Thursday, December 23, 2010

స్త్ర్రీల పట్ల హింసను స్త్ర్రీలే ప్రేరేపిస్తున్నారు


నేను గురువారం వ్రాసిన టపాలో స్త్ర్రీల పట్ల హింసను స్త్ర్రీలే ప్రేరేపిస్తున్నారని ఒక సంచలన వ్యాఖ్య చేసాను. మనవాళ్ళు దాని పట్టించుకోలేదా? పాపం ఈ వ్యాఖ్య వారి కంట పడలేదా?

ఇదేదో స్ఫురించి చెప్పినదో, జ్నానోదయం కలిగి చెంప్పిందో కాదు. దీని వెనుక సుధీర్ఘ అద్యయనం ఉంది. అది టూకిగా

* అన్ని జీవరాశులకు మూలం అమీభా

* అదే సెల్ కాపియింగ్ ద్వారా వ్యాప్తి చెందింది

*కాపియింగ్ ఎర్రర్ కారణంగా కొత్త జీవరాశులొచ్చాయి

*ఒకే శరీరం -ఒకే ప్రాణంగా ఉన్నప్పుడు ఒంటరితనం- భయం -బెంగ-అబధ్రత -కాలం-దూరం-
కమ్యూనికేషన్ సమస్యలు ఏవి లేవు. ఈ తియ్యని స్మృతులు సెల్ కాప్యింగ్ ద్వార సెల్ టు సెల్ కాపి అయ్యి ఇప్పటి మానవుడి దాక మస్తిష్కపు అతని పొరల్లో దాగి ఉన్నాయి

* శరీరాలు వేరైనప్పుడు పై తెలిపిన సమస్యలన్ని వచ్చేసాయి. ఒంటరితనం- భయం -బెంగ-అబధ్రత -కాలం-దూరం- కమ్యూనికేషన్ సమస్యలు

*ఇవే మానవుడికి మళ్ళీ ఒకే ప్రాణంగా మారాలన్న తపనను ఇస్తున్నాయి.

* తమ పునరేకీకరణకు తమ శరీరాలే కారణమన్న అపోహ ఎటో మనవునిలోకి పవేశించింది.

*శరీరాలను రాల్చుకుంటే గాని పునరేకీకరణ అసాధ్యమన్న అంత:కరణ ప్రేరణతోనే చంపాలి -చావాలి అన్న ఉద్దేశంతోనే (తనకే తెలీక) అన్ని పనులు చేస్తున్నాడు. ఈ ద్యేయంతోనే అత్యధికులు మాంసాహారులుగా ఉన్నారు. (ఈ చంపడం -చావడం కాన్సెప్ట్ సైకాలజిలోనే ఉంది -ఇందుకు గల కారణాన్ని మాత్రమే నేను విశ్లేషించి కూర్చాను)

*ఆఠవిక జీవితంలో చంపటం -చావడం స్థూలంగా సాధ్యమైంది.

*స్థిరవాసంలో అది కాస్త తగ్గింది - ఇందుకు ప్రత్యామ్నాయంగా సెక్సును ఎన్నుకున్నాడు మానవుడు

సెక్సులో చంపడం చావడమేంది అని మీరు అడుగుతారు. చెబుతా:

స్త్ర్రీ: పురుషునికి వీర్యస్కలనం జరిగేంత వరకు ఈవిడలోని చచ్చే కోరిక నెరవేరుతుంది. పురుషునికి వీర్య స్కలనం జరిగినప్పుడు ఈవిడలోని చంపే కోరిక నెరవేరుతుంది

పురుషుడు:తనకు వీర్యస్కలనం జరిగేంత వరకు చంపే కోరిక - అదయ్యాక చచ్చే కోరిక నెరవేరుతాయి.

సభ్యత ,సంస్కారం,చట్టం ఇలా అన్ని సెక్సును దాదాపుగా నిషేదించేసాయి. మరి సెక్సుకు ప్రత్యామ్నాయం?

