంభ అభివృద్ది కోసం వీరు చేసే సూచనలను ఇతరులు నిర్లక్ష్యం చేసినప్పుడు అలుగుతారు. కుటుంభానికే దూరమైనా కావచ్చు. మార్పును వ్యతిరేకించే వీరు సాంప్రదాయ పద్దమైన పెళ్ళికే మొగ్గు చూపుతారు. ఒక వేళ  ప్రేమించి పెళ్ళి చేసుకున్నా క్రమేణా కుటుంభంతో దగ్గరవుతారు. గానుగలో ఎద్దులాగా ఒక రొటీన్ కి అలవాటు పడి పోతారు. వీరికి కొంత గడ్డి పడేసి వీరిని ఇతరులు భాగా వాడుకుంటుంటారు
( మిథున,కర్కాట రాశుల వారి క్యేరెక్టర్ ఈ రోజు మద్యాహ్నం)

No comments:

Post a Comment