సాధారణంగా కుజ,చం కలయకను చంద్ర మంగళ యోగంగా కీర్తిస్తారు. కుజుడు భూమి కారకుడు, చంద్రుడు జలకారకుడు. ఒక వ్యక్తికి వెల కొలది ఎకరాల భూమి ఉన్నా , నీరు అందుభాటులో లేకపోతే ప్రయోజణం ఉండదు. అటు భూమి యోగం ఇటు జలయోగం రెండూ కలుస్తేనే అసలైన యోగం.
అలాగే చంద్రుడంటే మనస్సు. మనోకారకడు. కుజుడు అంటే విప్లవాత్మకంగా ఆలోచింఛటం. ఉత్త మనస్సుతో సాధించేది ఏమి లేదు అది చైతన్యవంతం కావాలి విప్లవాత్మకంగా ఆలోచించ కలగాలి అప్పుడే పుణ్యం పురుషార్థం ఉంటుంది. ఇది చంద్ర,కుజుల కలయకతోనే సాధ్యం.
ఇందులో చిన్న సైడ్ ఎఫెక్ట్ కూడా ఉందిఉత్తుత్తే గ్రహాలు కలుస్తే సరిపోవు. ఈ రెండు గ్రహాలు యోగకారకులుగానో, లగ్నాధిపతికి మితృలగనో ఏదో విదంగా భలం పొందో ఉంటేనే ఈ యోగం వొర్క్ అవుట్ అవుతుంది.
కుజుడు అంటే భూమి , చంద్రుడు అంటే నిలకడలేని తనం. అంటే భూములు పెరుగుతూ తరుగుతూ ఉంటాయన్న మాట. ఇదేందని బెంబెలెత్తి పోకండి. భూములకు మంచి దర పలికినప్పుడల్లా విక్రయితూ పోతే భూమి తగ్గుతుంది కాని నగదు వచ్చి పడుతుంటుంది కదా.
తక్కువ దరకు భూములు దొరికినప్పుడెల్లా కొంటుంటే భూమి పెరుగుతుంది కదా , క్లుప్తంగా చెబితే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనువైన గ్రహ స్థితి ఇది.
No comments:
Post a Comment