పేదోడి దేవుడుగా ఖ్యాతి గాంచిన దివంగత రాష్ఠ్ర్ర ముఖ్యమంత్రి జన హృదయ నేత డాక్టర్ వై.ఎస్. రాజశేకరరెడ్డి హెకికాప్టర్ ప్రమాదంలో మరణించి నిజంగానే దేవుడై నేటికి ఏడాది పూర్తైంది. మహాత్ముని గురించి వ్యాఖ్యానించిన ఒక మేధావి " ఇలాంటి వ్యక్తి రక్త మాంసాలతో ఈ భూమి మీద బ్రతికాడని భావితరాలవారు నమ్మలేరు" అన్నాడుట. సరిగ్గా వై.ఎస్. గురించి చెప్పాలన్నా ఇదే మాట చెప్పాలి.
నేడు వై.ఎస్. లేరని తిరిగి రారని ఆయన పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న వారి గత చరిత్ర ఏమిటో అందరికి తెలుసు. వారి విశ్వసనీయత ఎటువంటిదో కూడ అందరికి తెలుసు . ఒక చిన్న కుటుంభంలో ఒక స్త్రీ తన భర్త ఇద్దరి పిల్లలకు అన్నం వండి పెడితేనే ఒక్కో రోజు ఒక్కో లోటు తఠస్తిస్తుంటుంది. అటువంటిది ఒక రాష్ఠ్ర్రాన్ని పరిపాలించడం అంటే ఎలా ఉంటుందో ఊహించుకొండి.
ప్రభుత్వం అంటే కేవలం వై.ఎస్. కాదు. మంత్రివర్గం, సెక్రట్రీస్, జిల్లా స్థాయిలో కలెక్టర్, ఆయా శాఖాధికారులు ,చిన్నా చితకా ఉధ్యోగస్తులు అందరిని కలుపుకుంటే అది ప్రభుత్వం. వై.ఎస్. పుట్టి పెరిగిన నేపద్యం తెలిసిన వారికి వై.ఎస్.లో నానాటికి రూపుదిద్దుకున్న మానవీయతా కోణం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
స్వంత తండ్రిని పొట్టన పెట్టుకున్నవారు ఎవరిని కలిసారు.. అలా కలిసినప్పుడు వారికి ఎట్టి భరోసా లభించి ఉంటుంది అని ఊహించుకోలేని మూర్ఖుడు కాదు వై.ఎస్. వై.ఎస్. తలచుకుని ఉంటే వై.ఎస్. వైరి వర్గం బతికి బట్ట కట్టేది కాదు. వై.ఎస్. వయస్సుతో పాటు మనస్సు కూడ పెరిగింది.
ప్రజా ప్రస్తానం పేరిట మొదలు పెట్టిన పాద యాత్ర ద్వారా నాటి రాక్షస పాలనలో ప్రజలు,రైతులు పడిన పాట్లు చూసి చెలించి పోయాడు. కరిగి పోయాడు. ఎన్నికల హామీలంటే నోటికొచ్చింది వాగడమేనని రాజకీయ చరిత్ర చెబుతుంటే వై.ఎస్. మాత్రం ఎన్నికల సందర్బంగా తానిచ్చిన ప్రతి హామీని నిలబెట్టాలనే ప్రయత్నించారు, తాను చెప్పిన చెప్పిన ప్రతి మాట నిలుపుకో చూసారు.
హామీల అమలుకు పూనుకున్నారు. వై.ఎస్.లో అదేదో ఊహకందని ప్రేరణ, ఉధ్వేగం ప్రవేశించింది. ప్రకృతీ సహకరించింది. అనుకున్న ప్రతి పని ఖచ్చితంగా పూర్తి చెయ్యాలని తపించాడు. జల యజ్నం, రైతులకు ఉచిత విద్యుత్, రేషన్ కార్డ్లులు , పించన్లు, పావలా వడ్డీ రుణాలు,రెండు రూపాయలకే కిలో బియ్యం, విద్యార్థులకు ఫీజుల రీ ఎమ్బర్స్ మెంట్ ఇల ఒకటి కాదు ఎన్నో ఎన్నెన్నో. ఆయనలో మానవత ఉబికింది, కరుణ కట్టలు తెంచుకుంది. అన్నీ అన్నీ ఒక్క సారిగా జరిగి పోవాలని తపించారు.
ప్రభుత్వ యంత్రాంగంతో ఒక పని చెయ్యించటం అంటే మాటలు కాదు.మీలో చాలా మందికి ఏదో ఒక ప్రభుత్వ కార్యాలయంలో ఏదో ఒక తరుణంలో చిన్నపాటి అనుభవమన్నా కలిగి ఉంటుంది. ఈ వ్యవస్థ నేటిది కాదు. బ్రిటీషు వారు ఏర్పాటు చేసిన వ్యవస్థను అలానే కొనసాగిస్తున్నాం. బ్రిటీషువారు విదేశీయులు కాబట్టి మన మీద నమ్మకం లేక ప్రతి చిన్న పనికి ఎన్నో చెక్ పాయింట్స్ పెట్టేరు. అవి నేటికి అలాగే కొనసాగుతున్నాయి. వై.ఎస్. వ్యవస్థ ప్రక్షాణకో, ఆధునీకరణకో పెద్దగా పూనుకోలేదు. ఆయన పరిపాలన చేపట్టే రోజున అంత వ్యవధి కూడ లేదు.
