Tuesday, November 16, 2010

డబ్బును అర్థం చేసుకొండిలా.


డబ్బుకింత విలువరావడానికి కారణం - డబ్బు కోసం మానవుడు సర్వం ధారపోసి పిచ్చి వాడైపోతున్నందుకు కారణం దాని గురించిన అపోహలే.  వాటిని తొలగించాలనే  ఈ టపా.
1.డబ్బు రక్తం వంటిది . అది సమాజమనే శరీరమంతటా సర్క్యులేట్ అవుతూ ఉండాలి. లెకుంటే క్రమేణా ఆ శరీరానికి /సమాజానికి పక్షవాతం వస్తుంది. ఒక భాగం నిస్తేజమవుతుంది.
2.డబ్బు ఎటువంటి మూర్ఖుడనైనా జ్నానిగా మార్చ గల సరస్వతి ఆకు
3.డబ్బు మూగవాడిని సైతం పలికించగలదు ,గృడ్డి వాడ్ని సైతం చూసేలా చేస్తుంది. అవిటి వాడ్ని సైతం క్లాప్స్ కొట్టేలా చేస్తుంది, కుంటివాడ్ని సైతం మనకేసి పరుగు తీసేలా చేస్తుంది
4.డబ్బు ఏ బాషస్తునికైన అర్థమయ్యే విశ్వ బాష (గ్లోబల్ ల్యేంగువేజ్)
5. డబ్బు తేనె నిండిన పాత్ర వంటిది ..దాని ఎడ్జి (Edge) మీద  వాలి కొంత ఆరగిస్తే ఆకలి తీరుతుంది, ఆనందం కలుగుతుంది. దానిలోకి దూకితే రెక్కలు తడిసి అందులోనే మునిగి ఊపిరాడక చచ్చి పోతాం
6.డబ్బు మనకు ప్రాణాధారమైన  ఆక్సిజన్ కన్నా గొప్పది. ఎందుకంటే డబ్బుతో ఆక్సిజన్ న్ సైతం కొనగలం.
7.డబ్బుతో మానవుడు కాలం,దూరాన్ని గెలవగలగడం అతని అదృష్ఠం ..కొన్ని సార్లు గుండెలను కూడ గెలవ వలసి రావడం  అతని దురదృష్ఠం
8.డబ్బు ........దాని అవసరంతో ప్రయత్నించేవానికి ఎండమావి. తీరిగ్గా ప్రయత్నించేవానికి సెలయేరు
9.డబ్బు పటిష్ఠమైన ఆత్మగౌరవం గల వస్తువు..కేవలం ఆహాన్ని సంతృప్తి పరచుకోవడం కోసం ఖర్చు పెట్టే వానిని వీడి వెళ్ళి పోతుంది.
10.డబ్బు ఆత్మ గౌరవంతో బ్రతికేలా చేస్తుంది. కాని దానిని పొందాలంటే బలి చేయవలసింది కూడ దానినే
11. డబ్బు జీవితాన్ని తేజోమయం చేసే దీపం. కొన్ని సందర్బాల్లో దానిని గుగ్గి పాలు చేసే అగ్ని కూడ అదే
12.డబ్బు బుల్లెట్ వంటిది. ట్రిగ్గర్ నొక్కాక బుల్లెట్ పై అధికారాన్ని పోగొట్టుకున్నట్టే డబ్బును వెచ్చించాక దానిపై అధికారం కోల్పోతాం. ప్రేలుతున్న తుపాకీకంటే గురిపెట్ట బడిన తుపాకీకె ఆజ్నాపించే అధికారం ఎక్కువ.
13.డబ్బు భగవంతునికన్నా గొప్పది. ఎందుకంటే మానవుడు దేవుడ్ని కొనడానికి ప్రయత్నించేది ఆ డబ్బుతోనే
14.అప్పు చేస్తే దానికి చెల్లించవలసింది కేవలం వడ్డీ మాత్రమే కాదు. వెంకటేశుడే గాని కుభేరుని వద్ద అప్పు చేసే వడ్డీ చెల్లించే కమిట్ మెంట్ లేకుండా ఉండి ఉంటే మన చచ్చు కోరికలను సైతం వింటుండే వాడూ కాదు. కానుకలు స్వీకరింఛి నెరవేర్చేవాడూ కాదు.అప్పుకు వెల మన స్వేచ్చ,స్వాతంత్రయం
15.డబ్బు బోగి మంటలు వంటిది మరీ దగ్గరకెళ్తే కాలి పోతాం. మరీ దూరమైతే పేదరికపు చలి వనికిస్తుంది.
16.డబ్బు ఎంతటి కురూపినైనా అందగత్తగా నిలబెట్టగల బ్యూటిషియన్
17.డబ్బుంటే పరాయి మనుష్యులు సైతం దగ్గరవుతారేమో కాని, స్వంత మనుష్యులు దూరమవుతారు.
18.డబ్బు బుర్రతో ఆలోచించే తెలివిని ఇస్తుంది  హృదయంతో ఆలోచించే మానవత్వాన్ని సమాధి చేస్తుంది.
19.డబ్బు విచిత్రమైంది. అదున్నప్పుడు గాని,వస్తున్నప్పుడు గాని దాని ద్యాసే ఉండదు. దాని ద్యాస ఉన్నంత వరకు డబ్బే రాదు.
