Thursday, December 2, 2010

కొత్త సి.ఎం. బవితవ్యం -చెదులు పట్టనున్న కాంగ్రెస్ - ఒక న్యూమరాలజికల్ స్టడి

ఏ.పి.కొత్త సి.ఎం కిరణ్ పుట్టిన రోజు 13- 9 - 1960 . ఇతని పుట్టిన తేది 13. ఇది ఎంతటి దురదృష్ఠకర,వినాశకారి సంఖ్యో అందరికి తెలుసు. 1+3=4 కాబట్టి ఇతని   ప్రాణ సంఖ్య 4.

స్థూల సంఖ్య 2. నాలుగు రాహువుకు సంభందించిన సంఖ్య. రాహు లాటరీలకు అధిపతి. రెండు చంద్ర సంభంధ అంకె. చంద్రుడంటేనే యాధృచికం అని అర్థం. రోశయ్య సి.ఎం కావడానికైనా ఒక తర్కం ఉపకరించింది. నెంబర్ టూ అని, వివాద రహితుడని, అందరికి ఆమోద యోగ్యుడని. కాని కిరణ్ ఎంపిక జస్ట్ ఒక లాటరిలా, యాధృచికంగా జరిగింది.

చంద్ర,రాహు కలయక ఊపిరి తిత్తులు,మనస్సు,కిడ్ని సంభంధ రుగ్మతలిస్తుంది. పైగా ప్రజలచే తిరస్కరింప బడే ప్రమాదముంది. ఇంకాస్త లోతుగా చూస్తే రాహు అన్నది కుట్రలకు కారకం వహించే గ్రహం. చీకటి శతృవులు,అనుకూల శతృవులు అంటామే అట్టి నేపద్యాన్ని సూచిస్తుంది. జాతకుడు సైతం ఇట్టి గుణ గణాలు కలిగి ఉండవచ్చు.

సోనియా గురించిన అనలైజ్ లో చెప్పినట్టుగా రాహు కూడ పాప గ్రహమే కాబట్టి కిరణ్ జీవితాన్ని నాలుగేసి సంవత్సరాలతో కూడిన రౌండ్స్ గా విభజించవచ్చు. ఒక రౌండుకు నాలుగు  సం.లంటే ఇప్పటికి పన్నెండు రౌండ్స్ పూర్తైనాయి. (12X4=48) ఒక పెద్ద రౌండు పూర్తై.. మరో పెద్ద రౌండులో తొలి  రౌండ్లో ఉన్నారన్న మాట. ఇది మరో రెండు జన్మదినాలదాక వర్తిస్తుంది.అంటే  52 సం.ల వయస్సుకు పూర్తవుతుంది

ఇది రాహు జన్మలగ్నంలో ఉన్న ఫలితాన్నిస్తుంది. జన్మ రాహు వలన కుట్రలకు బలికావడం, ఏకాకి కావడం వంటి ఫలితాలు జరుగవచ్చును.

పోని ప్రాణ సంఖ్యను సింగిల్ నెంబర్ చెయ్యకుండానే కిరణ్ జీవిత కాలాన్ని పదమూడేసి సం,లు గల రౌండ్స్ గా విభజిస్తే నాలుగవ రౌండులో ఉన్నారు. నాలుగు అన్నది స్వపక్షాన్ని సూచిస్తుంది.  గోచారంలో నాలుగున రాహు ఉన్న ఫలితాన్నిస్తుంది. సాధారణంగా ఇది శుభప్రదమని శాస్త్ర్రం చెబుతున్నా అనుభవంలో చూసినప్పుడు ఉన్న ఇల్లు ( కాంగ్రెస్ కావచ్చు - శాసన శభ కావచ్చు- శచివాలయం కావచ్చు- వీరు అమ్మా అమ్మా అని నెత్తిన పెట్టుకుని ఊరేగే సోనియా కూడ కావచ్చు - నాల్గవ భావం తల్లిస్ని కూడ సూచిస్తుంది)  చెదులు పట్టడం, పాము దూరడం ,జాతకుడు ఇల్లు మారవలసి రావడం వంటి ఫలితాలు జరుగుతాయి.

ఈ పరిణామాలు జాతకుని జీవితంలో మంచి మార్పులను తెచ్చి ఎదిగేలా చేస్తుంది. (రోడ్డున పడితే మనిషిలో కసి పుడుతుంది. ఆ కసితో అభివృద్ది చెందుతాడు అని దీని గూడార్థం)

అందుకే చెబుతున్నా కిరణ్ తో కాంగ్రెస్ చెదులు పట్టి పాము పుట్టలా తయారు కావడం తథ్యం. కిరణ్ తన 52  -65 వయస్సుల నడుమ ఎన లేని అపఖ్యాతికి -పుత్ర శోకానికి- అవమానాలకి గురవుతూ కాలం గడిపి 65 సం.ల వయస్సు తరువాత జిల్లాలో తిరుగులేని శక్తిగా ఎదగవచ్చు (ఆయుష్షు సహకరిస్తే)

No comments:

Post a Comment