Monday, November 1, 2010

సోమవారం నాటి బ్లాగులూ -నా వ్యాఖ్యలు

మొన్న ఇదే తరహాలో వ్రాసిన టపాలో క్షమార్పణ కోరడం మరిచాను. కొందరు అలిగారేమో? ఎందుకొచ్చిన బాధ. మళ్ళీ క్షమార్పణ కోరుతున్నా. ఈ టపాలో నా వ్యాఖ్యలకు ఎటువంటి దురుద్దేశాలు లేవు. ఎవరినో కించ పరచాలనో , తప్పు పట్టాలనో ఈ వ్యాఖ్యలు వ్రాయడం లేదు. నాకు తట్టినవే వ్రాస్తున్నా.

(కొన్ని బ్లాగులు పై వ్రాయలేదంటే నాకు ఏమీ తట్టలేదని భావం)

జీవనరాగాలు: రాజకీయ ప్రశ్నలు
"నాకెప్పుడు పదవి వస్తుంది? నేనెంత సంపాయిస్తాను? నా కొడుక్కెప్పుడు పదవి వస్తుంది? ఆడెంత సంపాయిస్తాడు.. "ఇవేగా రాజకీయ ప్రశ్నలంటే..

ఒక మంచి మాట: మీ బ్లాగ్ ని ఎంత మంది చూస్తున్నారు ?
హమ్మయ్య ! డాబు కొట్టుకోవాలంటే సందర్భం రాక అవస్థ పడుతున్నా. గత బుధవారం నాడు మాత్రం 387 బాసు.. ఈ సోమవారం నాడు 148. ఎందుకు ఈ ప్రశ్న వేస్తున్నావు గురూ ఎవరన్నా బ్లాగరు నిన్ను తిట్టి పోసి టపా వ్రాసారా?

స్వప్న రాగలీన: పోరగా పోరగా మా ఇంట్లో వచ్చిన మార్పు!
రానిలె బాసు.. జీవితంలో  మారనిది మార్పొక్కటే కదా?

NEW డ్రీంస్: రివర్స్ గేర్ లో పవన్ కళ్యాణ్ సినిమా
పాపం ఫ్యేమిలికే బాలేదు. ఏం చేద్దాం.. హోల్ సేల్ గా యాగాలు స్పాన్సర్ చెయ్యమంటారా?

జీవనరాగాలు: అమరావతి కథలు , దర్గా మిట్ట కథలు, మిట్టూరోడి కథలు గురుంచి చదవాలంటే
ప్రతి ఊళ్ళో ఒక అమరావతి , దర్గా మిట్ట,మిట్టూరు ఉంటాయా గురువా?  నాకేమో ఒక్కో సర్కిల్ లోను ఒక్కో సెట్ ఆఫ్ పీపుల్ కూడా ఉంటారనిపిస్తూంది. దేవుడు సైతం మన సిని రైటర్స్ లాగా ఒకే కథ వ్రాసి పారేస్తాడు

MHS గ్రీమ్స్ పేట్ 76 -81 బ్యాచ్ మైత్రీ వనం: "అక్కడ నిశ్శబ్దాన్ని వినొచ్చు…"
//అక్కడ నిశ్శబ్దాన్ని వినొచ్చు// దొరా! టైటిల్లోనే టాప్ గేర్ వేసావు ..శబాష్

ఉత్తర తరంగాలు: వీళ్లు మనకు అవసరమా?
అవసరమనేగా దేవుడు పుట్టించ్చింది.  మన అవసారాల కొద్ది కాదు మేస్టారు.. మన ఖర్మ కొద్ది తగులుతుంటారు జనం

అసైన్స్ కబుర్లు: ఉత్తినే సరదాగా..
నేనిలా ఎడా పెడా కమెంట్స్ వేస్తుండటం కూడ సరదాగానే గురూ..

అన్వేషి: కసి - 6
వ్రాసేవానికి పాఠకుని మీద కసి ఉంటే ఎక్కువ వ్రాస్తాడు.. పాఠకునికి రచయిత మీద కసి పుడితే చదవడం మానేస్తాడు

అర్జునుడి బాణాలు...: ఇహ లోకం నుంచి అహో లోకంలోనికి–2
ఈ ప్రయత్నంతోనేగా రవితేజా సోదరుడు అలా బుక్ అయిపోయాడు

రక్తచరిత్ర: OU లో చదువు తున్న స్టూడెంట్స్ కి ప్రైవేటు జాబ్స్ కూడా రావు , అడుక్కు తినడమే ఈ తే.లంగా స్టూడెంట్స్ కి మిగిలింది
ఎందుకబ్బా నీకింత కసి.. పాపం కుర్రాళ్ళు వాళ్ళకేం తెలుసు కే.సి.ఆర్ అసలు స్వరూపం. ఒక్క పాయింటు మిత్రమా.. తెలంగానా ఉధ్యమాన్ని కేసిఆర్ నడిపిన రోజులు పోయి ఉధ్యమం అతనిని నడిపే రోజులొచ్చేసాయి. తెగే దాక లాగి కుడితిలో పడటం ఖాయం

జై తెలంగాణ: తెలంగాణకు జరిగిన కొన్ని అన్యాయాలు వీడియో రూపంలో
వీడియో రూఫంలో ఉన్నా,ఏ మీడియా రూపంలో ఉన్నా జరిగిన అన్యాయానికి న్యాయం జరిగే మార్గం వెతకాలేగాని విడిపోతామంటే ఎలా? హెచ్.జి.వెల్స్ వంటి వారు దేశ సరిహద్దులే మటుమాయం కావాలి ప్రపంచ సర్కారు ఏర్పడాలని కలలు కన్నారుగా..

