మన పూర్వీకులు ఎంతో తెలివైన వారు. టెలస్కోపులు లేని రోజుల్లోనే గ్రహ స్థితులను అంచనా వేసి ఎండా,వానా,గాలి,గ్రహణం అన్నింటిని ముందుగా గణించగలిగినారు. ప్రకృతిని అర్థం చేసుకుని ప్రకృతిని ఆరాదిస్తూ,సంరక్షిస్తూ , ప్రకృతికి దగ్గ్గరగా జీవించారు. నేడు మనం ప్రకృతికి దూరంగా దూరంగా వచ్చేసాం కాబట్టే మన జీవితాలు అస్తవ్యస్థంగా తయారయ్యాయి. నాటి అన్యుల దండ యాత్రలు తద్వారా వారు దోచుకెళ్ళిన స్థూల ఆస్తులు జాతి సంపదలు ఒక ఎత్తైతే.. అన్య నాగరికతల పై మోజుతో మనకు మనమై పోగొట్టుకున్న జ్నాన సంపద మరో ఎత్తు.
మన పూర్వులు ఎంత తెలివైన వారంటే సామాన్య సాంఘిక,ఆర్థిక యాక్టివిటీస్, ఆరోగ్య సూత్రాల అమలు , వ్యాధి నిరోధక పద్దతుల అమలును సైతం దైవంతో ముడి పెట్టి ఆథ్యాత్మికతతో మిళితం చేసి ఆచరణలో పెట్టేరు. నేటి తరం వారిని గంగ జాతర ఎప్పుడు వస్తుంది అని అడిగితే మే నెలలో వస్తుందంటారు. కాని జాతర ఎప్పుడు నిర్వహించాలన్న నిభంధనలోనే మన పూర్వుల మేథో శక్తిని మనం అర్థం చేసుకోవచ్చు. చైత్ర మాసంలో ఐదవ మంగళవారం నాడు జాతర చేస్తారు. ఈ కాల నిర్ణయం వెనుక ఎన్నో తర్కాలున్నాయి.
మండుటెండలు. సూర్య గ్రహం తన ఉచ్చ రాశియైన మేష రాశి మరియు వృషభ రాశుల్లోని తన స్వంత నక్షత్ర మండలమైన కృత్తికలో సంచరిస్తూ భగ భగ కాలి పోతుంటాడు. మనిషి శరీరంలో 70శాతం నీటి పదార్థమే ఉన్నది. ఎండ దెబ్బకి పెరిగి పోయిన తన ఉష్ణోగ్రతను తగ్గించుకోవడానికి శరీరం చెమట రూపంలో తనలోని నీటి పదార్థాన్ని విడుదల చేసి డీ హైడ్రేషన్ కు గురవుతుంది. ఎండ దెబ్బకి జల వనరులు ఇంకి పోయి అడుగంటిన కలుషిత నీరును ప్రజలు త్రాగడం వలన ,వడ దెబ్బ వలన అతిసార ( విరేచనాలు) మొదలవుతుంది. పైగా ఇది అంటురోగం కావడంతో గ్రామం గ్రామమే, ఊరు ఊరే రోగాల భారిన పడే ప్రమాదం ఉంది. కొన్ని సందర్భల్లో ఈ అతిసార చేత ఆరోగ్యవంతులు, భలవంతులైన మనుషుల ప్రాణాలే గాలిలో కలిసి పోతాయి. ఇంకా పసి పాపలు, పిల్లలు, వృద్దుల కథ వేరే చెప్పక్కర్లేదు.
మరి వీటన్నింటికి పరిష్కారం ఏది ? జాతర నిర్వహణ. గంగ అన్నది కేవలం ఒక నది పేరు కాదు . భూగర్భ జలాలను పాతాళ గంగ అంటారు, మంచం పట్టి ఉన్న రోగి గురించో, అలక పానుపు ఎక్కిన అమ్మాయి/మహిళ గురించో ప్రస్తావించినప్పుడు గుక్కెడు గంగన్నా ముట్ట లేదు అంటారు. అంటే ఇక్కడ గంగ అన్న పదం కేవలం ఒక్క గంగా నదిని మాత్రమే సూచించటం లేదు. ఈ ప్రపంచంలోని జలవనరులన్నింటిని సూచిస్తుంది. ( కామన్ నౌన్ ప్రాపర్ నౌన్ అయి పోయింది)
హేతువాదులు ప్రశ్నించ వచ్చు .ఎవరీ గంగమ్మ? అని ఆమె ఎలా పుట్టింది. ఆమె పుట్టు పూర్వోత్తరాలేమి? అని గుచ్చి అడుగ వచ్చు. పవిత్ర గంగా నదికైతే ఓ కథ ఉంది. శివుని శిరస్సును పుట్టిందని, ఆయన శిరస్సునే కొలువుందని చెబుతారు. (హిమాలయ పర్వత శిఖరాల్లోనుండి పుట్టింది అన్న మాటను కాస్త పొయటిక్ గా చెప్పేరు అంతే ) మరి ఈ గంగమ్మ ఎవరు? అని హేతువాదులతో పాటు నేటి మెకాలే ప్రభువులవారు ప్రవేశ పెట్టిన విద్యను అభ్యసించిన తరం, యువతరం ప్రశ్నించవచ్చు.
