Saturday, November 6, 2010

స్త్ర్రీ మనస్సు దోచుకోవాలంటే..


ఆమె కూడ మనలాగే మల,మూత్రధారి . సాటి మానవ ప్రకృతి అన్న స్పృహ  కలిగి ఉండాలి. మనలాగే ఆకలి దప్పికలు, నొప్పి,భాధలుంటాయని గ్రహించాలి. మనలాగే ఆవిడ కూడ ఈ సంఘ సభ్యురాలిగా,కుటుంభ సభ్యురాలిగా, కూతురుగా,అక్క,చెల్లెలిగా,స్నేహితురాలిగా వైవిధ్యమైన పాత్రలు పోషించ వలసి ఉందని అర్థం చేసుకోవాలి. ఎంతగా మన దృష్ఠిని ఆకర్షించినా  ఆమె శరీరాన్ని పూర్తిగా నిర్లక్యం చేసే పరిణితిని పొందాలి. ఆమె కళ్ళు చూసి మాట్లాడాలి. ఆమెను కేవలం స్త్ర్రీగా చూసి ఆమెను Inspire చెయ్యాలనుకుంటే ఎదవై పోతారు.

స్త్ర్రీది ద్విపాత్రాభినయం. అసలైన స్త్ర్రీ ఆమె మస్తిష్కపు పొరల్లో దాగి ఉంది. మనం చూసే స్త్ర్రీ ( మాటిమాటికి పైట సర్దుకునే, గోళ్ళు కొరికే, అకారణంగా మెలికలు తిరిగే స్త్ర్రీ) వేరు. ఆమెలో దాగి ఉన్న స్త్ర్రీ వేరు. ఆమె కూడ శ్రీ కృష్ణునివలే మీరే రూపంతో చూస్తే ఆ రూపంతో స్పందిస్తుంటుంది,

ఒక స్నేహితురాలిగా చేసుకోవాలన్నా,ప్రియురాలిగా మారాలన్నా మొట్ట మొదట మీ మీద ఆమెకు విశ్వాసం కలగాలి. ఇతను మన కోణం నుండి కూడా ఆలోచించగలడు, ఇతనికి మన పరువు,ప్రతిష్ఠలు కూడ ముఖ్యం, ఇతను తనను ఏకాకి చేసిన   ఈ సువిశాల సృష్ఠిలో తన శేష జీవితానికి మనలను తోడుగా ఎంచుకునే యత్నంలో ఉన్నాడు అన్న భావం కలగాలి.

చెయ్యి పట్టుకుని వాటేసుకోవడం కన్నా మన చేయ్యి పట్టి ముద్దాడటం కన్నామన చెయ్యి పట్టుకుని జీవన భాటలో సాగి పోవడమే ఇతని ఉద్దేశం అనే భావం ఆమెలో కలగాలి. స్త్ర్ర్రీ శారీరకంగా భలహీనురాలు కాబట్టి ఆ దౌర్భల్యం ఆమె మనస్సును కూడా ప్రభావించగలదు కాబట్టి ఆమెలో  ఆత్మ రక్షణ గురించిన ఆలోచనలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఆమెకు ఎక్కడో వైట్ హౌస్లోనో, పది జన్ పథ్ లోనో, జరిగేవి రుచించక పోవచ్చు. ఆమెకు తన ఇల్లు,కాలని, తన భంధువర్గం గురించిన ఆలోచనలే ఎక్కువ ఉంటాయి.

ఈ పురుష ప్రపంచంలో అనచి వేతకు గురై అహంకార రాహిత్యం కస్త చిగురించి ఉంటుంది కాబట్టి కొన్ని సార్లు లలిత కళలు, ప్రకృతి వర్ణన, సాహిత్యం,కవిత్వం పట్ల కొంత ఆసక్తి చూప వచ్చు కాని ఆవిడ చాలా ప్రాక్టికల్ గా ఆలోచించ కలుగుతుంది.

మీ లక్ష్యం, టార్గెట్, ఆదర్శాల పట్ల ఆమెకు పెద్దగా ఆసక్తి లేక పోవచ్చు. అయితే ఇందాక చెప్పిన లక్ష్యం వగైరా వగైరాలు  ఆమె దైనందిన జీవితానికి , ఆమె మనుగడకు ముప్పు కాలేవు అన్న విశ్వాసం కుదిరితే కొంత మెరకు ప్రోత్సహించ వచ్చు.

ఇంతకీ స్త్ర్రీ ఒకతనిని ప్రేమించడం, అతనితో స్నేహం చెయ్యక మునుపే  ఒక వేళ ఈ భంధం బెడిసి కొడితే అతను (మీరు) ఎలా ప్రవర్తిస్తాడని ముందుగానే అంచనా వేసుకుంటుంది. ఆ అంచనా తారుమారుకావడం వేరే సంగతి.

హెశ్చరిక:
ఈ చిట్కాలను దురుద్దేశంతో ఫాలో అయినా ఆమె ఇట్టే పట్టేయ్యగలదు. ఆ తరువాత "స్వామి! మీ చిట్కాలు నిష్ప్రయోజనకరమని నన్నాడి పోసుకోకండి. మీ ఉద్దేశం మంచిదైతే కనీశం చెడ్డది కాకుంటే మీరు నేను చెప్పిన చిట్కాలేవీ పాటించనవసరం లేదు. మీ బిహేవియర్ ఎంత చండాలంగా ఉన్నా మీ స్నేహాన్ని స్త్ర్రీ ఓకే చేస్తుంది


( ఏం గురువా తల గిర్రున తిరుగుతూందా? ఇంకా ఉంది.. మరో టపాలో చూద్ద్దాం)

No comments:

Post a Comment