NEW డ్రీంస్: మహేష్ బాబు ‘దూకుడు’ సంక్రాంతికి వచ్చేస్తుందా ?
ఖలేజా పుట్టించిన దడే పూర్తిగా మరవలేదు అప్పుడే మరో అటాక్?

Prema-Desam: (శీర్షిక లేదు)
ఇది మంచి టేక్నిక్ గురువా? టైటిల్ చూడటానికన్నా క్లిక్ చేసి పారేస్తారు

మీ కోసం: రూ.2 కోట్లు పెట్టి కొనుక్కున్న కుక్కకు రాజమర్యాదలు!
దాని విలువ ఏమిటో మీరే చెప్పేరుగా.. రాజమర్యాదలు కాక కరకర మురుకులతో సరిపెడతారా?

కుక్కకు సంబంధించి ఒక జోక్ (ఆపుకో లేక చెబుతున్నా)
మాజి నటి ఒకావిడ కోరి కోరి ఒక కుక్కపిల్లను తెచ్చుకుంది. ఇంచు మించు మీరు చెప్పిన రేంజే. దాని ఫ్రంట్ ఏదో బ్యేక్ ఏదో తెలీదు. అంతటి కేశ దనం .

నటి దానిని ముద్దాడటం మొదలు పెట్టింది. అక్కడికి వచ్చిన విలేకరి అన్నాడు" మేడం ! అది దాని బ్యేక్"

పానకాలు: ఈ తెలంగాణ వెధవలకి ఆత్మాభిమానం లేదు.. పనికిమాలిన కెసిఆర్ KTR లాంటి బ్రోకర్స్ మాటలు వింటారా...
మ్యేస్టారు! గొప్ప విషయాలు పనికి మాలినవారి చేతిలో పడతాయి. గొప్ప్ వారు పనికి మాలిన విషయాలు పట్టుకుని వ్రేలాడుతారు. ఇది జీవితంలో పెద్ద శోకం.  నన్నడిగితే తెలంగానా కావాలో వద్దో ఒక వోటింగ్ తో తేల్చి పారెయ్యొచ్చు. ఈ కమిటీలు గిమిటీలంతా బొక్కే

శివ స్పీక్స్: సాక్షి పత్రిక ఎందుకు విజయవంతం అయ్యింది?
వై.ఎస్. బతికున్న రోజుల్లో సైతం సాక్షిలో ప్రభుత్వ వ్యతిరేక వార్తలు చదివి ఉన్నా. ఈ నిజాయితియే కారణం అయ్యుంటుంది.పైగా పోటీ పత్రికలు ఎడిటోరియల్ను సైతం అమ్ముకునే స్థితికొచ్చేసాక జనం సాక్షికి నీరాజనం పడతారు.

తెలుగు లో కంప్యూటర్స్: దీపావళి గ్రీటింగ్ E - Cards
దీపావళి అంటే కృష్టుడు నరకాసురుడ్ని వధించిన రోజంట కదా? ప్రతి మస్తిష్కంలోను వారిద్దరూ ఉన్నారు. మన కాన్షియస్ ఎవరిని భలపరుస్తే వారు భలం పొంది అవతలి పార్టిని సంహరిస్తారు.

స్వాతి చినుకులు: నాకు నచ్చిన పాట
నాకు నచ్చిన పాట చెప్పనా "మాటలకే అందని మనస్సు చూపులతో తెలుసుకో ..రెప్పవలే కాచుకో"( జస్టిస్ చౌదరి - శ్రీలక్ష్మి పెళ్ళికి చిరునవ్వు కట్నం)

TELUGODU తెలుగోడు: అదృష్టం అంటే ?
రోశయ్య సి.ఎం కావడమే

జగ్గంపేట మెట్టసీమ: తియ్యని కబురు చెప్పిన చిరు
ఏమన్నాడూ.. పార్టికి మంగళం పాడేస్తాడా ఏం?

ANALYSIS <<<>>> అనాలిసిస్: గురూ గుడ్‌న్యూస్ ... అవినీతిని చట్టబద్దం చేస్తారట !
అవును దేవరా! తమిళ రోబో కథ తమదంటే తమదేనని రైటర్స్ పోలీస్ స్టేషన్లల్లో ఫిర్యాదులు గుప్పిస్తుంటే రజని కాంత్ పోలీసోళ్ళందరికి దీపావళి కానుక ఇచ్చాడట (పై అధికార్ల వద్ద అనుమతి పొంది మరి)

aanamdam: సమస్యల నుంచి కూడా లాభాలు...............
మైక్రో ఆగడాలకు మహిళలు పలువురు మరణించేరు. ఇది సమస్య. వారికివ్వవలసిన రేషన్ కోటా ఆదా అయ్యింది. ఇది లాభం ( ఇది రోశయ్య లెక్కైయ్యుండొచ్చని బోగట్టా)

హరిసేవ: ఒక్కసూది ఉంటే హార్ట్ ఎటాక్ నుండి కాపాడవచ్చు [చైనాప్రొఫెసర్ గారి సలహా ]
అరెస్టవ్వగానే చాతి నొప్పి నటన చేసే అవినీతి రాజకీయ వేత్తలకైతే ఈ సలహా అస్సల్ నచ్చదనుకుంటా

1 comment: