Tuesday, November 30, 2010

బ్లాగ్లోకంలో పొరపొచ్చలు

బ్లాగ్లోకంలో పొరపొచ్చలు

నిజానికి నన్ను వ్యక్తిగతంగా తెలిసినవారెవరైనా సరే "అతనో టైపండి" తనకు తోచింది మొఖం మీద చెబుతాడంతే అంటారు గాని మరొకటి కాదు. నేను కరెక్ట్ అని నమ్మిన వాటిని అలా నమ్మినంత కాలం నిర్భయంగా చెప్పడం నా నైజం. నా మాటల్లో ఎటువంటి వ్యూహమో ,నా మదిలో వ్యక్తిగత లాభాలో ఉండవు కాక ఉండవు.

కాబట్టి నన్నెవరేమన్నా పట్టించుకోను. నిజానికి నా మాటలను వాటిని విన్న క్షణం వ్యతిరేకించిన వారు సైతం ఏ రెండేళ్ళకో, మూడేళ్ళకో "నువ్వారోజే చెప్పావు కాని నాకే రుచించలేదని" సారి చెప్పిన సందర్భాలు అనేకం.

కాని తెలుగు బ్లాగ్లోకంలో నా మీద పగ పట్టి ,కసి పెంచుకున్నవారు కొందరున్నారు. గూగుల్ సర్చ్ ఇంజిన్లో  నా పేరును నేనే వెతికినప్పుడు కొందరి కమెంట్స్ నా కంట పడుతుంటాయి వీరి నామ దేయాలు,పాడు పరదేశం ఏది నాకు గుర్తుండవు  ( చ్చా.. ఈ పెంటల్నెందుకు బుర్రకెక్కించడం అన్న నిర్లక్ష్యం )

నన్నిలా తూలలాడి కమెంట్స్ వేయడంతో ఆగక అగ్రగేటర్సుకు మెయిల్ మీద మెయిల్ పంపి నిషేదానికి గురయ్యేలా చేసిన మహానుభావులు చాలా మంది ఉన్నారు.

వారిని కొన్ని గ్రూపులుగా విభజించాను. చూడండి:

కరడు కట్టిన బ్రాహ్మణులు:
( నేను జ్యోతిష్యం ఆథ్యాత్మికాల్లో వారు చేసిన కుట్రలను టచ్ చేస్తుంటాను కాబట్టి -తమిళంలోనైతే ఉతికి ఆరేసాను)

హిప్పాక్రట్స్ :
వ్యభిచారానికి చట్ట బద్దత కోరి కొన్ని టపాలు వ్రాసాను కాబట్టి

తెలంగానా వాదులు:
విడి పోవడం అంటే కృంగి పోవడం, కలిసి ఉండటం అంటే వికసించటం. కలిసుందాం అనే మస్తిష్కమే ఆరోగ్యవంతమైంది. విడిపోతామనే మనస్సు రోగిష్థిదని కరా కంఠంగా చెబుతుంటాను కాబట్టి

కరడు కట్టిన హేతువాదులు:
నేను జ్యోతిష్యాన్ని,ఆథ్యాత్మికాన్ని సైతం హేతుబద్దంగానే డీల్ చేసినా వీరు నా రచనలను జీర్ణించుకోలేక దుయ్యపడుతుంటారు

చంద్ర బాబు - చిరు భజన పరులు:
ముఖ్యంగా వీరిలో కమ్మకులస్తులు, బలిజలే ఎక్కువ ఉంటారు. నిజానికి నేను తమిళుడను. మొదలియార్ కులస్తుడను.

నేను ప్రజాభీష్థం మెరకు రాష్ఠ్ర్రాన్ని పాలించిన ఎన్.టి.ఆర్ వై.ఎస్.ఆర్లను కీర్తించి వ్రాస్తుంటాను .నేను కమ్మకులస్తుడను కాను. రెడ్డి కులస్తుడను కాని . అసలు నేను తెలుగువాడినె కాను. వీరి పట్ల  నా ఆధరాభిమానాలకు లాజిక్కే లేదు.

నాకు బాబు,చిరులపై  పై వ్యక్తిగత కక్షలు లేవు

నేనేదో ప్రజా పక్షం నిలబడి నాకు తోచింది వ్రాస్తా. కాని వీరు కేవలం కుల ప్రాతిపదికన బాబు చిరులకు బజన చేస్తు నా పై విరుచుకుపడుతుంటారు

ఇక నాకు అనుకూలురు ఎవరంటారా?

ఈ పి.ము ఏదో కొత్తగా చెబుతాడు. చికాకనిపించినా చదవాలనిపిస్తుంది. ఈడి మాటల్లో ఎక్కడో సత్యం ఉన్నట్టుంది అని ఆలోచిస్తూ ఇందాకా ఈ టపాని చదివారే మీరే నాకు అనుకూలురు.

మీ విలువైన సమయాన్ని వెచ్చించి ఈ టపా చదివిన మీకు థ్యాంక్స్.

3 comments:

  1. కరుడుగట్టిన కెలుకుడుగాళ్లని వదిలేశారెందుకూ? :))

    ReplyDelete
  2. శరత్ థూ నీబతుకు. నువ్వూ ఇంకోళ్ళకి చెప్పేవాడివయ్యావా!

    ReplyDelete
  3. $ఈ పి.ము ఏదో కొత్తగా చెబుతాడు
    good పి.ము, nice పి.ము. This is absolutely correct.

    $కరడు కట్టిన బ్రాహ్మణులు
    Explain more in detail. I believe it is about professional rivalry which is prevailed in any profession. Because of your incompetency to face the professional challenge, you feel so sick and hatred against particular caste. Isn't that?

    $తమిళంలోనైతే ఉతికి ఆరేసాను
    Oh god.. again self-trumpet.I felt ashamed by reading this again.

    ---
    On the whole, What sarath said is 200% correct. You are suffering with psycho-echo-ego-peeko-inferior-***. Please check yourself(introspect) immediatly.

    ReplyDelete