అంతకు పూర్వం ఉన్న తొమ్మిదేళ్ళ చంద్ర బాబు పరిపాలనతో విసిగి వేసారి, తక్షణ ఊరట, తక్షణ బరోసా కోసం పేద,మద్య తరగతి ప్రజలు ఉవ్విళ్ళూరుతుంటే ఇంకెక్కటి వ్యవస్థ ప్రక్షాళన, పరిపాలనా సంస్కరణ. ఉన్న ప్రభుత్వ యంత్రాంగంతోనే నెట్టుకొచ్చారు.
మహిళలకు పావలా వడ్డీకే లక్షలాది రూపాయలు రుణమివ్వాలని వై.ఎస్. జీ.ఓ పాస్ చేస్తారు అనుకొండి. మహిళలు గ్రూపుగా ఏర్పడాలి. ఆ గ్రూపును ఒక ఎం.పి సిఫార్సు చెయ్యాలి. బ్యాంకు ఖాతా తెరవాలి.రివాల్వింగ్ ఫండుకు అప్లై చెయ్యాలి . ఫీల్డ్ ఆఫీసర్ విజిట్ చెయ్యాలి. రివాల్వింగ్ ఫండ్ మంజూరు కావాలి. ఖాతాలో జమ కావాలి. ఈ ప్రాసస్ లో ఏ ఒక్కరు తప్పు చేసినా,పొరభాటు చేసినా టోటల్ స్కీమ్ దెబ్బ తింటుంది. పథకం యొక్క లక్ష్యమే చెదిరిపోతుంది.
వై.ఎస్. ఏమన్నా దేవుడా? (పేదలు అలానే భావిస్తారు అది వేరే సంగతి) ఆయన వద్ద మాయా దర్పణం ఏమన్నా ఉన్నదా? లేదే.. హృదయంతో ఆలోచించి ,బుర్రతో అమలు చెయ్యన్నాడు ఒక మేధావి. వై.ఎస్. హృదయంతోనే ఆలోచించి హృదయంతో అమలు చేసారు. అందుకే ఇన్ని లక్షల బోగస్ రేషన్ కార్డులు ఈ రోజు భయిట పడుతున్నాయి.
2009 ఎన్నికల్లో గలవగానే నేను గొప్ప వాడ్ని అని విర్ర వీగకుండా సీట్లు ఎందుకు తగ్గాయి. మనం అమలు చేసిన
సంక్షేమ పథకాల ద్వార లబ్ది పొందిన వారిలో సగం మంది ఓటిచ్చి ఉన్నా ప్రతిపక్షాలకు డెపాజిట్ దక్కేది కాదు కదా ? మరి ఎందుకలా జరగ లేదని బుర్రలు బద్దలు కొట్టుకొని ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించే డెలివరి సిస్టంలోని లోటు బాట్లే ఇందుకు కారణం అని భావించి ప్రతిపక్ష నేతగా తాను చేపట్టిన ప్రజా పస్తానం తరహాలో రచ్చ బండ కార్యక్రమం మొదలు పెట్టి ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి గవర్నమెంట్ డెలివరి సిస్టమ్లోని లోటు బాట్లను తెలుసుకుని తీర్చి దిద్దాలని నిర్ణయించారు.
ఇదే ఉద్దేశంతో ,అలుపెరుగని సైనుకుని వలే గత సంవత్సరం ఇదే రోజున ఉదయం హైదరాబాదునుండి చిత్తూరుకు
హెలికాప్టర్లో భయిలు దేరితే ఇటు చిత్తూరు చేరుకోలేదు.అటు హైదరాబాదుకు తిరిగి వెళ్ళలేదని తెలిసి అఖిలాంద్రులు అవాక్కయ్యేరు. 24గంటల ఉత్కంఠత తరువాత భయిట పడిన మృత్యులాంటి వై.ఎస్. మరణ వార్త
వందలాది అభిమానుల గుండెలను శోక సంద్రంలో ముంచింది.
"వై.ఎస్. బతికుంటే " ఈ మాట ప్రజల నోట రాని రోజంటూ లేదు. రాష్ఠ్ర్ర విభజన కాడ నుండి, ఒక వరదా , ప్రేలుడు కాడికి ఏ చిన్న ఉత్పాదం జరిగినా వై.ఎస్. ఉంటే ఇలా జరిగేది కాదు అని చెప్పని వారు లేరు. నేడు అవాక్కులు చవాక్కులు పేల్చి వెళ్ళిన మహానేతల పార్టీ వారి నోటే ఈ మాట ఎన్నో వందల సార్లు భయిట పడింది.
ఏం చేద్దాం రాముడు,కృష్ణుడు భూమ్మీద ఉన్నప్పుడు వారికి సైతం ఈ అపవాదులు తప్పలేదు .వై.ఎస్. ఎంత? వై.ఎస్. రాజు, రారాజు. మహరాజు.అతను నాడు బతికి ఉన్నప్పు డు కేవలం ఒక రాష్ఠ్ర్రాన్ని ఏలాడు. ఇప్పుడు ...
కోట్ల కొలది గుండెల్లో కొలువుండి ఏలుతున్నాడు.
వై.ఎస్. అమర్ రహే !
No comments:
Post a Comment