Saturday, November 13, 2010

ఉచిత జ్యోతిష సలహా

నా తమిళ బ్లాగు సూపర్ డూపర్ హిట్ అయిన మాట మీకు విదితమే. (2009 ఎన్నికలనంతరం కేవలం 16 నెలల్లో ఈనాటికి 2,52,552 హిట్స్ వచ్చాయంటే చూసుకొండి)
అందులో జ్యోతిష సంభంధ వ్యాసాలు కూడ అడప తడపా వ్రస్స్తుండేవాడ్ని. వాటితో స్ఫూర్తి పొంది తమ వ్యక్తిగత జాతక పరిశీలనార్థం పాఠకులు నెలకొకరిద్దరు సంప్రదిస్తుండే వారు. ఈ సంఖ్య క్రమేణా పెరిగి హాబిగామొదలు పెట్టింది ప్రొఫెషన్లా మారిపోయింది.

ఒకరోజు నాలో అపరాధ భావం వచ్చింది. ఇదేంటి.. డబ్బులిచ్చినవారికి మాత్రం సలహాలివ్వడానికి దేశంలో సవాలక్ష మంది ఉన్నారు. నేను అదే పంథాలో వెళ్తున్నానా? నా లక్ష్యం కేవలం డబ్బేనా? అంటూ అంతర్మదనం మొదలైంది.

నేను ఫీజుగా స్వీకరించింది కేవలం రూ.250 మాత్రమే .అయినా అందరికి ఆ స్థీమత ఉండాలిగా..లేనివారు ఏం చెయ్యాలి? అని ఆలోచించి "ఉచిత సలహా" ప్రకటించాను. తమాషా ఏమంటే ఈ ప్రకటన అనంతరం నా బ్లాగు హిట్స్ మరింత పెరిగాయి. నా ఆదాయం మరింత పెరిగింది.

తమిళంలో ఉచిత సలహా ప్రకటన చెయ్యడంలో నా ఉద్దేశం "కొద్ది పాటి సేవ" మాత్రమే. కాని అది అనుకోని విదంగా లాభించింది.

తెలుగు బ్లాగ్లోకంలో కూడా నా ఉద్దేశం "కొద్దిపాటి సేవే" దీని పర్యావసనం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.

ఎంతగా పని వత్తిడి ఉన్నా ( ఇప్పటికే సొమ్ము చెల్లించిన వారు వారం రోజులు వేచి ఉండవలసి వస్తుంది) తెలుగు పాఠకుల కోసం ఈ "ఉచిత జ్యోతిష సలహా"ప్రకటన చేస్తున్నాను.

ఇందుకు మీరు చెయ్యవలసిందల్లా :
మీ కంప్యూటర్ జాతకంతో పాటు (కనీశం రాశి,నవాంశ చక్రాలు,దశా బుక్తులు ఉండాలి) మీ ఒక్క ప్రశ్నను వ్రాసి పోస్టు ద్వారా పంపడమే. మీరు Stamped Reply Cover జతపరుస్తే దానిద్వారా సమాధానం పంపుతాను.

మీరడిగేది ఒకే ప్రశ్న - నేనిచ్చేది ఆ ఒక్క ప్రశ్నకే సమాధానమైనా మీ పూర్తి జాతకాన్ని నేను పరిశీలించ వలసి ఉంటుంది. ఒక సారి పరిశీలించాక (ఇదే అసలైన పని) ఎన్ని వందల ప్రశ్నలకన్నా సమాధానం ఇవ్వొచ్చు. కాబట్టి ఇదేంటి ఒక్క ప్రశ్నకు ఇన్ని రాద్దాంతమా అని నొచ్చుకోకండి.

ప్రశ్న ఒకటే అయినప్పటికి ( ఉ: ఉధ్యోగం) అందుకు సవివరంగా సమాదానమిస్తా (ఉ: ఎప్పుడు ,ఏ శాఖలో, అడ్డంకులు ఉంటే అవి తొలిగేందుకు హేతుబద్ద పరిహారం కూడ అందిస్తాను.

మీరు మీ జాతకం మరియు ప్రశ్నను పోస్టు ద్వారా పంపవలసిన చిరునామా:

చిత్తూరు.ఎస్.మురుగేశన్,
17-201, కుమ్మర వీథి,
చిత్తూరు ఆ.ప్ర
517001

గమనిక:
నాకు ఉచిత సలహా వద్దండి .. నేను ఫీజు చెల్లించి సంపూర్ణ ప్యేకేజ్ పొందుతాను అంటే క్రింది లింక్ నొక్కండి

http://sambargaadu.blogspot.com/2010/02/blog-post_7861.html

No comments:

Post a Comment