Thursday, December 16, 2010

మీ రాశి - మీ క్యేరెక్టరు 3 ఇన్ వన్

మిథునం:
మిథునం అన్న పథం మైదునం అన్న పదం నుండి వచ్చింది. మైథునం అంటే నేటి తరానికి తెలియదేమో? రతి అని భావం.ఇప్పట్లో వచ్చే పంచాంగాల్లో మిథున రాశి సింబల్ పేరిట విడిగా ఉన్నస్త్ర్రీ పురుషుల బొమ్మలను  ముద్రిస్తున్నారు. మా ఇంట 1932 నాటి పంచాంగం చూసాను ( మా తాత మునస్వామి  జ్యోతిష్యలో ప్రవేశం మొదల్గొని అన్ని విషయాల్లోను ఇంచుమించు నా టైపే. అంటే నేను మేథావి వర్గం ఆయన శ్రామిక వర్గం . ఆయన చెయ్యని వృత్తి వ్యాపారమంటూ లేదు. అన్నీ ఆరు నెలలకే పరిమితం) పాయింటుకొస్తా..1932 నాటి పంచాంగంలో రతి భంగిమలో ఉన్న స్త్రీ పురుషుల బొమ్మ ఉండే. అప్పుడు కాని నాకు స్పార్క్ కాలేదు.
ఈ రాశి వారి జీవితంలో సెక్స్ అత్యంత ప్రాధన్య కలిగి ఉంటుంది.వారి వారి జాతక విశేషాలను కాబట్టి అతిగా లభ్యం కావడమో, అస్సల్ దొరక్క పోవడమో ఉండొచ్చు గాని ప్రాముఖ్యత ప్రాధన్యత మాత్రం సెక్సుకే. అలానే బ్రదర్స్,సిస్టర్స్ ప్రభావం కూడ ఎక్కువ. మంచైన చెడైనా వారిద్వారే జరుగుతుంటది.
వీరి జీవితంలో నుండి సోదర భంధాన్ని ఎప్పటికి విడదీయలేం. వీరు అధికంగా ప్రయాణాలు చేస్తుండొచ్చు. ( మెడికల్ రెప్స్?) వీరికి రెండు పేర్లు,రెండు వృత్తులు, రెండు చిరునామాలుండవచ్చు. వీరి జీవితంలో మరో వింత కూడ ఉంటుంది. ఏదైన పెద్ద మంచి విషయం జరిగితే వెంటనే ఏదో ఒక పెద్ద దుఖం,కష్ఠం,నష్ఠం కూడ కలుగుతుంటుంది.
ఈ రాశి వారిలో పురుషుల్లో నాజూగు ఎక్కువ ( ఫిమెలిష్) , స్త్రీల్లో మొరటు తనం ఎక్కువ ఉండే అవకాశం గలదు. విద్యా వైద్య జోతిష్య గణిత రంగాల్లో ఆసక్తిగలవారై, అన్ని వర్గాల ప్రజలతో మాటా మంతి గలవారై ఉంటారు.