"మా తెలుగు తల్లికి మల్లె పూ దండా" అని పాడుకుంటాం . ఆ తెలుగు తల్లి ఎక్కడిది? భారత మాతాకి జై అని నినదిస్తాం .ఆ భారత మాత ఎక్కడిది? ఓ రాష్ఠ్రా)న్ని, ఓ దేశాన్ని ఎలా ఒక తల్లి రూపమిచ్చి కొలిచి కొనియాడుతామో అలానే మన పూర్వులు జల వనరులకి ఒక మాతృ స్వ రూపాన్ని ఇచ్చేరు. ఆ రూపమే గంగమ్మ. ఇదో కోణమైతే కాలచక్ర భ్రమణంలో ఎక్కడో,ఎప్పుడో కరవు కాటకాలు భాధిస్తూనే ఉంటాయి.
అటువంటి క్లీష్ఠ పరిస్థితిలో ప్రజలంతా ఏకమై ఆ కరవును జయించటానికి ఏదో ప్రయత్నం చేసి ఉండవచ్చు. అది ఒక భావిని త్రవ్వడం కావచ్చు, ఒక ఏరు,ఒక కొలను పూడెత్తే కార్యక్రమం కావచ్చు. ఆ ప్రయత్నంలో ఎవరో మహిళ ఒక ప్రమాదవశాస్తూ మరణించి ఉండ వచ్చు. ఆమె సామాన్య మహిళే అయినప్పటికి ఒక పవిత్ర కార్యక్రమంలో
నిస్వార్థంగా పాలు పంచుకుని తన ప్రాణాలు భలి చేసింది కాబట్టి ఆ ఊరి ప్రజలకు ఆమె ఒక దేవత . ప్రతి వేసవిలో ఆమెకోసం జాతర నిర్వహించాలని నిర్ణయించి ఉండవచ్చు. తరాలు అంతరించి కొత్త తరాలు వస్తుండటంతో సతరు సమాచారం మూలన పడి జాతరలు మాత్రం జరుగుతుండ వచ్చు.
ఇలా గంగ జాతర పై ఎన్నైనా కారణాలు చెప్పుకోవచ్చు. కారణం ఏదైనప్పటికి, దేవత ఎవరైనప్పటికి ఆ దేవత ఒక మానవ స్త్ర్రీయే అయినప్పటికి జాతర నిర్వహణలో ఎన్నో హేతుబద్దమైన అంశాలున్నాయి.
గంగమ్మకు నైవేద్యంగా అంబలి పెడతారు. తామూ ప్ర్సాదంగా సేవిస్తారు. సదా సర్వ కాలం భియ్యం ఒండి తినడంతో 30 ఏళ్ళు దాటినవారంతా తప్పనిసరిగా షుగర్ పరీక్ష చేసుకోవలసిన దుస్థితి ఉంది. అంబలికి వాడే రాగిలో షుగరుకు దారి తీసే కార్భో హైడ్రేట్ లేదు. పైగా పుష్కలమైన ఐరన్ ఉంది. వేసవికి పెరిగి పోయే శారిరక ఉష్ణోగ్రతను తగ్గించి, ఉష్ణ రోగాలను వారించ కలుగుతుంది.
ఇన్ని మహత్యాలు గల అంబలిని కేవలం జాతర రోజుల్లోనే కాక వేసవి పొడవునా ఆరగించినా మంచిదే.
గంగమ్మకు ప్రీతికరమని గంగమ్మ కొలువు తీరిన ప్రదేశాన్ని, అక్కడికి వెళ్ళే దారిని ,ఇళ్ళ గుమ్మాలను వేపాకుతో అలంకరిస్తారు. చెట్లు ఆకుల్లోని సన్నని రంద్రాల ద్వార స్వాస పీలుస్తుంటాయని చదివి ఉంటారు.ఆ రంద్రాలు వేపాకులో పెద్దవిగా ఉంటాయి. సాధారణంగా చెట్లు పగటి పూట కార్బండై ఆక్సైడ్ పీల్చి ఆక్సిజన్ ను విడుదల చేస్తుంటాయి. సాయంత్ర వేళల్లో ఆక్సిజన్ ను పీల్చి కార్బందై ఆక్సైడ్ ను విడుదల చేస్తుంటాయి. కాని వేప చెట్టు మాత్రం రెండు పూటలా ఆక్సిజన్ ను మాత్రమే విడుదల చేస్తుంది.
