మహా భారతంలో యక్ష ప్రశ్న గురించి విని ఉంటారు. వనవాస సమయంలో ఒక జింకను తరుముకుని పరుగులు తీయాల్సిన పరిస్థితి వస్తుంది. (ఇందుకు కారణం ఒక బ్రాహ్మణుడు) భాగా అలిసి పోతారు. భయంకరమైన దాహం. ధర్మరాజు పక్కన ఉన్న చెట్టెక్కి దగ్గర్లో ఎదైన జలాశయం ఉందా చూడమంటాడు.
నకులుడు చెట్టెక్కి చూసి దగ్గ్గర్లో ఓ సరస్సు ఉందని చెబితే వెళ్ళి నీళ్ళూ తెమ్మని నకుల సహ దేవులనే పంపుతాడు. వెళ్ళిన వారు తిరిగి రాలేదు. తీరా తక్కిన భీమార్జునులను పురమాయిస్తాడు.వారు వెళ్ళారే గాని తిరిగి రాలేదు.చివరికి ధ్రమజుడే వెళ్ళాడు. అక్కడ తన సోదరులు చచ్చి పడుండటాన్ని చూసాడు. కృంగి పోయాడు విలపించాడు. చివరికి తనను తాను ఓదార్చుకుని దాహర్తి తీర్చుకోవడం కోసం సరస్సులోకి దిగబోతుంటే ఒక అశరీరి పలికింది
"ధర్మజా ! ముందుగా నా ప్రశ్న్లలకు జవాబిచ్చి ఆ పై సరస్సులోకి దిగు" అశరీరి అడిగిన ప్రశ్నలన్నింటికి జవాబిచ్చాడు.
అప్పుడు అశరీరి ధర్మ దేవత రూపం దాల్చి ధర్మరాజు ముందుకొచ్చింది. పైగా ఓ వరమూ ఇచ్చింది
"ధర్మజా ! నీ సోదరుల్లో ఎవరో ఒకరిని బతికిస్తా ఎవరు బతకాలో కోరుకో"
ధర్మ రాజు నకుల సహదేవుల్లో ఎవరో ఒకరిని బతికించమన్నాడు. ధర్మదేవత "ధర్మజా ! రానున్నది మహా సంగ్రామం . అందులో నీకు విజయ హేతువులుగా నిలవగల భీమార్జునులను కాదని నకుల సహదేవులను కోరుకుంటావా?" అంది
ధర్మజుడు చెప్పాడు " ధర్మ దేవతా ! నా తండ్రికి ఇరువురు భార్యలు. కుంతి,.మాథ్రి. కుంతి కన్న బిడ్డల్లో నేను మిగిలాను. మాథ్రి కన్న బిడ్డల్లో ఎవరో ఒకరిని బతికించుకోవడమే ధర్మం.యుద్దంలో విజయ హేతువులు భీమార్జునులు కారు. ధర్మమే"
No comments:
Post a Comment