Sunday, December 12, 2010

సి.ఎమ్ గారూ. మా చిత్తూరు సమస్యలు పరిష్కరించరూ !

హెశ్చరిక:
ఈ ఉత్తరం వ్రాసిన తేది చూడండి. జస్ట్ గత శనివారం నాడే కొరియర్ ద్వారా పంపాను..ఆయనగారు స్పీకర్ గా ఉన్నప్పుడు వ్రాసిన ఉత్తరం ఇది.
చిత్తూరు,
18.6.2009
నుండి
ఎస్.మురుగేషన్,
ఎడిటర్,  ఇండియన్ పొలిటికల్ క్లోసప్,
తెలుగు పక్ష పత్రిక, ఏ.పి.టి.ఇ.ఎల్ నెం: 433/2006
12-315, పిళ్ళారి గుడి వీథి,
చిత్తూరు ఆ.ప్ర - 517001
వరకు
శ్రీ ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి గారు,
గౌ.ఆం.ప్ర.శాసనసభ స్పీకర్,
హైదరాబాద్
గౌ. శాసన సభ స్పీకర్ శ్రీ ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి గారికి,
ప్రజలు తమ సమస్యలను స్వయంగా  మీకు తెలపొచ్చని ప్రకటించటం హర్షణీయం. ఈ నేపథయంలో మీకీ ఉత్తరం వ్రాస్తున్నాను. సాధారణ పౌరునిగానే కాక కాంగ్రెస్ పార్టి విజ్యానికి పత్రికా ముఖంగా క్రుషి చేసిన సంపాదకునిగా నాకీ హక్కుందని భావించి వ్రాస్తున్న ఈ ఉత్తరం పై సత్వరం స్పందించి మా నియోజక వర్గానికి న్యాయం చేస్తారని భావిస్తునాను    దివంగత జి,ఎం.సి.భాలయోగి గారి నిర్వాకానికి స్ఫికర్ అన్న పదం విన్నా, పలికినా గుండె పోటువచ్చేంత పని అయిపోతుంది నాకు. ఆ వివరాలను ఈ ఉత్తరం చివర భాగాన వివరించాను. చూడగలరు. ప్రస్తుతానికి చిత్తూరు నియోజక వర్గ వాసిగా,ఒక సంపాదకునిగా,చిత్తూరు యందు కాంగ్రెస్ పార్టి అభ్యర్ది విజయార్థం ప్రచార రథమెక్కి ప్రచారం చేపట్టిన సామాన్య సానుభూతి పరునిగా, సి.కె.శ్రేయోభిలాషిగా  క్రింది విషయాలను మీ ద్రుష్ఠికి తెస్తున్నాను.
ప్రజా బాహుళ్యం కోరిక మెరకు     స్థానిక ఎం.ఎల్.ఎ సి.కె.బాబు గారికి మంత్రి పదవి దక్కి ఉంటే మీకీ ఉత్తరం వ్రాయవలసిన అవసరమే వచ్చి ఉండదు. ఆయన విజయం ఒక ధ్భుతం.అతని సమీప ప్రత్యర్ధి జంగాల పల్లె శ్రీనివాసులు 2004 నుండి దాదాపుగా 40 కోట్ల రూపాయలు వెచ్చించినప్పటికి, చిత్తూరు ఎం.పి డి.కె., రజనికాంత్ అభిమానసంఘం అధ్యక్షులు బుల్లెట్ సురేష్, ఎం.ఎల్.సి ఆర్ .గోపినాథ వంటి వారు ప్రత్యర్దులతో చేతులు కలిపినప్పటికి సి.కె.విజయం సాధించారు. ప్రతి ఒక్కరు సి.కె.ను మంత్రి పదవి వరిస్తుందని ఆకాంక్షించారు. కాని వేలాది మంది సి.కె.అభిమానుల ఆశ నిరాశగా మిగిలింది. ఓకె. ఓకె.  గతం ! గతం !
మా నియోజక వర్గ వాసులుతరపున క్రింది సమస్యలను మీ ద్రుష్ఠికి తెస్తున్నాను. తమరు తప్పకుండా ఈ సమస్యలను పరిష్కరిస్తారని విశ్వసిస్తున్నాను.
