Friday, November 26, 2010

సంపాదన మార్గాలు : 1

బాసూ ..ఈ ఒక్క టపాలో వంద సంపాదన మార్గాలుంటాయి.ఒక్కటైనా మనకు సరిపోదా అని భావించి వచ్చారేమో? ఒకటి కాదు వెయ్యి మార్గాలు చూపుతా కాని తదుపరి టాపాల్లో. ఈ టపాలో సంపాదనకు నిజాయితీ కీలకం అన్న పాయింటును వివరించా.

నిజాయితీగా డబ్బు సంపాదించడం సాధ్యమేనా? సాధ్యమే అని నమ్మేవారిలో నేనూ ఒకడ్ని. సాధ్యం చేసుకున్నాను కూడ. (లక్షల్లో కాక పోయినా వేలల్లో)  అదెలా సాధ్యమైందో కూడ వివరిస్తా.

మీలో దమ్మున్న వారు పాటించి సంపాదించి చూపితే అదే నాకు పదివేలు.

నేను పుట్టుకతో ఉత్తముడ్ని కాను. అందుకని ఐ.పి.సి ప్రకారం నేరాలు చేసినవాడ్ని కాను. మా నాన్నగారి నిజాయితీని చేతగానితనంగా విమర్శిస్తుండేవాడ్ని.మా నాన్నగారు  జిల్లా ఖజాణా అధికారిగా పని చేస్తున్న వేళలో మా ఇల్లు వానకు కూలి పోయిందంటే నమ్ముతారా? ఇటువంటి సంఘఠన బహుసా మా (నా) జీవితంలోనే జరిగి ఉంటుందనుకుంటా.

ఆయనగారి నిజాయితీ అంటే అట్టాంటి ఇట్టాంటి నిజాయితి కాదండి బాబూ . చిర్రెత్తించే నిజాయితీ. చేదస్తం అనొచ్చు.ఓవర్ ఆక్షన్ అనొచ్చు. అంతటి నిజాయితీ. ఆనాటి జనతా చీరలే మాకు (నలుగురు కొడుకులు) చొక్కాలుగా మారేవి. ఒకే డిజైన్లో అర డజను చొక్కాలు.బోగి నాటికి అదే డిజైన్, సంకరాంతికి అదే డిజైన్, కనుమకు అదే డిజైన్.

యూనిఫార్మ్ అంటే  బిన్ని క్లాత్ లో డ్రాయర్లు, ఎల్.ఎమ్.సి గాడాలో చొక్కాలు. జిల్లా అధికారి కాబట్టి జిల్లా టు జిల్లా బదిలీలు ఉంటాయి. ఊరుగాని ఊళ్ళో హోటల్ భోజనం ఒక పూటకు తెచ్చుకుని అందులోనే మిగుల్చుకుని  రాత్రికి తినేవాడు. ఉ.పూ ఆఫీసుకెళ్ళి పనులు చేసేవాడు. అర్ద రాత్రిదాక చేసేవాడు. మద్యలో ఆకలైతే బొరుగులు తెప్పించుకుని తినేవాడు.

ఆయనిలా ప్రవర్తిస్తుంటే టీన్ ఏజిలో ఉన్న నాకు ఏమనిపించి ఉంటుందో మీరే ఊహించుకొండి. కాని కాల క్రమంలో ఆయనగారి నీతి,నిజాయితి,దర్మ సూత్రాలు నాకు అంటుకున్నవి. ఆయన కాలానికి ఆయనకో బోడి ఉధ్యోగం దొరికింది. ఒక గ్రామ పెద్ద కూతుర్నిచ్చి పెళ్ళి చేసాడు ( మాంచి కట్న కానుకలతో) మా అమ్మ సీతకన్నా ఓర్పుతో పేదరికాన్ని ,ఆయన చేదస్తాన్ని భరించింది.

మరి నేనూ? నిరుధ్యోగిని. పైగా ముక్కోపిని. ఎన్.టి.ఆర్ అంతటి ఆత్మ విశ్వాసం గలవాడ్ని .నేను ఎన్ని ఉధ్యోగాల్లో( ప్రైవేటు చిన్నా చితకా) చేరానో ఎందుకు మానెయ్యాల్సి వచ్చిందో అన్న పాయింటు మీద ఒక్క ఏడాది వరకు వరస పెట్టి టపాలు వ్రాయొచ్చు. నాదా ప్రేమ పెళ్ళి . నా భార్య కట్టుకున్న చీరతో కూడ కాదు వోనితో వచ్చింది. ఇందులో దేశాన్ని సంపన్న దేశం చేస్తానని ఆదర్శాలు, సి.ఎంతో యవ్వారాలు,కేసులు.
ఇక జీవితం ఎలా ఉంటుందో ఒక్కసారి గెస్ చెయ్యండి. ఒక ముక్కలో చెప్పాలంటే సినిమా కష్ఠాలే.

1991-2007 దాకా 16 సంలు పస్తును వాయిదా వేయడానికి, పేదరికపు కోరల్లోనుండి జారుకోవడానికే నా శక్తి యుక్తులన్ని వెచ్చించవలసి వచ్చింది. సాధారణంగా ఎవరైనా ఇటువంటి పరిస్థితిలో "నీతి నిజాయితి అంటూ మడి కట్టుకుని  కూర్చుంటే  పస్తులతో చచ్చిపోతాంరా బాబో.. నీతి లేదు గీతి లేదు "అని  ఒక యు టర్న్ కొట్తి ఉంటారు.

సహజ సిద్దంగా ఆరోగ్యమైన శరీరం గలవాడ్ని. పదునైన బుద్దిగలవాడ్ని. ( ఎస్.ఎస్..సిలో 72 శాతం) కరిగి పోయే మనస్సున్నవాడ్ని.

కాని బేసికల్ గా నేను రెబెల్ ను. జగమొండిని. నా టీన్ ఏజిలో నా పరిసరాలు /మనుషులు నీతి బోధ చేస్తుండే వారు. నేను వారిని వ్యతిరేకించేవాడ్ని.

నాకు జ్నాన దంతం మొలిచినాక నా పరిసరాలు మారిపోయాయి. మనుషులు మారి పోయారు. ఇక వీరిపై రెబల్ అవ్వడం మొదలు పెట్టాను.

వివాహానంతరం 1991-2007 దాకా 16 సంలు పొట్ట చేత పట్టి నడిచినా నా లక్ష్యాన్ని జారవిడువ లేదు. నేనెంతగా క్షీణించి పోయినా క్షణమన్నా ధర్మాన్ని వీడ లేదు. గుంటూరు పంచాంగం రేపర్ మీద వ్రాసినట్టుగా/లేదా స్వామి వివేకానంద స్వామి చెప్పినట్టుగా నాలో - నా అంత:కరణంలో ఎన్నో మార్పులొచ్చాయి. ఎన్నో అధ్భుతాలు జరిగాయి.

సమాజంలో తిక్కలోడబ్బా/ స్ట్ర్రెయిట్ ఫార్వార్డ్ ము.కొడుకు/ మొఖం మీద మాట్లాడతాడబ్బా/,మంచోడే ..మాట పడడప్పా టైపులో పేరు తెచ్చుకున్నాను. ఇవేమి నేను ప్లాన్ చేసి సాధించినవి కావు. కేవలం ఈ గుడ్ విల్ నాకు సంపాదన మార్గాలను తెరిచి ఉంచింది.

అవేమిటో తదుపరి టపాలో వివరిస్తాను

No comments:

Post a Comment