పైగా వేపాకు క్రిమిసంహారక సామర్థ్యం కలిగి ఉంది.ప్రస్తుతం సేంద్రియ ఎరువుల తయారిలో ప్రముఖంగా వాడుతున్నారు. ఇదేదో చేదస్తం అనుకునేరు. విదేశాల్లో సేంద్రియ ఎరువుతో పండిన దాన్యాలకు విపరీతమైన గిరాకి ఉంది. ఇళ్ళల్లో సైతం భియ్యం, పప్పులు నిల్వ ఉంచినప్పుడు వాటిలో కొంత వేపాకును వేసి ఉంచితే పురుగులు పడవు. పైగా పచ్చని ఆకులు కంట పడుతుంటే అది మనిషిని సైకలాజికల్ గా కూడా ఉత్సాహ పరుస్తాయ.
ఇన్ని మహత్యాలు కల్గిన వేపాకును ఉత్తుత్తే అలంకరణకు వాడటం కన్నా వేప చిగుళ్ళను ఆరగించండి. పిడికిలి వేపాకును నీట వేసి కాగ పెట్టి వడ పోసి త్రాగండి. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. కామ వాంచలు కూడ కట్టిడి అవుతాయట.
గంగ జాతరలో ప్రముఖంగా వాడే మరో ఐటం నిమ్మకాయ. దీనిని పిండి రసం త్రాగండి. ఆస్తికులే అయినప్పటికి గంగమ్మ అంటే అది కేవలం గ్రామ దేవతని చునకన భావం వ్యక్తం చేసేవారూ లేక పోలేదు. భగవద్గీతలో శ్రీ కృష్ణుడు భక్తులు ఏ రూపాన నన్ను ఆరాధిస్తే ఆ రూపాన నేను వారికి కరుణ్దిస్తాను అని చెప్పేడు.
స్వామి వివేకానంద స్వామైతే " నీ ప్రార్థన ఫలిస్తే ఆ ఫలం మరెక్కడనుండో అందలేదు. నీ నుండే అందింది"అంటున్నాడు. మీ శరీరంలో 70 శాతం నీటిపదార్థమే అని ఇదివరకే చెప్పడం జరిగింది. జీవనాధారమైన నీటికి ప్రతీక గంగమ్మ. ఆమె మీలోనే కొలువుంది. మీ ఉనికికి ఆవిడే మూలాధారం. సృష్ఠిలో మొదటి జీవ రాశి పుట్టింది కూడ నీటిలోనే.
ఎడా పెడా పరిశ్రమలు పెట్టి గాలిని,నీటిని,ప్రకితిని కలుషితం చేసి సదరు స్వయంకృతాపరాథం కారణంగా జీవనదులు పారే పవిత్ర భారత దేశంలో నీటిని అమ్ముకునె స్థితికొచ్చాం. పైగా ఈ నీటి వ్యాపారం పై ఉక్కు పాదం మోపాలని చిత్తూరు ఎం.ఎల్.ఏ శ్రీ సి.కె.బాబుగారు నడుం బిగిస్తే ఆ ఉద్దేశం వెనుకున్న పవిత్రతను అర్థం చేసుకోలేని యాంత్రిక జీవితానికి అలవాటు పడి పోయిన మనం గంగ జాతర సందర్భంగానన్నా అడుగంటి పోతున్న నీటి వనరులను దృష్ఠిలో ఉంచుకొని నీటిని పొదుపుగా వినియోగించటం, రీ సైక్లింగ్ గురించి ఆలోచించి అమలు చెయ్యాల్సి ఉంది. అలానే ప్రతి ఇంట ఇంకుడు గుంత నిర్మానం, చెట్ల పెంపకం, ప్లాస్టిక్ వాడకాన్ని మానడం చేపట్టాల్సి ఉంది.
మీరు గంగమ్మను దేవతగా భావించే వారైతే పై అంశాలను పాటించటమే ఆమెకు మీరు చేసే అసలైన పూజ.
మీరు గంగమ్మను కేవలం జలవనరుల సంరక్షణకు ప్రేరణగా చూసే సంస్కర్త, హేతువాదైనా సరే పై అంశాలను పాటించటమే మీ విజ్నతకు సూచిక.
No comments:
Post a Comment