Thursday, November 4, 2010

స్త్ర్రీని అర్థం చేసుకోకుంటే మీ ఖర్మ

స్త్ర్రీని అర్థం చేసుకోవలసిన ఖర్మ నేకేం పట్ట లేదంటే అది మీ ఖర్మ. స్త్ర్రీ అంటే కేవలం ప్రియురాళ్ళు, భార్యలే కారు. అక్కలు,చెల్లెళ్ళు,అమ్మలు,నాన్నమ్మలు అందరూ ఈ లిస్టులోకి వచ్చేస్తారు. ప్రియురాళ్ళు, భార్యలు మినహా మరెవరితోను "ఆ" సంభంధం ఉండదు కాబట్టి బతికిపోతారు. అయినా వారితో కమ్యూనికేషన్ దెబ్బతిని వేరే విదమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ లిస్టు పై నేను ఈ టపాను  వ్రాస్త్రే  సగానికి పైగా గుడ్ బై చెప్పి వెళ్ళిపోతారు.

మగవారి జీవితంలో తల్లి పెళ్ళాం అనే ఈ రెండు రిలేషన్స్ మాత్రం చాలా కీలకంగా ఉంటాయి. ఎందుకంటే ఈ రిలేషన్ వారి గర్భాశయంతో ముడిపడ్డది కావడమే. ఇదేంటి అసహ్యంగా అని అసహనానికి గురి కావద్దు. గొప్ప డిటెక్టివ్స్ కి సైతం చెత్త కుండిని కలపెట్టక తప్పదు. సత్యం కావాలంటే ఇక్కడా అంతే.

రతి అన్నది గర్భాశయంలోకి మళ్ళీ ప్రవేశించే ప్రయత్నమే అని సైకాలజి చెబుతుంది. ఎందుకా కోరిక? మానవుడు నిశ్చింతగా ఉన్నది అక్కడే. "నేను" అనే భావం (ఈగో) లేక  ఉన్నది అక్కడే. (నేను అన్న భావమే అన్ని దు:ఖాలకు మూలం. నిజానికి మీలో "నేను" అన్నది ఎంతగా బలపడితే అంతగా మీరు ఈ సృష్ఠి నుండి విడిపడిపోతారు. భలహీనులవుతారు.

ఏమైతేనేం రతి అన్నది గర్భాశయంలోకి మళ్ళీ ప్రవేశించే ప్రయత్నమే. ఇది భార్య విషయంలో జరుగుతుంది. ఈ కారణం చేత భార్య,  గర్భాశయంలోనే ఉన్న కారణంగా  తల్లితో రిలేషన్ మగవారికి చాలా కీలకమైంది.

వీరిద్దరిని సక్రమంగా అర్థం చేసుకోకల్గిన వాడు పర స్త్ర్రీలను ఇట్టే అర్థం చేసుకుంటాడు. తల్లి విషయంలో తెలుసుకోవలసింది. ఆమె తనకు తల్లి మాత్రమే కాదు. మరొకరికి (తండ్రి) భార్య కూడ అన్న సంగతిని.

భార్య విషయంలో ఆర్థం చేసుకోవలసింది. ఆవిడ కేవలం  తనకు భార్య మాత్రమే కాదు. మరొకరి కూతురు. మరొకరికి తల్లి కావల్సిన ఆవిడ.

ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోకలిగితే మీ జీవితంలో కీలక పాత్ర పోషించే ఇద్దరు  స్త్ర్రీలు మీకు ఇట్టే అర్థమై పోతారు.

ఎప్పుడన్నా మీ తల్లి మీ నాన్నతో రతిలో పాల్గొనడాన్ని ఊహించుకోకలిగారా? తత్.. ఏం మాట.. సిల్లి! అనిపిస్తూందిగా ..

ఇదె ఇదే ఈ స్ప్లిట్ పెర్సనాలిటియే మీ జీవితంలోని  మొట్ట మొదటి  స్త్ర్రీ అయిన తల్లిని పూర్తిగా అర్థం చేసుకోనివ్వడం లేదు.

పోని మీ భార్య తన తండ్రికి వీపు రుద్దడమో?లేదా షేవింగ్ సెట్  కడిగి పెట్టడమో చేస్తున్నట్టు ఊహించుకున్నారా? లేదు. ఎందుకంటే మీ దృష్ఠిలో మీ భార్య కేవలం మీకు భార్య మాత్రమే. అంటే మీరు ఆవిడను పూర్తిగా అక్రమించుకోవాలని తపిస్తున్నారన్న మాట.

