Wednesday, December 1, 2010

సంపాదన మార్గాలు: 4

సంపాదన గురించిన న గత టపాలను చదివి ఎంత మంది స్ఫూర్తి పోందారో తెలీదు గాని నాకు మాత్రం ఈ టపాలు ఒక రివిషన్లా పనికొస్తున్నాయి.  నేను ఎంతటి దుర్బర జీవితం గడిపానో చెప్పినా నమ్మ లేరు. పొట్ట చేత పట్టి బతికినా నా లక్ష్యాన్ని మాత్రం జార విడువలేదు.

నా దృష్ఠిలో నా లక్ష్యం ఒక గమ్యం. ఆ గమ్యాన్ని చేరుకోవడానికి నాకు డబ్బు కావాలి. అందుకే నేను సంపాదన మార్గాలను అన్వేషించాను. కేవలం సంపాదనే నా ద్యేయం అనుకును ఉంటే ఇంతకాలం వేచి ఉండాల్సిన అవసరమే లేదు.

నా బోటి జ్యోతిష్కులు ఎంతో మంది లక్షలు లక్షలు సంపాదించేరు. కాని నా లక్ష్యం సంపాదనకాదు. నా లక్ష్యం నా దేశాన్ని సంపన్న దేశంగా మార్చటమే. అందుకని ఒక పథకం రూపొందించాను, ఆ పథకాన్ని పాలకుల దృష్ఠికి తీసుకెళ్ళటానికి నాకు డబ్బు అవసరమైంది. సంపాదన మార్గాలు అన్వేషించాను. కనుగొన్నాను. వాటినే మీతో పంచుకుంటున్నాను.

జ్యోతిష్యం మీద సంపాదించడం, మరీ కంప్యూటర్ నాలెడ్జ్, బ్రాడ్ బ్యాండ్ కనెక్శన్ కలిగి ఉన్న  నాలాంటి  బహు బాషా కోవిదునికి ఎంత తేలికో మీకు తెలుసు. కాని నేను జ్యోతిష్యంలోని లొసుగులను నిత్యం భయిట పెడుతూ అహేతుక అంశాలన్ దుయ్యపడుతూ వచ్చాను.

అదేం మాయో తెలీదుగాని నేను వేసుకున్న సేమ్ సైడ్ గోల్స్ నా విశ్వసనీయతను మరింత పెంచాయి. గతంలో అదనపు ఆదాయ మార్గంగా ఉన్న ఆన్ లైన్ జ్యోతిష్య సలహా ఇప్పుడు నా ముఖ్య ఆదాయ మార్గాల్లో ఒకటిగా మారింది. ఇది నా గొప్పతనం కాదు. జ్యోతిష్యంయొక్క గొప్పదనం. నిజాయితి యొక్క గొప్పదనం.

యండమూరి వీరేంథ్ర నాద్ లాగా నాలుగు విదేశీ పుస్తకాలు చదివి ఒక స్వదేశీ పుస్తకం వ్రాయడం నాకు చేతకాదు. నా పుట్టుకే అంతా. ఏదైనా సరే నాకు గురి కుదిరితే గాని అస్సల్ పట్టించుకోను. డబ్బును నాకన్నా నీచంగా విమర్శించినవారూ ఉండరు. నేడు నాలా కీర్తించేవారూ ఉండరు. నా అభిప్రాయాలు అంత తేలికగా మారవు. మారితే అది అనుభవంతోనే మారాలి.

నేను సైతం ఒక సినిమా ప్రేక్షకుడను. నాకు , నా బుర్రకు నేటివిటి మరీ ముఖ్యం. నేటివిటి లేకుంటే ఎంత గొప్ప విషయమన్నా సరే  నా బుర్రలో నో అడ్మిషన్ బోర్డే కనిపిస్తుంది. నేను నా మైండ్లోనుండి డైరక్టుగా టైప్ చెయ్యగలను గాని మరి దేనినైనా చూసి టైప్ చెయ్యలేను. నా పుట్టుకే అంతా కక్కిన కూడు, సద్ది మూటలు నాకు పనికి రావు. నేను ఆకలిలో ఉన్న పులిని నాకు నేనై వేటాడుతాను.

నా మైండ్లో ఒక పాయింటు నిలబడాలంటే అది మరీ గొప్ప అంశమై ఉండాలి. నాకు పుస్తకాలు చదవడమన్నది మందు బాబులకు మందులాంటిది. మంచి పుస్తకాలు దొరకనప్పుడు చెత్త పుస్తకాలు సైతం చదువుతా. కాని అవేమి నా బుర్రలో నిలవవు.

సొంత సోది సరిగాని సంపాదన పాయింటుకు రండి బాబు.. అంటున్నారు. వినబడుతూంది.వస్తున్నా.పాయింటుకే వస్తున్నా. మనిషికి శరీరం,మనస్సు,బుద్ది అంటూ నాలుగు అంశాలున్నాయి. ఇవి చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. వీటిని సంపాదనకు అనువుగా మలుచుకో కలిగితే సంపాదన చాలా తేలిక.

కవితకేదీ కాదు అనర్హం అన్నట్టుగా సంపాదనకు సైతం ఏది కాదు అనర్హం. ఒక సారి నా ఫ్రెండ్ ఒకతను ( గోల్డ్ స్మిత్) తన పాత స్కూటరును తుక్కు క్రింద తూకానికి అమ్మి వేసే ఏర్పాటు చెయ్యమన్నాడు. సరేనని మా ఇంట తోసి ఉంచాను. మా ఇంటి పని మనిష్ తన మొగునికోసం కొనుక్కోవాలనుకుంది. మెకానిక్ ఒకతనిని తీసుకొచ్చు వ్యేల్యూ వేసుకోమన్నాను. అలానే చేసింది. రెండు వేలిస్తానంది. సరేనన్నాను.

