Wednesday, November 24, 2010

ఉ.12.10కి పదవి స్వీకరిస్తే కిరణ్ మరో బలి పశువు

వినాశ కాలే విపరీత బుద్ది అన్నట్టుగా ప్రాణ సంఖ్య 9 కావడం, మరి ఎనిమిదవ రౌండ్ జరుగుతుండడంతో సోనియా మేడం గారికి అన్ని తప్పుడు సలహాలే లభిస్తున్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి ఎంపిక సంగతి అటుంచితే పదవి స్వీకార ముహూర్తం కొంప ముంచనుంది. కేవలం ప్రయాణ సమయంలోని లోపమే వై.ఎస్. ను పొట్టన పెట్టుకుంది. అటువంటప్పుడు పదవి స్వీకార ముహూర్తం ఎంత కీలకమో వేరే చెప్పక్కర్లేదు.

కొత్త సి.ఎంగా కిరణ్ పదవీ స్వీకారం చేసే ముహూర్తం ఉ.12.10కని ప్రకటించి ఉన్నారు. ఈ సమయంలో కుంభ లగ్నం ఉంటుంది. లగ్నాధిపతి అయిన శనియే ఎనిమిదిన ఉన్నాడు. ఆదిలోనే హంస పాదు అన్నట్టుగా పునాదిలోనే డొల్లతనం కనిపిస్తుంది. దీంతో ఆపదలు,ప్రమాదాలు,ఆరోగ్య సమస్యలు, నిందలు,పదవి గండం మెండు.

పైగా గురు ఒంటరిగా ఉన్నాడు. దీంతో అప నిందలు, ఆరోపణలు వెల్లువెత్తుతాయి. జగన్ జీవితం ఇంత దుర్భరంగా తయారు కావడానికి కారణం అతని ప్రాణ సంఖ్య 21 కావడమే. ( 2+1 =3 ఇది గురు ఆధిక్యతలోని సంఖ్య)

జగన్ గురించిన సంఖ్యా శాస్త్ర్ర్ర అనలైజ్ కు ఇక్కడ  నొక్కండి.

జగన్ జాతక  వివవరాలకు ఇక్కడ  నొక్కండి .

సరే కిరణ్ పదవి స్వీకార లగ్నం కథ ఇప్పుదు  చూద్దాం.

ప్రజాధరణకు కారకుడు చంద్రుడు ఆయన సష్థాధిపత్యం పొంది ఐదున ఉన్నాడు. దీంతో రెండేసి రోజులకో కొత్త అపఖ్యాతి ఎదురయ్యే అవకాశం ఉంది. పైగా చంద్రునితో కేతు కలిసి ఉన్నాడు.దీంతో భంగ పాటు,అవమానాలు,పిల్లలకు హాని కూడ కలుగ వచ్చును.

శనికి వ్యయాధిపత్యం కూడ ఉంది. కాబట్టి మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ కదా అని వాదించ వచ్చు. ఇది ఎటువంటి త్రిప్పుట అలసట లేక కూల్ గా ఉండనిచ్చే గ్రహస్థితి.  కాని సి.ఎం పదవిలో కొనసాగితే ఇదెలా సాధ్యం? కాబట్టి త్వరలోనే పదవీచ్యుతడయ్యే ప్రమాదం ఉంది.

గృహ,సుఖ స్థానాధిపతి, గృహ కారకుడైన  శుక్రుడు భాగ్యమున స్వక్షేత్రం పొందినాడు. ఇది కూడ ఎటువంటి త్రిప్పుట అలసట లేక కుటుంభ సభ్యులతో సుఖంగా ఉండే వీలునే సూచిస్తూంది.

ఇక కర్మ స్థానాన్ని చూడండి.ఇక్కడ కుజ,రవిల కలయక ఉంది. ఒక్క కుజుడుంటేనే బాంబులు,ప్రేలుడు,ఫైరింగ్, రంపు,రచ్చలు,వ్యవహారాలు వస్తాయి.అటువంటిది రవి కూడ ఇక్కడ కలిసాడు కాబట్టి  మన రాష్ట్ర్రం మరో కాశ్మీర్లా తయారై పోయే ప్రమాదం కూడ ఉంది.

పంచమాధిపతి అంటే బుద్దిని సూచించు వాడు. పంచమాధిపత్యం పొందిన బుధుడు రవితో కలవడం వలన ఈగో అహంకారం,కుజుడు కలవడం వలన రెచ్చ కొట్టే మాటలు చేతలకు అవకాశం కలుగుతూంది.

ఒక్క రాహు మాత్రమే పదకొండో స్థానంలో ఉన్నాడు. రాహు అంటే లాటరి. కిరణ్ కు లాభమంటూ జరిగితే ఏదో లాటరి తగిలిన చందాన తగలాలే గాని .. మరేమి లేదు. అట్ ది సేమ్ టైమ్ ఒక్క లాభం జరిగిన వెంటనే కేతు ఐదున ఉన్నాడు కాబట్టి ఎన లేని అపఖ్యాతి అవమానం కూడ జరుగొచ్చు.

ఇప్పటికీ మించి పోయిందేమి లేదు మరో మంచి లగ్నం చూసుకుంటే గండం గట్టేక్కినట్టే

3 comments:

  1. ప్చ్ .. మరీ టూ మచ్ అనిపించట్లేదా!

    ReplyDelete
  2. 6th lord in 5thth gives=prajaalanunchi vyatirekatha,mainly from ladies nd intellectualls./7th nd 5th lords association wth 10th lord also gives negitive results/aspect of guru on sukra indicating rivalary wth film-industry nd womans folks.overall a negitive muhurtham...

    ReplyDelete
  3. already meeru cheppina vidamga start ayindi. mantrulu okkaru resign chesthunnaru.

    ReplyDelete