Monday, November 15, 2010

రాజ్యాధికారం బి.సిలకా? బి.సి నేతలకా ? - నేతల రా.కీ వ్యభిచారం

చిత్తూరులో  బి.సి.గర్జణ జరిగింది. వీరు దుయ్య పట్టే అగ్ర కులాల వారి పార్టీలకు ఏ మాత్రం తీసి పోకుండా అన్ని హంగు ఆర్భాటాలు,వాహణాల ద్వారా జన సమీకరణ, సారా,నగదు  పంపిణిలతో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ఠ్ర్ర అద్యక్షుడు కృష్ణయ్య "సమాజంలో వెనుక బడిన ,నిమ్నకులాల వారికి రాజ్యాధికారంతోనే విముక్తి అని నినదించారు.

దిన పత్రికల్లో ఈ వార్త చూసిన సామాన్య  యువత (బి.సి) "హమ్మయ్యా.. మనోళ్ళు ఎం.ఎల్.ఏలు ఎం.పిలు అయిపోతే మన సమస్యలన్ని హాం ఫట్ అన్నమాట "అని నిట్టూర్చేవారు.

వారు రాజ్యాధికారాన్ని కోరేది బి.సిలకా? బి.సి నేతలకా ? అన్న ఒక్క ప్రశ్నకు సమాదానం వారన్న మాటల్లోనె ఉంది.

" జనాభా ప్రకారం రాష్ఠ్ర్రంలో  బి.సి ఎమ్.ఎల్.ఏల సంఖ్య 160 గా ఉండాలి. ప్రస్తుతం 59 మత్రమే ఉన్నారు" -ఇది సాక్షాత్తు కృష్ణయ్య గారి మాట

ఓకే కృష్ణయ్యా గారు శెలవిచ్చిన టార్గెట్లో   ప్రస్తుతం దాదాపు 36 శాతం కవర్ అయింది. మరి బి.సి. ,నిమ్నకులాల వారి సమస్యల్లో 36 శాతం  పరిష్కారం అయ్యి ఉండాలిగా?

టార్గెట్లో 36 శాతం సక్సెస్ అయినా ఫలితం గుండు సున్నే అయినప్పుడు ఆ టార్గెట్ కేసి సాగడం తెలివితక్కువ పనేగా?

బి.సిలకు నిజంగానే రాజ్యాధికారం రావాలంటే  స్విస్ తరహాలో ప్రత్యక్ష ప్రజా స్వామ్యం అమలు కావాలి. ప్రస్తుతం చోటు చేసుకున్న ఐ.టి రంగ అభివృద్ది చూస్తుంటే ఇది సుసాధ్యమనే అనిపిస్తూంది.

పోనీ అత్యధిక జనాభా కారణంగా ఇది అసాధ్యం అనుకుంటే కనీశం ప్రధాని, సి.ఎం పదవులు సంపూర్ణ అధికారం కలిగి ఉండి ఈ పదవులకు  ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించమని డిమాండ్ చెయ్యాలి.

దేశంలోని 70శాతం ప్రజానీకం వ్యవసాయ రంగం మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. వ్యవసాయానికి మూలం భూమి. దేశంలోని భూములను జనాభా ప్రాతిపదికన పంచమని డిమాండ్ చేస్తే అందులో తర్కం ఉంటుంది.

వీరు కొన్ని వందల మంది బి.సి.నేతలకు అధికారం కోరుతున్నారు కాని కోట్లాది బి.సి ప్రజానీకానికి కాదు.

ప్రతి పార్టిలోను నెంబర్ వన్ అగ్ర కులస్తుడే అయినప్పటికి నెంబర్ టూ/లేదా నెంబర్ త్రీ
బిసి గానే ఉంటారు. ఒక నియోజకవర్గంలో అగ్ర కులస్తుడు ఎం.ఎల్.ఏ అయ్యున్నప్పటికి అతని గెలుపుకు ఒక బి.సి నేత కారణమై ఉంటాడు. (లేకుంటే అతని విజయం అసాధ్యం) పార్టిలోని బి.సి నేతో, లేదు నియోజక వర్గంలో అగ్ర కులానికి చెందిన ఎమ్.ఎల్.ఏను గెలిపించిన  బి.సి నేతో తలచుకుంటే ఆ పార్టిని, ఆ ప్రజా ప్రతినిథిని తద్వారా ప్రభుత్వాన్ని ప్రభావించ గలడు. కాని ప్రభావించడం లేదు ఎందుకు?

వీరికి చిన్నా చితకా పదవులు,బాధ్యతలు అందగానే వీరికి బహుజనులతో సంభంధం తెగి పోతుంది. అస్తమానం తమ రాజకీయ ఎదుగుదలకు, సంపాదనకు అగ్రకుల నాయకుల భజన చేస్తూ ఉండి పోతారు. తాము బి.సిలమనే తలంపుకే తిలోదకాలిచ్చి అగ్రకుల నాయకులకు నకిలీలుగా తయారవుతారు. తమ వెంట బహుజనులున్నారని,వారి భలం తమకుందన్న ఆలోచనతోనే సతరు పార్టిగాని, సతరు అగ్రకుల ప్రజాప్రతినిధిగాని తనను చేర దీసాడన్న సంగతే మరిచి పోతారు. జనాల్లోనుండి, బహుజనుల్లోనుండి దూరం దూరంగా వెళ్ళి పోయి ఏ.సి గదుల్లో తమర్ని తామే బంధించుకుంటారు.

