Monday, May 10, 2010

పేదరికమే అసలైన సమస్య

మన దేశం ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతూంది. ప్రస్తుతం మనకు స్థూలంగా కనిపించే ఎన్నోసమస్యలు అసలు సమస్యలే కావు. కనిపించే ప్రతి సమస్యకు మూలం పేదరికం. ఈ పేదరికానికి కారణం జన భాహుళ్యానికి జాతీయ ఉత్పత్తిని పెంచే ప్రక్రియలో సమాన అవకాశం లేక పోవడం. అలానే జాతీయ ఆదాయంలో నిజమైన వాటా లభించక పోవడం.  మన ఆర్థిక శాస్త్ర్ర వేత్తలు జాతీయ ఆదాయాన్ని జనాభాతో భాగించి వచ్చిన మొత్తాన్ని తలసరి ఆదాయంగా పేర్కొంటూ భారతీయులు సంపన్నులై పోతున్నారని ఊదర కొడుతున్నారు. రజిని కాంత్ సం.ని ఒక సినిమా అధనంగా చేసినా, తమిళ నాడు ముఖ్యమంత్రి మనవళ్ళల్లో ఒకరు ఇంకో కొత్త చానల్ ప్రరంభించినా జాతీయ ఆదాయం పెరుగుతుంది.  కాని ఆ ఆధాయంలో ఒక పేద ఆంథ్రునికో, తమిళుడికో వాటా వస్తుందా ? అంటే రాదు.

ఈ అసలు సమస్యను గుర్తించి నేను రూపొందించిన విప్లవాత్మక పథకమే ఆపరేషన్ ఇండియా 2000. ఈ పథకాన్ని నాడు గూగుల్ ప్రకటించిన ప్రోజెక్ట్ టెన్ టు హండ్రెడ్ కి పంపినాక దాని పై బ్రవుజర్లకు అవగాహణ కల్పించి వారి మద్దత్తు కూడ కట్టుకోవడం కొరకు రోపొందించిందే ఈ డి.వి.డి.

దీనిని యధా ప్రకారం ఆర్చివ్ ఆర్గ్ లో అప్ లోడ్ చేసి దాని తాలూకు లింకును ఇక్కడ ఇస్తున్నాను. డౌన్ లోడ్ చేసుకుని తిలకించి నా పథకం పట్ల మీ అభిప్రాయాలను తెలుప కోరుతున్నాను.
http://www.archive.org/details/JobsFor10CoreIndianYouth

No comments:

Post a Comment