Sunday, December 12, 2010

మిమ్మల్ని ఎవరు అభిమానిస్తారు?

తొలూత కొంత స్వంత డబ్బా :
1991 అనుకుంటా. ఇదే శీర్షికలో పాకెట్ సైజు పుస్తకం ఒకటి ప్లాన్ చేసాను. ( అప్పట్లో నా వయస్సు 24?) 1987కే కాలేజ్ పూర్తైనప్పటికి యువతరంతో మంచి టచ్ ఉండెది. వారిలో చాలమంది అడిగే ప్రశ్న ఏ పేరున్న అమ్మాయిని ప్రేమిస్తే సక్సెస్ అవుతుంది? ఇలా ప్రతి ఒక్కరికి ఒర్క్ అవుట్ చేసి చెప్పి చెప్పి విసిగి పోయి ఒక పాకెట్ బుక్ ముద్ర  వేసి పెట్టుకుంటామని డిసైడ్ అయి పోయా. ప్రింట్ చేసా. మరీ అడ్వాన్స్ బుకింగ్లతో. రెండు వేల కాపీలకు ఆర్డర్ బుక్ అయ్యింది. ( మిని జ్యోతిష్  బోధిని -శీర్షికలో ఇటీవల ఒక బుక్ ప్రింట్ చేసా - అది జస్ట్ ఐదు వేల ప్రతులు -ఇదీ అడ్వాన్స్ బుకింగే)

అందులో ఏం వ్రాసానని అడుగుతారు . చెబుతా. జోతిషంలో దశవిద వివాహ పొంతనాలని ఒక కాన్సెప్ట్ ఉంది. దానినే సరళీకరించి , వ్రాసానన్న మాట . అందుకని ఇదే ఫైనల్ అని నిర్ధారించలేదు. (అప్పట్లోనే హేతుబద్దత) ముందుగా జాతకాలు కుదరాలి.  దోషాలుంటే ఇద్దరికీ ఉండాలి. (మరీ అదే రకం- అదే స్ధాయి దోషం ఉండాలి)
పేర్ల ద్వారా దోషాలు తెలియవు. నక్షత్ర  ప్రకారం పేరు పెట్టి ఉంటే తప్ప ఈ బుక్ మీకు పనికిరాదు అంటూ సుదీర్ఘమైన ఉపోద్ఘాతంతో ప్రింట్ చేసాను.

ఈ శీర్షిక ఎవర్ గ్రీన్ కాబట్టి బ్లాగ్లోకానికి నివేదిస్తున్నాను. ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ను బట్టి మీ జన్మ నక్షత్రం ఏమిటో,మీ రాశి ఏమిటో తెలుసుకొండి. ( వీటిని క్రింది వెబ్ సైట్స్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు)

http://www.astroloka.com
http://www.scientificastrology.com
http://www.freehoro.com

ఓకే పై సైట్స్ ద్వారా మీ జన్మ నక్షత్రం ఏమిటో తెలుసుకున్నారుగా.. మొత్తం 27 నక్ష్త్రాలున్నాయి. నక్షత్రాన్ని బేస్ చేసుకుని సాధారణంగా పది పొంతనాలు చూస్తారు. కాని వాటిలో రెండు పొంతనాలు చాలా కీలకమైనవి. అవి నాడి,మరియు రజ్జు పొంతనాలు.  వీటితో పాటుగా కనీశం ఆరన్నావస్తేనే వివాహం  చేస్తారు. ఈ రెండు సరిగ్గా రాకుండా పదికి ఎనిమిది వచ్చినా చెయ్యరు.

నక్ష్త్రాలకున్న ప్రాధన్యత ఏమిటో నక్ష్త్రత్రాలను బట్టి ఏం మునుగుతుందో మరో సందర్భంలో చెప్తా.

నాడి పొంతనం:
నాడిని పట్టి నక్షత్రాలను మూడు గ్రూపులుగా విభజించి ఉన్నారు.  కామ్రెడ్స్ ఇన్ డెస్ట్ర్త్రస్, ఒకె జాతికి చెందిన పక్షులు ఇత్యాదులు వివాహ విషయంలో పనికి రావు. ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్ అన్న సూక్తియే పనికొస్తుంది. దీని ప్రకారం మీ/మీ ప్రియురాలి నాడులు వేరు వేరై ఉండాలి. ఒకే నాడికి చెందిన వారు ప్రేమించినా, పెళ్ళి చేసుకున్నా వియోగాలు,అగుసాట్లు తప్పవు.

ఆది నాడి:
అశ్విని,ఆరుద్ర,పునర్వసు,ఉత్తర,హస్త,జేష్ఠ,మూల,శతబిష,పూర్వాబాద్రా,

మద్య నాడి:
భరణి,మృగశిర,పుష్యమి,పుబ్బ,చిత్త ,అనురాధా,పూర్వాషాడ,దనిష్ఠ,ఉత్తరాబాధ్రా,

అంత్యనాడి:
కృత్తిక,రోహిణి,ఆశ్లేష,మఖ,స్వాతి,విశాఖ, ఉత్తరాషాడా,శ్రావణ,రేవతి

రజ్జు పొంతనం:
నాడిని పట్టి నక్షత్రాలను గ్రూపులుగా విభజించినట్టే రజ్జును పట్టి కూడ ఐదు గ్రూపులుగా విభజించారు. నాడిలాగే రజ్జు కూడ వేర్వేరై ఉండాలి. ఏక రజ్జు ఉంటే ప్రేమించినా, పెళ్ళి చేసుకున్నా వియోగాలు,అగుసాట్లు తప్పవు.


పాద రజ్జు:
అశ్విని, ఆశ్లేష,మఖ,జేష్ఠ,మూల,రేవతి

ఊరు రజ్జు:
భరణి,పుష్యమి,పుబ్బ,అనురాధ,పూర్వాషాడ,ఉత్తరాబాద్రా

ఉదర రజ్జు:
కృత్తిక,పునర్వసు,ఉత్తర,విశాఖ,ఉత్తరాషాడ,పూర్వాబాద్రా

కంఠ రజ్జు:
రోహిణి, ఆరుద్ర,హస్త,స్వాతి,శ్రావణ,శతబిష

శిరో రజ్జు:
మృగశిర,చిత్తా,దనిష్ఠ,

గమనిక: ఈ రెండు అంశాలే కీలకం  కాబట్టి ఈ రెండింటిని మాత్రమే ఇచ్చాను. మీ ప్రియురాలు/ప్రియుడి నాడి/రజ్జు - మీ నాడి రజ్జు ఏకమైతే /ఒకటే అయితే మంచి స్నేహితులుగా ఉండి పోవడమే బెటర్

No comments:

Post a Comment