Tuesday, December 21, 2010

మరణం -మైథునం -దనం

ప్రజా జీవితంలో అవినీతి:

పిల్లాడు ఏడుస్తె వెంటనే వాడికి ఏదో తాయిలం పెట్టి ఏడుపు మానిపిస్తారు తల్లి తండ్రులు.అవినీతి అన్నది ఇక్కడే ప్రారరంభం అవుతుంది. వాడు ఎందుకు ఏడ్చాడు? వాడలా ఏడవడం  మంచా? చెడ్డా?కూడ ఆలోచించరు . పిల్లాడు ఊరుకుంటాడు. ఇది వివాహ సమయంలో  కాశియాత్రకు బయలు దేరే అల్లుడికి ఇచ్చే కట్న కానుకలదాకా వెళ్తుంది.

వివేకానందుడేమో నీ మనస్సుకన్నా గొప్ప వస్తువు ఈ  భూప్రపంచం మీద లేదు. ఒకవేళ ఏదైన వస్తువు గొప్పదనిపిస్తే నీ మనస్సు బలహీనంగా ఉందని అర్థం అన్నాడు. అవినీతికి ప్రప్రథమ కారణం అవినీతి పరుల మానసిక దౌర్భల్యమే.

పైగా మానవులు ఏంచేసినా వారిని ఆ చర్యలకు ప్రేరేపించింది వారిలోనే చంపే లేదా చచ్చే కోరికలే అని సైకాలజి చెబుతూంది. అవినీతికి పాల్పడే వాడికి తెలియదా తన అవినీతితో జనులు చస్తారని? అతనికి తెలియదా ఏదో రోజు తన గుట్టు రట్టైతే తాను చస్తాడని. తెలుసు అయినా ఎందుకు అవినీతికి పాల్పడతారు? చచ్చే చంపే కోరికలు.

అసలు ఈ కోరికలకు కారణం ఏది? ఈ సమస్త జీవకోటికి మూలం అమీభా.ఏక కణ జీవి .అది  భాగా  బలిసి పోవడం వలన   సెల్ కాపియింగ్ ద్వారా ఒకటి రెండై,రెండు నాలుగైంది. కాపియింగ్లో జరిగిన ఎర్రర్ కారణంగా కొత్త జీవరాశులు. కోతి. కోతినుండి మానవుడు.

అనాడు ఒకే శరీరం -ఒకే కణం -ఒకే ప్రాణంగా ఉన్నప్పుడు ఏ సమస్యా లేదు. కాలం -దూరం-అబద్రత-కమ్యూనికేషన్ సమస్య ఏదీ లేదు. ఆ అది కణంలోని ఈ తియ్యటి స్మృతులు సెల్ కాపియింగ్ ద్వారా కణానికి కణానికి మార్పిడి అయ్యి ప్రతి మానవ మస్తిష్కంలో అట్టడుగు పొరల్లో దాగి ఉంది.

మళ్ళీ ఆ స్థితిని పొందాలంటే ఈ శరీరాన్ని త్యజించాలి. అందుకే ఈ చంపే చచ్చే కోరికలు. ఆఠవిక జీవితంలో ప్రత్యక్షంగా జరిగింది - ఆపై సెక్సులో సాధ్యమైంది- నాగరికత -సంస్కృతి పేరిట సెక్స్ ఇంచు మించు నిషేదింప పడ్డాక డబ్బుతో సాధ్యమవుతూంది.

స్థూలంగా చూస్తేనే మరణం -మైథునం (సెక్స్) -దనం ఇవన్ని వేర్వేరుగా కనిపిస్తాయి. కాని కాస్త లోతుగా ఆలోచిస్తే ఇవన్ని ఒకే విదమైన సంత్రుప్తిని మానవునికి ఇస్తాయి. అది మరేది కాదు అతనిలోని చంపే చచ్చే కోరికను సంతృప్తి పరచడం.

నిజానికి ఒక కణం రెండు కణాలుగా మారినప్పటికి రెండు నాలుగై, నాలుగు పదహారై కాపియింగ్ ఎర్రర్ కారణంగా కొత్త జీవరాశులు -కోతి -మానవుడు దాక వచ్చినప్పటికి మనమందరం ఏదో విదంగా అనుసందింప పడి ఉన్నాం.

