Sunday, May 2, 2010

పరిష్కారాల్లోనుండి కొత్త చిక్కులే

మిత్రమా,
నిన్ను మిత్రమా  అని సంభోధిస్తూనే ఎవరికి ఎవరు మితృడు?
మరణం కర చాలణానినికి చేయి చాపినప్పుడు అక్కరకొచ్చేవాడే
అసలైన మితృడు.
అటువంటి మితృడు ఈ సృష్ఠిలోనే  ఎక్కడున్నాడు?

కనీశం నా మరణ తరుణంలో ఎక్కడున్నా
అది తన స్ఫురణకొచ్చే స్థితిలో తన మనస్సును ఉంచుకుని
ఆ క్షణాల్లో కనీశం తన ఆలోచనా తరంగాలతో
నాక్కాస్త ఊరట కల్గించ గల ఘనుడు ఎవడున్నాడీ సృష్ఠిలో

ఆ భగవంతుడు సైతం నా మరణాన్ని  వారించ లేడు
నివారించ లేడు
మరణం అమావాశ్య చీకటిలా   ఒక్క నల్లని దుప్పటిలా
 నా స్మృతులను  కప్పేసే క్షణంలో
ఒక పేదవాని పళ్ళెంలో అన్నం లాంటి  తేజమై
సాక్షాత్కరించి సముదాయించి  తనవైపుకు
ఆహ్వాణిస్తాడేమో గాని ఆపలేడుగా ..

పుట్టాము కనుక తప్పదు చావక
చావ చచ్చి ఉన్న వయస్సులో
చావొచ్చి తలుపు తట్టే దాకా మరేం చెయ్యాలి

ప్రతి చెత్త విషయలోను మరణాన్ని ఊహించుకుని అదిరి పడాలా?
ఏం చేస్తున్నాం ఎందుకు చేస్తున్నామన్న స్ఫురణ సైతం లేక
పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుండాలా?

ఒక్క కొవ్వొత్తితో పారి పోగల చీకటిలో 
మరణాన్ని ఆవాహణం చేసుకుని వనకాలా?
ఈ సమస్త సృష్ఠితో విలీనమై ఉన్న నన్ను ఏకాకిగా
పొరబడి తోడు కోసం తపించాలా?
ప్రియురాలి నామాన్ని జపించాలా?

అసలు నువ్వెవరివి ? నేనెవర్ని
మనమద్య ఈ వినూతన పరిచయం ఏమిటి
నాకు మించిన తిక్కలోడు ఈ భూ ప్రపంచం మీద
 మరొకడుండని నా అంచనా?
ప్రతి తిక్కలోడూ ఇలానే అంచనా వేసుకుంటాడేమో?
ఇక్కడ ప్రతి వాడు తిక్కలోడేనేమో?

నేస్తం !
నేను అందరిని సంతృప్తి పరచాలనే అనుకుంటాను
కాని నాదో వీక్నెస్. నేను నన్ను కాలం చేతిలో అప్పచెప్పేసాను
అది నన్ను  ఒడ్డుకు చేర్చినా ఓకే
నిలువునా ముంచినా ఓకే
స్వతంత్ర కాంక్షతో ఈ సృష్ఠినుండి విడిపడి ఎదురీదడం కన్నా
గాలివాటంగా ఎగిరే  గాలి పటంలా ఎగురుతున్నాను

ఎదురీది బ్రతికి మాత్రం సాధించేదేమి.. ఎలాగూ చావు తప్పదు
నాకు ఊహ తెలిసినప్పటి నుండి నా  జీవిత  కాలాన్ని
ఒక్క మరణాన్ని ఎలా ఎదుర్కోవాలన్న ముస్తాబుకే వెచ్చించాను

ఈ జీవితంలో అంతా అబద్దమే ..
నిజం స్త్రీ ప్రదర్శించే సిగ్గు,బిడియాల వెనుక
రతి వాంచలా  దాగుంది

ఇక్కడ ఏదైనా అబద్దమై పోవచ్చు ఒక్క మరణం తప్పా

ఒక ఫలంయొక్క  మరణంతోనే దాని గుట్టు తెలిసినట్టు
అదే దాని ఆద్యంతం తెలిపినట్టు
అదే ఓ వృక్షాన్ని చేతిలో పట్టి ఉంచే
సామర్థ్యాన్ని కల్పించినట్టు

మరణంలోనే ఉంది అసలు సిసైలైన జిష్ఠు
దానిని పట్టాలి.

చచ్చి పడితే ఏం లాభం.. కనీసం నీ భోటి వారితో
కనీశం పంచుకోనూ లేను..
బతికుండగనే చావాలి చచ్చినా  బతకాలి.
మరి అది ఎలా?

ద్యానం గురించి పలువురూ ఊదర కొడతారు
24 సం.ల కృషి అనంతరం
నిజానికి నాకింకా ఆసన సిద్ది కూడా కలగ లేదు.
ఒక్క పదిహేను నిమిషాలు ఒకే భంగిమలో కూర్చోలేను
కాని లంచ కుండీల మనస్సుల్లో ఎల్లప్పుడూ ఏసిబి వారే తిష్థ
వేసుకుని ఉన్నట్టు నా మనస్సున భగవద్చింతన నిరంతరం
కనీసం ఒక్క ట్రాక్ మీదనన్నా నడుస్తూనే ఉంది

ఇదెలా సాధ్యమైందో నాకు తెలీదు  బహుసా
ఇక్కడి సంబందాల డొల్లతనం తెలిసి పోవడం వల్లేనేమో.

నెను ఎంచుకున్న వారితో సైతం నా మనస్సు పంచుకో లేక పోయాను
నేటి మితృడేగా రేపటి శతృవు
వీరు నన్ను వెలివేసిన భ్రమలొ ఉండగా
నేనే  వీరందరిని వెలివేసాను

నిజంగా  వీరి చిక్కులు  ఆ భగవంతుడు వీరికిచ్చిన వక్కలు
వాటిని నమిలాకే అందివ్వ బడుతుంది  విజయ తాంబూలం.

కాని వీరు  వరాలను సైతం  శాపాలుగా అర్థం చేసుకునే
స్థాయికి ఎదిగినవారు
ఒంటి కాలి పై  తపస్సు చేసి మరి శాపాలు కొని తెచ్చుకుంటారు

వీరి చిక్కుల్లో నుండి పరిష్కారాలేపుడతాయి
వాటిని సృష్ఠించింది నా తండ్రి కాబట్టి
వీరి పరిష్కారాల్లోనుండి కొత్త  చిక్కులే  పుట్టుకొస్తాయి.
వీరి పరిష్కారాలు వీరివి కాబట్టి

No comments:

Post a Comment