సమస్యలు:
*గతంలో  సి.కె. ఇండిపెండెంట్ ఎమ్మెలేగా ,ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న 15 సం.ల్లో సి.కె.మీద కసితో ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలను జిల్లా కేంద్రమైన చిత్తూరు నుండి తరలించారు. వాటిని మళ్ళి చిత్తూరుకు తెప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి.
*చిత్తూరు పట్టణ పరిదిలో బి.వి.రెడ్డి కన్ఫిక్షనరి,సహకార డైరి తప్ప పెద్దగా ఉపాది కల్పించే ఫ్యేక్టరిలు లేవు. అందులోను సహకార డైరి మూతబడింది. దానిని ఎలాగన్నా మళ్ళి తెరిపించాలి. అలాగే బి.వి.రెడ్డి కన్ఫిక్షనరి దాదాపుగా మూత పడినట్లే. కారణాలు ఏమైనప్పటికి తమరు ఈ విషయంలొ చొరవ తీసుకొని ఫ్యేక్టరి గతంలో లాగా ఫుల్ స్వింగ్ లో ఉత్పత్తి చేపట్టేలా చూడాలి. ఫ్యేక్టరి కార్మికుల భవిష్యత్తును కాపాడాలి.
*జిల్లా కేంద్రమైన చిత్తూరులో  ఒక విశ్వవిద్యాలయం తెప్పిస్తే చాలు. ప్రత్యక్షంగా పరోక్షంగా వందలాది మందికి ఉపాది లభిస్తుంది. చిత్తూరు  ప్రాధన్యత పెరుగుతుంది
*టౌన్ బ్యాంకు పునరుద్దరణ విషయంలో  సి.కె. చూపిన చొరవ చేసిన క్రుషి అందరికి తెలుసు. టౌన్ బ్యాంక్ పునరుద్దరణ త్వరగా జరిగేట్లు చర్యలు తీసుకోవాలి. అలాగే ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీల తరహాలో డెయిలి లోన్స్ ఇచ్చే ఏర్పాటు చెయ్యాలి
*గుడిపాల మండల పరిదిలో బ్యాంకు మరియు ఏ.టి.ఎం కావాలన్నది ఆ ప్రాంత ప్రజల కోరిక దీని పై కూడ సత్వరం స్పందించ వలసి ఉంది,
*చిత్తూరు రూరల్ మండలం , గుడిపాల మండలం,చిత్తూరు పట్టణ నిరుధ్యోగులకు ఉధ్యోగవకాశం కల్పించే విదంగా మూడు పెద్ద ఫ్యేక్టరిలను ఆయ  ప్రాంతాల్లో నెలకొల్పేలా చూడాలి.
*ముందుగా నియోజక వర్గ పరిదిలోని నిరుధ్యోగ యువత బయోడేటాలను తెప్పించుకుని వారికి తగిన సాంకేతిక విథ్య,శిక్షణ లభించేలా చూడాలి. ఆ పై వారికి వృత్తు,ఉధ్యోగ అవకాశాల కల్పనకు, రుణ సహాయానికి ఏర్పాటు చెయ్యాలి.
*తగిన ఉపాది,ఉధ్యోగవాకాశాలు లేక యువతలో అధిక సంఖ్యాకులు మద్యానికి భానిసలైయున్నారు. వారికి డి-ఆల్కహాలిక్ క్యేంపులు నిర్వహించాలి.
*చిత్తూరు నియోజిక వర్గ పరిదిలో జరుగుతున్న త్రాగు,సాగు నీటి ప్రాజెక్టులు సత్వరమే పూర్తి కావడానికి క్రుషి చెయ్యాలి.
* పురపాలక ఉధ్యోగులు చాలా మందికి వ్యక్తిగత ఆర్థిక సమస్యలు,ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా చాలా మంది ఆల్కహాలిక్స్ గా ఉన్నారు. ఈ అంశాలు వారి పని సామర్థయాన్ని భాగా దెబ్బ కొడుతున్నాయి. ఈ విషయాల పై తమరు చొరవ చూపి పురపాలక యంత్రాంగాన్ని ప్రక్షాళణ చెయ్యవలసి ఉంది. పురపాలక సిబ్బంది పని తీరును మెరుగు పరచాలి. (పురపాలక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇది మీ తక్షణ కర్తవ్యం కావాలి. లేకుంటె గత ఎన్నికల్లో తె.దే.పా సింగిల్ డిజిట్ కు పరిమితమైనట్టు కాంగ్రెస్ పార్టి గతి అధోగతి అయ్యే అవకాశం ఉంది.
