Sunday, December 19, 2010

కాంగ్రెస్ ప్లీనరిలో తెలుగు గౌరవానికి చేటు

అవును బాసు కాంగ్రెస్ ప్లీనరిలో తెలుగు గౌరవానికి చేటు వచ్చింది. మంచే చేసాడో? చెడే చేసాడో? పి.వి మన తెలుగోడు. కాని ప్లీనరిలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ మాజి ప్రధానుల ఫోటోల వరుసలో పి.వి ఫోటో లేదట. మన నాయకులు ఎవరి స్వార్థం వారు చూసుకుంటున్నారే గాని సమస్త తెలుగు ప్రజల తరపున గళం విప్పే నాయకుడే లేక పోయేరు.

గోదావరి బేసిన్లో గ్యాసు పంచటానికి మా అమ్మ దగ్గర కూర్చుని మాట్లాడతామని రిలయన్స్ బ్రదర్స్ చెబితే "నీయమ్మా అది మాటాడాల్సింది ప్రభుత్వంతోరా" అన్న పాపానికి వై.ఎస్. దిక్కు లేని చావు చచ్చాడు. అయినా దీనిపై ఏకమై గళం విప్పే దమ్ము, పరిణితి మన నాయకుల్లో లేదు.

రోశయ్యను ఇష్ఠమొచ్చినట్టు అవమానించేరు. అవమానంతోనే ఇంటికి పంపేరు.అయినా దిల్లీ పిల్లికి గంట కట్టే మొనగాడే లేకపోయాడు. జగన్ తెలుగు  ఆత్మ గౌరవం నినాదాన్ని అందుకుంటే చాలా సంతోషించాను.

కాని అసలు సిసలైన తెలుగువాడు, భారతీయుడు  చంద్రబాబు ఇటాలియన్ మహిళకు, ఆమె  ఏజెంటుగా వ్యాహరిస్తున్న లోకల్ సి.ఎమ్ రైతు వ్యతిరేక విదానాలను నిలదీస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేపడితే కనీశం అతన్ని పరామర్శించ లేకే పోయాడు. చిరు ఏమో జోకులేస్తున్నారు.

ఇంకెప్పటికి తెలుగు గడ్డ మీద మరో ఎన్.టి.ఆర్ మరో వై.ఎస్.ఆర్ పుడతారో వేచి ఉండాల్సిందేనా? పంచ తంత్ర కథలు సైతం చదువుకోలేదా వీరు? శతృవుకు శతృవు మితృడు అన్న కామన్ సెన్స్ కూడ లేకపోయిందా? మనం మనం తేల్చుకుందాం. ముందు విదేశీ పాలనకు చెరమ గీతం పాడుతాం అన్న స్ఫురణ వీరిలో రానే రాదా?

హెచ్చరిక: అంబపలుకు శీర్షికన ఒక కవితా సంకలనం వ్రాత ప్రతి ఉంది.దానిని దశల వారిగా అందివ్వాలన్న ఉద్దేశంతో ఉపోద్ఘాతం ఒకటి నిన్న పోస్ట్ చేసా. ఇందాక చదవని వారు దానిని చదవటానికి ఇక్కడ నొక్కండి

No comments:

Post a Comment