Tuesday, November 2, 2010

ఏది నిజం? ఏది అబద్దం ?

చిన్నప్పట్లో అగ్గి పెట్టల లేబుళ్ళు శేఖరించేవారం. అవి పోతే కలిగిన బాధ, దొరికితే కలిగిన ఆనందం నిజమా? అబద్దమా? ఆ క్షణం ఖచ్చితంగా అవి నిజాలే. కాని ఈ రోజున?  మన జనం ఎంత అమాయకులంటే కేవలం జ్యోతిష్కుడనైన నన్ను ఏవి పడితే అవి అడిగే వారు. మనతో టైం పాస్ చేసుకోవడం లేదుకదా అని నాకే అనుమానాలు కలిగేవి.కాని కొంత కాలానికి తెలుసుకున్నా.. పాపం వారు నన్నడిగిన  విషయాలు తెలిసినవారు తక్కువ. తెలిసినా వీరికి చెప్పేవారు తక్కువలో తక్కువ.

పైగా జన్మత: కాస్త బుద్దిమంతుడ్ని కాబట్టి చిన్నప్పటినుండే మిత్రుల పై కాస్త కమాండ్ ఉండేది. వారికీ నా మీద కాస్త విశ్వాసం ఉండేది. ఇదిలా పెరిగి పెరిగి జనరల్ నాలెడ్జ్ జానకిరాంలా ఏడ్చింది నా క్యేరెక్టరు.

జనం నన్నేది పడితే అది అడిగే వారు. ఎవడో అడక్క పోతాడా అని నేనూ అన్నీ తెలుసుకునే వాడ్ని. 1967లో పుట్టిన నేను 1986 వరకు కూడ కేవలం ఒక డేటా బేస్ లా ఉండేవాడ్ని.

తదుపరి క్రమేణా అనుభవాలు కలగను కలగను నాలో ప్రాససర్ కూడ పని చేసేది మొదలు పెట్టింది. ఆ ప్రాససర్ ఇచ్చిన సందేశమే ఏదీ 100 % నిజం కాదు.ఏదీ 100 % అబద్దమూ కాదూ అన్న ఈ శీర్షికకు మూలం.

దెయ్యాలున్నాయా? దేవతలున్నారా? మంత్రాలు పని చేస్తాయా? ఒకటి కాదు రెండు కాదు. ఎన్నో అడిగే వారు. నేను అప్పట్లో నాకున్న పరిణితిని పట్టి, సమాచారాన్ని పట్టి గంటా పథంగా సమాదానం ఇచ్చేవాడ్ని.

నా మాటకు ఎదురు మాట్లాడినవారిని ఎదవలని నిరూపించే యత్నం చేసేవాడ్ని. వయస్సు మీద పడుతుంటే అర్థమైంది. రేడియో వేవ్స్ ఉన్నాయి. వాటిని మీరు అంగీకరించాలంటే మీ దగ్గర ఒక రేడియో ఉండాలి. అది పని చేస్తుండాలి. దానిని ట్యూన్ చేసే నేక్ తెలిసి ఉండాలి. ఆ వేళకు ప్రసారం జరుగుతుండాలి. అప్పుడుగాని మీరు రేడియో వేవ్స్ ఉన్నాయని నమ్మలేరుగా? నేనూ నమ్మించ లేనుగా?

మన జీవితంలో అన్నీ ఉన్నాయి. అన్నీ అవసరమే. కాని వాటి అవసరం మనకెంత అవసరమో అంతే అవసరాన్ని మనం గుర్తిస్తే ఇబ్బంది లేదు. అలా కాక ఏదో ఒక దానిని పట్టుకుని వేలాడితే ఎదవలై పోతాం.

ఎస్.ఎస్.సిలో ఆరు సబ్జెక్టుల్లోను 35 శాతం మార్కులు పొందకలిగాం కాబట్టే పాస్ అయ్యాం. ఏదో ఒక సబ్జెక్టును పట్టుకుని వేలాడుంటే?

నిజా నిజాలను తేల్చేసేటంత పులులం ఇక్కడ ఎవరూ లేము.

స్వామి వివేకానంద అంటాడు" నీ మనసుకన్నా గొప్ప వస్తువు ఈ భూప్రపంచంలో లేదు. ఒక వేళ ఏ వస్తువన్నా గొప్ప్దదనిపిస్తే నీ మనస్సు భలహీనంగా ఉందని అర్థం"

మన మనస్సు ఏ వంక మొగ్గితె అది తనంతట తానె భలీయమవుతుంది. చీకటి వేళ . ఏదో పాము కాటేసిందనుకొండి. అది వాన పామో ,బురద పామో ,దాని కులం,గోత్రం ఎమో కూడ తెలీదు. కాని నాగుపాము కాటేస్తే ఎటువంటి రియాక్శన్స్ రావాలో అన్నీ వచ్చేస్తాయి.

ఇందుక్కారణం మనస్సు. ఇక దేవతలు, దెయ్యాల గురించి చెప్పనక్కర్లేదనుకుంటా. మళ్ళీ వివేకానంద స్వామి సూక్తి ఒకటి చూద్దాం

"నీ ప్రార్థనకు ఫలితం కానవస్తే అది మరెక్కడనుండో రాలేదు. నీ మనస్సునుండే వచ్చిందని తెలుసుకో"

ప్రేమలో కలిగే అహ్లాద భావనకు   ప్రియురాలికి ఏ సంభంధమూ లేదు. ప్రతి మనిషికి బేసికల్ క్యెరెక్టర్ ఒకటుంటుంది. వాడు ప్రేమించినా,మందు తాగినా,స్మగ్లింగ్ చేసినా చివరికి హత్య చేసినా ,ఆత్మ హత్య చేసుకున్నా ఆ బేసికల్ క్యేరక్టర్ భయిట పడుతుంది.

అలానే మనం నిజమనుకునే నిజాల్లోను,అబద్దాలనుకునే అబద్దాల్లోను మన బ్యేసికల్ క్యేరెక్టర్ ఉంది.

మీరు మీ మనస్సుతో ఒక విషయాన్ని పరిశీలిస్తేనే మీ ముద్ర దాని మీద పడిపోతుంది. ఇక సత్యం గిత్యం అంతా గలత్ .

ఓకే బాసు .. ముక్క అర్థమైతే ఒట్టని కమెంట్ వెయ్యాలనేగా మీ ఉద్దేశం? కానిచ్చెయ్యండి..
ఒకే సమస్య పలువురికి ఉండవచ్చు. కాని ఆ సమస్యలకు కారణం ఒకటే ఉండాలని రూల్ లేదు.

No comments:

Post a Comment