* పురపాలక ఉధ్యోగులకు  వైద్య పరీక్షలు చెయ్యించి ఉచిత వైద్య  సౌఖర్యం కల్పింఛాలి. ఆలాగే వారికి వారి కుటుంభ సభ్యులను ఉత్సాహ పరచి  మోటివేట్ చేసేవిదంగా కౌన్సిలింగ్,గెట్ టు గెదర్ ప్రోగ్రాములు,టూర్స్ ఏర్పాటు చెయ్యాలి.ప్రైవేటు రుణ వత్తిళ్ళనుండి ఉపసమనం కల్పీంచాలి.
*ట్రాఫిక్ ను అస్త వ్యస్తం చేస్తున్న ఆక్రమణలను పార్టీలకు అతీతంగా  తొలగించాలి.
*పర్యావరణం పై ద్రుష్ఠి. పాలితీన్ సంచుల వాడకం పై ఉక్కుపాదం మోపాలి. అలాగే మంగ సముద్రం హవుసింగ్ కాలని వద్ద ఏర్పాటు చేసిన చెత్తలనుండి ఎరువుల యూనిట్ త్వరగా  పని ప్రారంభించేలా చూడాలి, అలాగే చెత్తలనుండి విద్యుత్ తయారు ఏసే ప్రక్రియ ముందు పెట్టాలి
*పట్టణ నడిబొడ్డున ఉన్నరాములవారిగుడి ఉత్సవాల పునరుద్ద్రణ పై ద్రుష్ఠి సారిస్తే ఆస్తికుల మన్నెనలు పొందుతారు.
*నూటికి పది వడ్ది వసూళ్ళపై ఆంక్షలు కఠిన చర్యలు.
*ఒకే సమయంలో వంద మంది బ్రౌజింగ్ చేసుకునేందుకు బ్రౌజింగ్ సెంటర్. రైస్ కార్డ్ హోల్డర్సుకు రెండు రూపాయల రాయితీ
*అదే ప్రాంగణంలొ ఉదయం 6 నుండి  8 దాక అర్హులచే  రైస్ కార్డు హోల్డర్సుకు కంప్యూటర్ శిక్షణ సగం ఫీజుకే  ఏర్పాటు చెయ్యొచ్చు.
*చిత్తూరు పాత బస్ స్టాండు పునరుద్దరింపభడి మంచి స్థితిలోనే ఉంది  అక్కడ త్రాగు నీటి సౌఖర్యం ,ప్రయాణికులను ఎండావానలనుండి రక్షించే షెల్టర్ లు ఏర్పాటు చెయ్యాలి.
*పాత బస్ స్టాండును బ్రష్ఠు పట్టిస్తున్న  షికారులకు సినిమా సెటింగ్స్ తరహాలో తాత్కాలిక షాపులు ఏర్పాటు చెయ్యాలి. కనీశం  బస్ స్టాండు ప్రాంగనంలో వారు,వారి పిల్లలు స్నానాలన్నా చెయ్యకుండా చూడాలి.
*పాత బస్ స్టాండు పరిసర ప్రాంతాల్లో త్రోపుడు బండ్ల వలన ట్రాఫిక్ సమస్యలే కాక ఈవ్ టీజింగ్ సమస్యలు కూడ వస్తున్నాయి. పాత బస్ స్టాండు పై సీలింగ్ ఏర్పాటు చేసి దాని పై వారికి నిరంతర షాపులు నిర్మించి ఇవ్వవచ్చును.
* చర్చి వీదిలోని కూర గాయల మారెకెట్ ను కూల దోసి కొత్తగా నిర్మాణం చెయ్యాలి. మూడంతస్తులుగా నిర్మించి మొదటి అంతస్తును పార్కింగ్ కు పరిమితం చెయ్యాలి. ఈ పని చెయ్యకుంటే ట్రాఫిక్ సమస్యల కారణంగా 108 వహణాలు సైతం ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుంటున్నాయి.
