మహా భారతంలో భీముడు ఆంజనేయ స్వామిని కలుసుకున్నసన్నివేశం అందరికి తెలిసిందే.
ద్రౌపది కోరుకున్న పుష్పాన్ని తేవడం కోసం వెళ్ళడం. దారిన ముసలి కోతి దారికి అడ్డంగా తోక పెట్టి
కూర్చుని ఉంటే భీముడు ఆ వానరంతో వాగ్వాదానికి దిగి ఆ తోకను కదల్చ లేక పోవడం కొన్ని సినిమాల్లో కూడ చూసి ఉంటారు. మనిషిలో అహంకారం ప్రవేశిస్తే అతను మంచివాడైతే మరుక్షణమే భగవంతుడు అతనికి గర్వ భంగం గావించి రక్షిస్తాడు. అతను చెడ్డవాడైతే భగవంతుడు అతని అహంకారాన్ని మరింత పెరిగేలా చేసి సర్వ నాశనం చేస్తాడు.
ఇటువంటి గర్వ భంగ దృశ్యాలు పురాణాల్లో కోకొల్లలు ఉంటాయి. ఆ కోవకు చెందిందే ఇంకొకదానిని ఇప్పుడు చూద్దం.
అనుకోకుండా అర్జునుడు ఆంజనేయ స్వామి కలుసుకున్నారు. పిచ్చా పాటి మాట్లాడుతున్నారు. రాముని సేతు బంధనం గురించి ప్రస్తావన వచ్చింది. అర్జునుడు నేనైతే లంకకు భాణాలతోనే సేతు నిర్మించేవాడ్ని అని విర్ర వీగాడు.ఆంజనేయ స్వామి సతరు సేతు నిర్మించింది మనుషుల కోసం కాదని కోతుల కొసమని అదని ఇదని సర్ది చెబుతున్న కొద్ది అర్జునుడు నేటి రాజకీయ నాయకుల్లా వాగడం వాగడమే. ఆంజనేయ స్వామికి కోపం వచ్చింది
"సర్లేవయ్యా ఇప్పుడు నిర్మించు భాణాలతో సేతు. ఈ ఒక్క వానరం దాటికి తట్టుకుని నిలబడుతుందేమో చూద్దాం. ఆతరువాత లంకకు నిర్మిద్దువుగాని సేతు" అన్నాడు.
మాటా మాటా పెరిగింది .అర్జునుడు తాను నిర్మించే సేతువును హనుమన్న కూల్చేస్తే ప్రాణ త్యాగం చేసుకుంటానని శపథమే చేసాడు.
భాణాలతో సేతు నిర్మించాడు. హనుమన్న రాముడ్ని దలచి దాని పై తన కాలి బొటన వేలు మోపాడు. అంతే.సేతు కుప్ప కూలింది. అర్జుడు బిత్తర పోయాడు. కాసేపట్లో తేరుకుని ఆత్మాహుతికి ఉపక్రమించాడు. ఈ సంగతిని జ్నాన దృషితో తెలుసుకున్న కృష్ణుడు పరుగు పరుగున స్పాటుకు వచ్చాడు.
జడ్జి లేకుండా కాస్కున్న పందెం చెల్లదని తాను న్యాయ నిర్ణేతగా ఉండగా మళ్ళీ సేతు నిర్మాణం జరగాలని కన్విన్స్ చేసాడు. అర్జునిడిలోని అహం ఎప్పుడో పటా పంచలైంది.
అహంకారం గతానుభవాన్నిపట్టి బుద్దిలో పుడుతుంది. గతమే మళ్ళీ మళ్ళీ పునరావృతం కావాలని రూలేమి లేదు. అంతటి కాలా గాంధి కామరాజ్ని ఒక విథ్యార్థి నేత ఓడించాడు. పురచ్చి తలైవిగా (విప్లవ నాయకి) చలామణి అవుతున్న జయలలితను ఒక మెడికల్ షాపు అతను ఓడించాడు
గతానికి వర్థమానానికి పోలికే ఉండదు.ఏ సెకండుకా సెకండు కొంగ్ర్త్తొత్తగా జనియిస్తుంది. సర్లే వ్యాఖ్యాణాలు కాని గాని కథకొస్తాం. ప్రస్తుతం అర్జునుడిలోని అహం హుష్ కాకి అయ్యింది. కృష్ణుడ్ని తలచుకుని భక్తి ప్రప్తత్తులతో భాణాలతో సేతు నిర్మాణం చేసాడు.
ఇక్కడ అర్జునిడిలో మాయమైన అహంకారం ఆంజనేయ స్వామి మదిలో ప్రవేశించింది. ఈ సారి హనుమన్న కాలి బొటన వ్రేలు మోపడం సరికదా .. సేతు పై ఎక్కి ఎంత దూకినా సేతు కదల్లేదు.
ఈ జీవితమే ఒక ఆక్సిడెంట్. ఇక్కడ ఎవరికి ఏది లభించినా అది ఏక్సిడెంటల్. ఎవరు ఏది పోగొట్టుకున్నా అది యాక్సిడెంటల్. ఏదో వస్తే / పొందితే /దక్కితే తాను గొప్పని , మరేదో పోతే/పోగొట్టుకుంటే /దక్కకుంటే తాను ఎదవని ఎవరూ నిర్దారించుకోవలసిన అవసరం లేదు.
మన ప్రయత్నం అన్నది చెక్కులో సున్నలు పెడుతూ వెళ్ళడమే. అంకె పడేది భగవత్ కృపతోనే. అది ఏడమ వైపు పడుతుందో, కుడి వైపు పడుతుందో, అసలు పడుతుందో పడదో అది అతనికే ఎరుక.
No comments:
Post a Comment