నేను కాటా తెప్పించి తూకం చూసుకున్నాను. పాత ఇనుము కేజి ఎంతకు పోతుందో కనుగొన్నాను. మార్కెట్ దరకైతే ఐదొందలు పోతుందని తేలింది. పని మనిషి వద్ద రెండు వేలు తీసుకుని ఫ్రెండ్ వద్దకు వెళ్ళి తూకం, ఇనుము దర చెప్పి ఐదొందలు అతనికిచ్చాను.

"ఆర్ యు సేటిస్ఫడ్ ?" అన్నాను

" కాదా మరి"  అంటూ డబ్బు తీసుకున్నాడు.

 అదనంగా మరో ఐదొందలొస్తే ? అన్నాను

" చాలా సంతోషం కదా మరి " అన్నాడు

మరో ఐదొందలు అతని చేతికిచ్చి అసలు విషయం చెప్పాను. దిమ్మ తిరిగి పోయి నన్ను ఎంతగానో మెచ్చుకున్నాడు.

( కవులంటే మురికి పంచ, జుబ్బా, సోడా బుడ్డి అద్దంతో సదా సర్వకాలం అనవసర పెగ్గితో,భావిలో కప్పల్లా, పేదరికంలో నలుగుతుంటారని అతని ఫీలింగ్. అందుకు భిన్నంగా నేను ప్రవర్తించడంతో ఆనందించాడు .అతనో మంచి వ్యాపారి కాబట్టి)

ఈ చిన్న సంఘఠనలో చాలా విషయాలు దాగి ఉన్నాయి.

మన పని మనం కూర్చున్న చోటే అయిపోవాలనుకుంటే మనం కొంత నష్ఠ పోవలసి వస్తుంది ( నా ఫ్రెండులా)

ఎవరి పనైనా సరే తిరిగి చేద్దామనుకుంటే కొంత లాభ పడే అవకాశం ఉంటుంది నాలా?

ఒకే వస్తువుయొక్క మతింపు మీ భావాన్ని పట్టి మారిపోతుంది. అతను తుక్కు అనుకున్నాడు. నా దృష్ఠిలో అది స్కూటర్లానే కనిపించింది.

స్క్ర్రాబ్ అంగడి అతని వద్దకు తీసుకెళ్ళి ఉంటే తుక్కు క్రిందే చూసి ఉంటాడు. మా ఇంటి పని మనిషి చూసింది కాబట్టి అది స్కూటర్లా కనిపించింది.

ఇన్ని అంశాలు అనుకూలించినా ఐదొందలు ఫ్రెండు మొఖాన పడెయ్యకుండా నిజం ఎందుకు చెప్పాలి అని మీరు ప్రశ్నించవచ్చు.

అతని స్కూటరు ఏదో రోజు రోడ్డు మీద తిరుగుతూ కనిపిస్తుంది. ఒక వేళ అతను మా పని మనిషిని/ఆమె భర్తను  ప్రశ్నించి నిజం తెలిసొస్తే అతను నా గురించి ఏమనుకుంటాడు? నేనతనిని మోసగించాననే అనుకుంటాడు. పైగా నాకు దూరమవుతాడు.పైగా నా గురించి దుష్ప్రచారం చేస్తాడు. ఇదో కోణం.

అతను ఒక సోమరి. అతని వద్దనుండి ఇటువంటి ఆఫర్లే మరిన్ని వచ్చే అవకాశం ఉంటుంది. వాటిని నేనెందుకు పోగొట్టుకోవాలి. భవిష్యత్ లాభం కోసం వర్థమానంలో కొద్దిగా నష్ఠపోవడంలో తప్పు లేదుగా?

ఈనాటి కొత్త వ్యాపారం:

ఇందుకు కావలసింది ప్రజల దైనందిన జీవితంలో రాగల చిన్న చిన్న  సమస్యల గురించిన అవగాహణ -వాటికి పరిష్కారాలు -వాటిని అందించ గల టెక్నీషియన్స్, సమర్థులు, అనుభవజ్ణుల గ్రూపు. ( వీరు మన ఆఫీసులో పడికాపులు కాయాల్సిన పని లేదు.. మనం సమాచారం అందించినప్పుడు మన క్లెయింట్స్ వద్దకు చేరుకుని సేవలందించే వీలుకలిగి ఉంటే చాలు)

ఉ: ఇంటి తాళం పోయినప్పుడు/ ఫ్యూజు పోతే / ప్యేన్ ,ట్యూబ్ లైట్ ఫిటింగ్/ టూ వీలర్ సగం దారిలో నిలిచి పోతే/ ఇలా కో కొల్లలు సమస్యలు వస్తుంటాయి. వీటిని జాగ్రత్తగా లిస్ట్ అవుట్ చేసుకుని వీటిని పరిష్కరించ గల ,మనకు అందుబాటులో ఉండగల సమర్థులను సమకూర్చుకోవడం. అడ్వర్టైజ్ చెయ్యడం. క్లెయింట్స్ సంపూర్ణ సంతృప్తి చెందేలా పని చేయడం,చెయ్యించడం

No comments:

Post a Comment