* పలమనేరు రోడ్డుయందు  నిర్మాణంలో ఉన్న ఆడిటోరియం పూర్తికాగానే ప్రజలకు ద్రుడ శరీరం, గాలికంటే తేలికైన మనస్సు,పవిత్రమైన ఆత్మను ప్రసాదించగల స్రుజణాత్మక కార్యక్రమాలకు ఉచితంగా కేటాయించాలి
*గ్రంథాలయాలకున్న ప్రాముఖ్యత తమకు తెలిసిందే. కాని నేటి తరం పూర్తిగా పుస్తకాలకు దూరమై పోతూంది. ప్రస్తుతమున్న కేంద్రీయ గ్రంథాలయాన్ని పట్టణపు నడిబొడ్డుకు మార్చటానికి ప్రయత్నించాలి. లేదా కనీశం ఒక శాఖనన్నా పట్టణపు నడిబొడ్డున ఏర్పాటు చెయ్యాలి. అలాగే ప్రస్తుతమున్న గ్రంథాలయంలో కనీశం 25,000 మంది యువత కొత్త్గగా సభ్యులయ్యేలా చూడాలి. అలాగే అక్కడ జిరాక్స్ మిషన్ ఏర్పాటు చేసి పావలాకే ఒక  కాపి జిరాక్స్ తీసుకునే ఏర్పాటు చెయ్యాలి
*వై.ఎస్.పేరిట యువజన సంఘాలు ఏర్పాటు చెయ్యాలి. వాటి తరపున  కనీశం 2 వార్డులకు ఒకటి చొప్పున రీడింగ్ హాలు, జిమ్ము,యూత్ క్లబ్ ఏర్పాటు చెయ్యాలి.
*కసాయి మార్కెట్ లో పారిశుద్యం అద్వాన్నంగా ఉంది. నీళ్ళు భయిటనుండి తెప్పిస్తున్నారు. అక్కడే బోరు వెయించి పారిశుధ్యం పై నిఘా పెంచాలి
*పట్టణ ప్రాంతంలో పబ్లిక్ యూరినల్స్ పెద్ద ఎత్తున ఏర్పాటు చెయ్యాలి.  మూత్ర విసర్జణ ఉచితమని ప్రకటిస్తే మంచిది. ఇది  మహిళలకు ఎంతో ఉపకరిస్తుంది.
*డ్వాక్రా గ్రూపులను ఉత్పత్తి రంగంలో ప్రోత్సహింఛాలి. యువజన సంఘాలను మార్కెటింగ్ కు వినియోగించుకోవచ్చు.
*ప్రస్తుతం కట్టమంచి చెరువులోని మురికి నీళ్ళను నీవానదిలో విడిచిపెట్టే ఏర్పాటు జరుగుతున్నట్టు వార్తలొచ్చాయి. దీని కన్నా నిఫుణలతో ఆలోచించి కట్టమంచి చెరువును ఒక మెగా ఇంకుడు గుంతగా మార్చే ప్రయత్నం చెయ్యాలి.
*పురపాలక సంస్థ వంటివి తమ విద్యుత్ వినియోగార్థం సోలార్ పవర్ యూనిట్స్ ఏర్పాటు చేసుకునేలా చూడాలి.
*ప్రైవేటు సంస్థల్లో పని చేసే చిరు ఉధ్యోగులకు గ్రూపు భీమా వసతి, కనీశ వేతనం, పిఎ.ఫ్ లు అమలయ్యేలా చూడాలి. ముఖ్యంగా మహిళా ఉధ్యోగుల అరిస్థితి ధారుణంగా ఉంది. బాత్రూమ్స్ లేవు, రెస్ట్ రూమ్స్ లేవు. కనీశం ఇద్దరు ముగ్గురు ఎంప్లాయర్స్  కలిసి ఈ ఏర్పాట్లు చేసి ఉమ్మడిగా తమ ఉధ్యోగులు లభ్ది పొందేలా చెయ్యొచ్చు.