మన శరీరాలను సెల్ ఫోన్స్ అనుకొండి. మన ఆత్మలను సిమ్ కార్డ్స్ అనుకొండి. సెల్ ఫోన్ ఏ మేక్ అయినా ,దాని లోపల ఉన్న సిమ్ ఏ నెట్వర్కు సంభంధించినదైనా వాటన్నింటిని సేటిలైట్ నుండి వచ్చే తరంగాలు అనుసందిస్తాయి.

ఇదే విదంగా మనమందరం ఏదో విదంగా,మరేదో పద్దతిలో అనుసందింప పడి యున్నాం. ఈ అనుసందానాన్ని మనం గుర్తెరగక పోవడానికి కారణం మనం గొప్పగా కొనియాడే వ్యక్తిత్వం (సెల్ఫ్) పచ్చిగా చెబితే అహం.

నిజానికి మనమందరం ఈ సృష్ఠి వలయంలో భాగస్వాములం. దీనిని ఒక మానవ హారంగా భావిస్తే ఇందులో ఏ ఒక్కరు అనుసందానాన్ని కాదనుకుని చెయ్యి ముడుచుకున్నా లింక్ గోవిందా.

ఈ చిన్న సత్యాన్ని అర్థం చేసుకోక విడిపోయాం అనుకోవడం -మళ్ళీ కలవాలనుకోవడం - అందుకు ఈ శరీరాలే అడ్డనుకోవడం- అందుకు కాను చంపుకోవడం -చావడం -స్థూలంగా చెయ్య లేక సెక్సుద్వారా వీర్య స్కలన సమయాన కలిగే ఆ బ్లాక్ అవుట్ అనే బుల్లి మరణం కోసం తపించడం - లేదా బోలెడన్ని స్త్ర్రీలతో సెక్సు చేసుకోవచ్చు కదా అని డబ్బు వెంట బడటం- అందుకోసం అధికారాన్ని చేజిక్కించుకోవాలనుకోవడం ఇవన్ని మూర్ఖత్వాలేగా.

మనిషి అవినీతికి పాల్పడ కూడదంటే అందుకున్న మార్గాలివి:

* అతను ఈ సృష్ఠిలో ఏకాకి కాదని కొత్తగా సాటి జీవులతో అనుసందానం కావల్సిన పని లేదని ఇప్పటికే అనుసందించ బడి ఉన్నాడని అతనికి అనుభవమయ్యేలా చూడటం (ద్యానం)

*చంపుకొండి చావండి అని వదిలెయ్యడం

*  సెక్సు పై ఉన్న నిషేదాజ్నలను ఎత్తి వేసి వీర్య స్కలన సమయాన పొందే బుల్లి మరణాన్ని పొందేలా చూడటం. ఇది పురుషుల విషయంలో యదేచ్చగా జరిగిపోవచ్చు (వీర్య స్కలనం) కాని స్త్ర్రీల విషయంలొ ఇది సాధ్యం కావాలంటే ఆమె సైతం భావప్రాప్తి పొందాలి . అందుకు సెక్స్ ఎజుకేషన్ అత్యవసరం.( జీవుల అనుసందానం కనీశం శారీరకంగానైనా ..కొంత సమయానికైనా సాధ్యమయ్యే అవకాశం కూడ ఉంది మరి)

ఈ మూడింట ఏదో ఒకటి సాధ్యమైతే మనిషి డబ్బును కేవలం డబ్బుగా చూస్తాడు. డబ్బు గురించిన భ్రమలనుండి విముక్తుడవుతాడు. అవినీతి తనంతట తనే మటుమాయం అవుతుంది.

( వీక్ ఎండ్ పొలిటీషియన్ గారూ.. మీ కోసమే ఈటపా : ఇందాక చెప్పినవి మీకు చికాకు కలిగించి ఉండవచ్చు - కాని ఇదే అసలు సిసలైన శాస్వత పరిష్కారం. కావాలంటే మీ కోసం తదుపరి టపాలో తాత్కాలిక పరిష్కారంగా కొన్ని అంశాలను ప్రతిపాదిస్తాను)

No comments:

Post a Comment