అదే డబ్బు. డబ్బుతో చంపడం చావడమేంది అని మీరు అడుగుతారు. చెబుతా:

తాను సంపాదించాలంటే తన ఈగోను చంపుకోవాలి (అదీ ఇతనిలో ఒక భాగమే -పైగా తన అహమే తానన్న భ్రమలో ఉంటాడు -అహం వెనుక సెల్ఫ్- సెల్ఫ్ వెనుక ఆత్మ ఉంటాయని తెలీదు పాపం.

తన కండలు కరిగించాలి, రక్తం ఆవిరి చెయ్యాలి, యవ్వనాన్ని పోగొట్టుకోవాలి. తన ఎక్స్ టెన్షన్ అయిన ఇంటికి, తనవారికి దూరం కావాలి, కాలంతో యుద్దం చెయ్యాలి. ఇవన్ని చేస్తే గాని డబ్బు సంపాదించలేం.

కాని మరణానికి చేరువ అవుతాం. సంపాదించేంతవరకు తనను తాను చంపుకుంటాడు. సంపాదించాక తన చుట్టూ ఉన్నవారిని చంపుతాడు ( అంటే వారి అహాన్ని ఎట్సెట్రా)

పైగా డబ్బుతో మరింత స్థూలంగా తన కోరికలను నెరవేర్వే ( చంపడం -చావడం) సెక్సును కూడ కొనుక్కో గలడు.

మరి ఈ చంపడం చావడం స్త్ర్రీ పురుషుల నడుమ సరి సమానంగా ఉండాలి కదా. కాని అడపా తడపా ఒకరిద్దరు మహిళలు మాత్రమే తమ ప్రియులతో చేతులు కలిపి మొగుళ్ళను చంపుతున్నారు . అధిక సంఖ్యలో మొగుళ్ళ చేతిలో చస్తున్నారు ఎందుకు?

ఇదెందుకిలా సాగుతుందంటే సెక్సులో వారి చచ్చే కోరిక పూర్తిగా తీరడం లేదు. అంటే కాలం తెలీని స్థితి/బుల్లి మరణం/కాలాతీత స్థ్తితి వారికి సెక్సులో కలగడం లేదు. ఎందుకంటే సెక్సులో వారికి భావప్రాప్తి కలగడం లేదు.

అందుకే చలా మంది భార్యలు మొగుళ్ళను టీవిలు తెమ్మని, ఫ్రిడ్జీలు కొని పెట్టమని,లంచాలు గుంజమని చంపుకు తింటుంటారు.

లేదా ప్రకృతి సిద్దంగా తమకు ఉన్న ఆపదను పసికట్టే సామర్థ్యాన్ని కూడ సద్వినియోగం చేసుకోకుండా మొగుళ్ళ చేతిలో,ప్రియుల చేతిలో చస్తున్నారు.

ఇదివరకే చెప్పానుగా.. జీవరాశుల ప్రప్రధమ కోరిక చంపడం లేదా చావడం. సెక్సులో స్త్ర్రీ లోని చంపే కోరిక నెరవేరినప్పటికి - చచ్చే కోరిక మాత్రం నెరవేరడం లేదు. ( భావప్రాప్తి కలగడం లేదు) .

అందుకే స్త్ర్రీల పై హింసను స్త్ర్రీలే ప్రేరేపిస్తున్నారా అన్న అనుమానం నాకు కలుగుతుంది. ఆపదలను పసి కట్టే, తప్పించుకునే, తిప్పి కొట్టే శక్తి సామర్థ్యం పురుషుల్లోకన్నా స్త్ర్రీలలో ఎక్కువ. ఇది ప్రకృతి వారికిచ్చిన వరం. ఈ వరం ఎందుకివ్వ బడిందో? దానిని వారు ఎందుకు సద్వినియోగం చేసుకోలేక యాసిడ్ దాడులకు,కత్తిపోట్లకు, స్టవ్ పేలుళ్ళకు గురై పోతున్నారో తదుపరి టపాలో చూద్దాం.

No comments:

Post a Comment