20.మనిషి ప్రతిదాన్నిమరణంతో  ముడేసి ఆలోచిస్తాడు.. చీకటి, ఒంటరితనం,తిరస్కారం, ఏకాంతం,అవమానం, పేదరికం, ఆకలి,వృద్ద్దాప్యం  ఇలా ఎన్నింటినో మరణ సమానంగా దలుస్తాడు. వీటిని గెలవడానికి  డబ్బు సాయం చేస్తుందని డబ్బును ప్రాణ సమానంగా చూస్తాడు. డబ్బు మానవుడు మరణం యొక్క చాయలతో చేసే యుద్దంలో సహకరిస్తుందేమో గాని ,మరణపు ఛాయలకు సైతం వెళ్ళ లేదు.21.అందరి వద్దా డబ్బుంది. ఐ మీన్ డబ్బుగా మార్చుకోగల వస్తువు ఉంది. దానిని గుర్తించినవాడు దనవంతుడవుతాడు
22.డబ్బు కొందరి విషయంలో  జుట్లన్ని రాలిపోయాక చేతికందే  దువ్వెన
23.డబ్బు పేదరికపు చీకటిని పారద్రోలే చిరుదీపం. కొందరి విషయంలో అది తల కొరివిగానూ మారుతుంది.
24.దనం జీవనయానానికి అవసరమైన ఇందనం.
25.డబ్బు కేవలం ఒక పని ముట్టు. దానిని సమకూర్చుకోవడం  గొప్ప కాదు.దాంతో ఏం చేస్తామన్నదే గొప్ప.
26.లక్ష్య సాధనకు డబ్బు ఉపకరించ వచ్చు. కాని డభ్భే లక్ష్యం కాకూడదు.
27.మనం సంపాదించాలంటే మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరు డబ్బు సంపాదిస్తుండాలి. కనీశం సంపాదించాలన్న ఉద్దేశంతో ఉండాలి.
28.డబ్బు ఏదో రోజు వస్తుందంటే దానికి విలువ లేదు. రోజూ వస్తుందంటే పది రెట్ల విలువ.నెల నెలా వస్తుందంటే కొంత విలువ.
29. కష్ఠించి సంపాదించడం సుఖ పడటం కోసమే. అందుకని కొందరు సుఖ పడటాన్ని వాయిదా వేసుకుంటూ సంపాదిస్తూ ఉండి పోతారు. సుఖ పడటం కోసం కష్ఠపడాలి. కష్ఠ పడుతూనే సుఖ పడాలి. సుఖపడుతూనే కష్ఠ పడాలి
30.సంపాదనకు అలవాటు పడితే పర్వాలేదు గాని అది వ్యసనమై పోకూడదు.
31.డబ్బు .. సౌండ్ proof వంటిది. డబ్బుతో ఉంటే ఆకలి కేకలు వినబడవు
32. డబ్బు బి.పి టాబ్లెట్ కన్నా భాగా రక్త్ పోటును నియంత్రించగలదు
33.డబ్బుకు ఆత్మ గౌరవం ఎక్కువ. అహం దానికి బద్ద శతృవు. ఎవడైతే తన అహాన్ని బలి పెడతాడో వాడికి స్వంతమవుతుంది.
34. డబ్బు ఏ ఫారీన్  సెంట్ కన్నా గొప్పది మీ కంపును కంట్రోల్ చేస్తుంది
35.డబ్బు ఏ మౌత్ ఫ్రెష్నరుకన్నా గొప్పది. మీ మాటలకు సువాసనను జోడిస్తుంది.
36.డబ్బు ఎండిన ఎముకల మూట  వంటిది. లోకులు కుక్కలు వంటివారు. మీరు విసురుతూ పోతే  లోకుల కాటు నుండి తప్పించుకోవచ్చు.
37.డబ్బు  జస్ట్ ఒక  ముడి సరుకు వంటిది .. దానినే ప్రాడక్ట్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే .
38. పదహారడుగుల వెదురు కొయ్యవంటిది. దానిలో  పన్నెండు అంగుళాలు చాలు. ఒక పిల్లన గ్రోవి చేయించుకుని ఆనందంగా జీవించటానికి. పదహారడుగులూ కావలంటే అదే మీకు పాడె సైతం కాగలదు
39.డబ్బు మీ దగ్గర పుష్కలంగా ఉన్నంత కాలం అది లేకుండానే అన్ని పనులూ అయిపోతాయి. అదే మీ దగ్గర లేకుంటే ప్రతి క్షణం డబ్బు అవసరమవుతుంది
40.డబ్బు లెని వారుండొచ్చు. డబ్బు అవసరం లేని వారు లేరుగా? ( మేజర్ చంద్ర కాంత్)
41. డబ్బు సంజీవణి మంత్రం వంటిది చచ్చిన శవానికి సైతం ప్రాణం పొయ్యగలదు
42. అరవై శాతం డబ్బు నలబై శాతం ఇతర ప్రతిభలున్నా ఓకే. నలబై శాతం డబ్బు అరవై శాతం ఇతర ప్రతిభలున్నా విజయం మనదే..
43.సంపాదన  బ్యేటు పట్టుకుని ఆటలో కొనసాగడం.  సిక్సర్లు ,ఫోర్లు కుమ్మెయ్యడం  అప్పుడప్పుడు తఠస్తిస్తుంటాయంతే.
44. డబ్బు కన్నె పొర వంటిది. ఏ ముసలిదానినైనా కన్యగా మార్చగలదు.

No comments:

Post a Comment