*ఇందిరమ్మ ఇళ్ళకు సోలార్ పవర్ అందే ఏర్పాటు చేస్తే మంచిది. అలాగే కొత్త కాలనీలు సాముహిక ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకునేలా చూడాలి.
*నీవా నది ప్రక్షాళనకు ప్రయత్నం. ఆక్రమణల తొలగింపు.
*రాజీవ్ గ్రుహ కల్ప ఏమైందో చూసి ఫాస్ట్ అప్ చెయ్యాలి.
*పురపాలక సంస్థకు వెబ్ సైట్  ఎర్పాటు చేసి . ఆన్ లైన్ సేవలు.అందింఛాలి.
దివంగత బాలయోగి ఉదంతం:
మన దేశ సర్వ సమస్యలకు సమూల పరిష్కారంగా నేను రూపొందించిన అపరేషన్ ఇండియా 2000 పథకం యొక్క 200 ప్రతులను 1998,జూన్ 11 న ఆర్.పి.ద్వారా నాటి లోక్సభా స్పీకర్ జి.ఎం.సి.బాలయోగిగారికి పంపాను. అప్పటి రూలింగ్ కొయ్లిషన్ ఎం.పిలకు అందేలా చూడమని కోరాను. అమ్మ బాబోయి ! మొదట ఏమో ప్రతులు అందనే లేదని భుకాయించారు. వారికి డెలివరి అయినట్టుగా రుజువులు పంపితే "మీ పార్సెల్ గుర్తించ లేక పోయాం..కేవలం ఒక కాపి పంపితే అవసరమైనన్ని ప్రతులు తయారు చేశి ఎం.పి.లకు అందిస్తామనేరు. కొత్త ప్రతి పంపినా ఈ నాటివరకు ప్లాన్ ప్రతులు ఎం.పి.లకు అందనే లేదు.
ఇ మెయిల్ ద్వారా పంపితే ప్రతి మెయిలు నో సచ్ యూజర్ అంటూ తిరిగొచ్చేసింది.
ఇంతకీ నా ప్లాన్ వివరాలు క్లుప్తంగా:
అధ్యక్ష తరహా పాలన అమలు, దేశంలోని పది కోట్ల మంది నిరుద్యోగులతో ప్రత్యేక సైన్యం ఏర్పాటు, సైన్యం చేత నదుల అనుసంధానం, జాతీయ స్థాయిలో రైతు సంఘాలు ఏర్పాటు చేసి - దేశంలోని వ్యవసాయ పొలాలన్నింటిని సదరు సంఘానికి లీజు ప్రాతిపదికన ఇచ్చి సమిష్టి వ్యవసాయం జరిగేలా చూడటం, ప్రస్తుత కరెన్సి రద్దు చేసి కొత్త కరెన్సి అమలు చెయ్యడం. పాత కరెన్సి ఉన్నవారు వాటియొక్క చట్టబద్దతను నిరూపించి కొత్త కరెన్సి పొందేలా చూడటం. అందుకు పూర్వం భారత దేశంలోనే స్విస్ బ్యాంకు తరహా బ్యాంకు ఒకటి నెల కొలపడం. ప్రణాళిక ఇచ్చి చేతులు దులుపుకోకుండా ప్లాన్ అమలుకు కావల్సిన నిథుల సమీకరణకు కూడ ఎకానమి ప్యేకేజి పేరిట సలహాలిచ్చాను. ప్రజల పై ఎట్టి భారం పడనీయక ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు ఇందులో ఉన్నాయి. అలాగే తపాలా శాఖ, రైల్వే శాఖ, ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థ, తి.తి.దే. వంటి ప్రముఖ దేవస్థానాల్లో సంస్కరణలు తెచ్చి నిర్వహణ వ్యయాన్ని తగ్గించి మిగులు పాటు అయ్యే సొమ్మును బ్యాంకుల్లో ఎఫ్.డి.లుగా ఉంచేలా చేసి బ్యాంకులనుండి రుణం పొందే వీలు కల్పించే సలహాలు కూడ పై ఎకానమి ప్యేకేజిలో ఇచ్చాను
ఇట్లు
ఎస్.మురుగేషన్,

2 comments:

  1. సాంబారూ, నువ్వు జగను వైపా? సీకే బాబు వైపా?

    ReplyDelete