మీ అమ్మగారు నిజానికి మీ నాన్నగారికి భార్యగా మారిన తరువాతే మీరు పుట్టారు. సీనియారిటి ప్రకారం చూస్తే తండ్రిదే పై చెయ్యి. అయినా మన తల్లి ప్రేమ మనకే స్వంతమవ్వాలని కోరుకుంటాం.

మీరు చూసే ఉంటారు. తన భర్తతో  జీవిస్తున్న తల్లి కన్నా, భర్త పోయిన తల్లికే చాలామంది ప్రాధన్యత ఇస్తుంటారు.

ఇంతకీ నేను చెప్పనొచ్చింది ఏమంటే ఏ స్త్ర్రీ అయినా సరే ( మనిషులకు,పురుషులకు కూడా ఇదే వర్తిస్తుంది) ఆమెకు నెంబర్ ఆఫ్ డైమన్షన్స్  ఉంటాయి. మనం ఏ డైమన్షన్ కోరుకుంటే ఆ డైమన్షన్ మాత్రమే దర్శనమిస్తుంది. తక్కినవి మరుగునకు వెళ్ళి పోతాయి.

ఒక వ్యక్తి అన్నాక అతనిని ( మనం ఎరింగినవే కాకుండా)  మరిన్ని డైమెన్షన్స్ గలవానిగా గుర్తించాలి. ( వాటిని మనం తెలుసుకోలేక పోయినా) అప్పుడు గాని ఆ రిలేషన్ మెరుగుపడదు.

కేవలం తనకు ఎంతో దగ్గరగా ఉన్న తల్లిని, పెళ్ళాన్నే అర్థం చేసుకోలేని వాడు ఇతర స్త్ర్రీలను ఎలా అర్థం చేసుకోగలడు. పైగా కామవాంచ మీ అనలైజింగ్ కెపాసిటిని అద్వాన్నం చేస్తుంది. (నేను సైతం కన్నె వేటలో ఉన్నంత కాలం ఇవేవి స్ఫురించలేదు)

స్త్ర్రీలను అర్థం చేసుకోవడానికి ముందుగా అవివాహితులు  మీ తల్లిని, వివాహితులు మీ భార్యను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తల్లి విషయంలోనైతే ఇది కాస్త తేలికైన పనే (అక్కడ కామ వాంచ ఉండదు కాబట్టి) . ఇందుకు మీక్కావల్సిందల్లా కాస్త ఓపిక, సత్యాన్ని అన్వేషించే ధీరత్వం.

ఏ తల్లైనా తన కొడుకుతో మనసు విప్పి మాట్లాడుతుందా? అంటే లేదనే చెప్పాలి. వారి రిలేషనే ఫేక్. హిప్పక్రటిక్. ఆమె దృష్ఠిలో కొడుకు అనుభవ శూన్యుడు. కొడుకు దృష్ఠిలో ఆవిడ ఒక నశ.

నేను చూసిన చాలా కేసుల్లో కొడుక్కి యాభై, తల్లి డెబ్బై ఏళ్ళ వయసొచ్చినప్పుడు మాత్రమే వారి మద్య ఆత్మార్థమైన రిలేషన్ ఏర్పడుతూంది. ఇందుకు మా నాన్న ,నాన్నమ్మలే మంచి ఉదాహరణ.

భార్యను అర్థం చేసుకోవడానికి అడ్డొచ్చేది కామవాంచ అన్నాను. కామవాంచ ఎప్పుడూ ఉండదుగా.అది కాస్తా తీరాక చల్లారాకే ప్రయత్నించండి. స్త్ర్రీ మధుభాబు ప్యేకేట్ నవల కాదు ఇట్టే అర్థమై పోవడానికి.

ఆమెను అర్థం చేస్కోవడం మన తరం కాదురా ముర్రో అని మీరర్థం చేసుకున్న నాడు మనిషవుతారు. కొద్దిగా అర్థం చేసుకుంటే ఋషి అవుతారు. పూర్తిగా అర్థం చేసుకుంటే దేవుడవుతారు.

అదేదో పుష్పం ఉండేదట మీరు ఏ పువ్వును మనస్సులో తలచుకుంటే ఆ పువ్వు యొక్క సుగంధాన్ని వెద జల్లుతుందటా.. నేను చెబితే తిక్క తిక్కగా అనిపిస్తుంది. మీకై మీరు తెలుసుకోకలిగితే తిక్క కుదురుతుంది.

No comments:

Post a Comment