ఈ సంగతి పసికట్టిన అధిష్ఠానమో , అగ్ర కుల ప్రజాప్రతినిదో బంతిని తన్నినట్టు తంతే తమ పదవులు పోయి రోడ్డున పడి  బి.సి నినాదాన్ని అందుకుంటారు.

బి.సిలు వెనక పడ్డారు.సమస్యలున్నాయి. కాదనను. కాని పరిష్కార మార్గం పైనే నా విమర్శ.

ప్రస్తుతం చట్ట సభల్లో రిజర్వేషన్ కోరుతున్నట్టే  ప్రభుత్వ ఉధ్యోగాల్లో రిజర్వేషన్ కోసం ఉద్యమాలు జరిగాయి. తమిళనాడులో పెరియార్ పుణ్యమా అంటూ బలమైన పునాదితో ఉవ్వెత్తున ఎగసి,రాజ్యాధికారాన్ని కూడ చేజిక్కించుకుంది.

 దేశంలోనే అత్యధిక రిజర్వేషన్ అమలయ్యేది తమిళ నాటే. (ప్రభుత్వ ఉధ్యోగాల్లో) విద్యలో రిజర్వేషన్ కారణంగా బి.సిలు పట్ట బద్దులైనారు. రిజర్వేషన్ కారణంగా ఉధ్యోగులైనారు కాద
నను.

కాని దేశంలో ప్రభుత్వ ఉధ్యోగాల పై ఆధార పడి బ్రతుకున్న వారి సంఖ్య ఎంత? వ్యవసాయ రంగం పై ఆధారపడి బ్రతుకుతున్నవారి సంఖ్య ఎంత? తమిళ నాడు సి.ఎం సైతం బి.సియే. భారతదేశంలోని అతి పెద్ద సంపన్నుల వరసలో ఎక్కింది కరుణ కుటుంభం.   కాని అక్కడి సామాన్య బి.సిలకు ఒరిగిందేమి?

ఇవన్ని స్ఫురించాలంటే ,ప్రశ్నించాలంటే పెద్ద బుర్ర కూడ అవసరం లేదు ఆవ గింజంత చాలు .. ఓకే ఆదివారం నాటి బి.సి గర్జణ గురించి చూద్దాం.

ఈ నాటకానికి  కథ అఠవి శాఖ మంత్రి  రామచంద్రా రెడ్డి. స్క్రీన్ ప్లే డి.కె.ఆదికేశవులు, డైరక్షన్ బి.సి సంఘం జిల్లా అధ్యక్షుడు బుల్లెట్ సురేష్ .

ఇందులో తారాగణాలతో పాటు కామెడియన్లు కూడా ఉన్నారు ఉ. ఎమ్.ఎల్.సి గోపినాథ్, రావూరి ఈశ్వర్ రావు

వీరి పురాణాలందుకుంటే వ్యక్తిగత విమర్శలని ప్రతి విమర్శ ఎదురవుతుంది.వీరందరి ఏక సూత్ర ప్రణాళిక తదుపరి ఎన్నికల్లో తమ టయ్యాలు బావుండి మద్యంతర ఎన్నికలొస్తే అందులోను  చిత్తూరు ఎమ్.ఎల్.ఏ సి.కె బాబుకు కాంగ్రెస్ టిక్కెట్ రాకుండా చూడటం. వారి చేతికి అందిన ఏకైక తురుపు ముక్క అతను అగ్రకులానికి చెందినవారన్నదే.

వీరందరికి సి.కె.బాబు పై వ్యక్తిగత కక్షలున్నాయి. ( వివరాలు చిత్తూరు పట్టణంలోని ఏ సెలూన్,టీ కొట్టులోనన్నా లభ్యం) .

సి.కెను చంపాలనుకున్నారు. చంపలేక పోయారు. సి.కె. నమ్మి కొలిచే షిర్షి బాబా దయతో బతికి పోయారు.

2009 ఎన్నికల్లో పార్టి టిక్కెట్ రాకుండా అడ్డుకునేందుకు శతవిదాల ప్రయత్నించేరు. అడ్డుకో లేక పోయేరు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. పుణ్యమా అంటూ టిక్కెట్ దక్కింది. సి.కెను ఓడించాలనుకునేరు. ఓడించలేక పోయేరు. రాజకీయంగా ఏ మచ్చా లేని సి.కె, మత పిచ్చి కుల గజ్జి లేని సి.కెకు ప్రజలు నీరాజనం పలికేరు. గెలిచారు.

సర్దార్ పాపారాయుడు సినిమాలో ఎన్.టి.ఆర్ డయలాగ్ ఒకటుంది (రెండు దశాబ్దాలకాలం నాకు అన్యాయమే జరిగినా) " ....................నన్ను పట్టుకోవడానికి ఇన్ని కుట్రలు, పోలీసులు ,బలగం" ఈ మాట ఇప్పుడు సి.కె.విషయంలో ఇట్టే సరిపోతుంది.

రెండు సార్లు చంపాలని  చూసినా, టిక్కెట్ అడ్డుకోవాలని చూసినా, ఓడించాలనుకుని చక్రం తిప్పినా ఇంకా వారి పగ చల్లార్లేదన్న మాట  ఒక్క సి.కె.బాబును ఏదో చెయ్యాలనే ఇన్ని వాహణాలు,ఇన్ని జనసమీకరణలు, మంత్రి, మాజీలు, కామెడియన్లు.."  చ్చా"  

No comments:

Post a Comment