కర్కాటకం:
వీరి సమస్యల్లోచాలావరకు మనోసంభంధమైనవే ఉంటవి. మనస్సు అనే పదం అడుగడుగున వీరి మాటల్లో చోటు చేసుకుంటుంటుంది. అప్పుడప్పుడు మూడ్ అవుట్ కావడం.తేలిగ్గా చికాకు పడటం వెంటనే శాంతించడం ఉండొచ్చు. వీరికి శీతల సంభంధ రోగాలు వస్తవి. చంచలస్వభావం ఎక్కువ. అసలు విషయాలను పక్కన పెట్టి సైడ్ ట్రాక్ పట్టే అవకాశం కూడ ఎక్కువే.
జాగ్రత్తగా పరిశీలిస్తే వీరిలో ఒక నెలలో  పన్నెండు రాశులవారి గుణగణాలు కనబడుతుంటవి. ఆలోచన,మాటలు,చేతలు,వృత్తి,సంపాదన, మానవ సంభంధాల్లో సైతం స్థిరత్వం ఉండదు. దైర్యం, భయం తరచూ ఒకటి వెనుక ఒకటి బహిర్గతమవుతుంటవి.
వీరికి ఆశ్చర్యం, దిగ్బ్రాంతి కలిగించే విషయాలంటే ఆసక్తి ఎక్కువ. రాజ విక్రమార్క ఏడాదిలో ఆరు నెలలు రాజుగా,ఆరు నలలు దేశ దిమ్మరిగా బతికాడంటారే ఆ టైపు జీవితం వీరిది. మానసిక ఉద్రిక్తతల వలన వీసింగ్,  బి.పి.అల్సర్, నవ్వ వంటి సమస్యలు రావచ్చు.ప్రముఖుల భార్యలు సాయ పడతారు.
వీరి ఫిసిక్ లో సైతం పెనుమార్పులుంటవి.కొంతకాలం బక్క చిక్కి ,మరి కొంతకాలం లావెక్కి కనబడతారు. ఇంచు మించు వీరిది ద్విపాత్రాభినయం. వీరి గురించి తెలుసుకోవాలంటే కొన్ని క్లూస్ ఇస్తా వీరి గుణగణాలకు చంద్రుడు, నది,సముద్రం, మిర్రర్,జలం యొక్క ధర్మాలకు దగ్గర పోలికలుంటవి.
ఉ: రవి కాంతిని చంద్రుడు ప్రతిబింబించినట్టే వీరు సైతం ఎవరో ఒక ఆదర్శ పురుషుని ఖ్యాతిని చాటుతుంటారు. ఈ రాశివారు ద్యానం, భక్తి, సెలిబ్రిటీస్ ను ఆదర్శంగా తీసుకోవడం వంటి ఏదో చిట్కాను వాడకుంటే ఎందుకూ పనికి రానివారిగా తయారవుతారు.
వీరి జీవితంలో తల్లి,ఇల్లు,వాహనం,విద్యలకు అత్యంత ప్రాధన్యత ఉంటుంది. అంటే ఇవి కూడ రెండు విదాలుగా ఎఫెక్ట్ ఇస్తుంటాయి. నెలలో ఒక పెదునాలుగు రోజులు అనుకూలంగాను, మరో పదునాలుగు రోజులు ప్రతికూలంగాను ఉంటవి.
సింహం:
జాతకునిలో ఒకింత వరకు సోమరి తనం, అతి విశ్వాసం, చిటపటలాడటం ఉండొచ్చు. తండ్రితో వైరుధ్యం లేదా అతని వెనుకంజ సాధ్యమే. తల్లి మీద అమిత ప్రేమ ఉంటుంది. ( దీనిని డెపెండెన్స్ అని కూడ చెప్పొచ్చు) భవిష్యత్తులో అత్తా కోడళ్ళ పోరులో వీరు భలి పశువు అయ్యే ప్రమాదం కూడ ఉంది.( తల్లికి ఇచ్చే అత్యంత ప్రాధన్యత వలన). వీరు ఇతరులకు అప్పిస్తే తిరిగి రావడం కష్ఠమే వీర్ని ప్రశ్నించే స్థాయిలో ఉన్నవారు అతిత్వరలో బలహీన పడి పోతారు.( ఆర్థికంగా/శారీరకంగా). దాన గుణం ఉంటుంది. గుడి గోపురాలకన్నా క్రమ శిక్షణ, విద్యుక్త ధర్మానికే అధిక ప్రాధన్యత ఇస్తారు. మానవత్వమూ ఉంటుంది. సూర్యుని గురించి సైంటిఫిక్ గా తెలుసుకుని సూర్య నమస్కారం చేస్తూ వస్తే గొప్ప వారుగా తయారవుతారు. ఉ. ఆరు నుండి సా.ఆరు దాక ఉత్సాహంగా ఉంటారు.ఆ తరువాత డల్ ఫీలవుతారు. వీరున్న ఇంటికి ఎదురిల్లు పాత పడి పోతుంది అని ఒక విశ్వాసం

No comments:

Post a Comment