ఓం గం గణపతే స్వాహ
జై శ్రీరాం
హరే రామ హరే కృష్ణ కృష్ణ హరే
రఘుపతి రాఘవరాజా రాం
పతీత పావన సీతారాం
ఈశ్వర అల్లా: తేరే నాం
సబ్ కో సన్మతి దే భగవాన్
రామా!
నీవు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడే !
కేవలం అయోద్య రాజువని ఎలా భావించను !
నువ్వు కేవలం రాజువైయ్యుంటే
వీరు నన్ను బూజూలా దులిపేసుండేవారు
నీవు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు కాబట్టే
కేవలం నీ నామ జపం చేసిన నన్ను ఇంతగా కరుణించి
యద్భావం తద్భవతి అంటూ నన్ను అభినవ రాముడ్ని చేసావు.
నీ దయ నాకున్నది కాబట్టే
ఇంత మంది రావణేశ్వరులకు ఎదురు తిరిగినప్పటికి
ఇంకా నా ప్రాణం గాలిలో కలిసి పోకుండా ఉంది.
నీవు సాక్షాత్ పరమాత్ముడవు
అలా కాని పక్షాన అహంకార పూరితమైన నా మనస్సు
నీ పట్ల మొగ్గేది కాదు.
నా అహంకారాన్ని పటాపంచలు చేసిన ఆదర్శ పురుషుడవు నీవు
నువ్వు పరమాత్ముడవు కాని పక్షంలో
నీ ద్యానంతో నా ఆత్మ స్వరూపం నాకు సాక్షాత్కరించేది కాదు
నా మనస్సు నీకై తపించేది కాదు
వీరు అపార్థం చేసుకోవడంలో దిట్టలు
ప్రతి దానినీ అపార్థం చేసుకుంటారు
నిన్ను సైతం.
నీ అనుమతి లేనిదే నీవర్థం కావు
నీ అనుమతి నాకు లభించింది కాబట్టే
నేను నిన్నర్థం చేసుకు కలిగాను
దాదాపుగా మరణించి ఉన్న నన్ను
నువ్వు కరుణించావని
మాత్రం నేను అర్థం చేసుకో కలుగుతున్నా
ఎందుకంటే నాలో కొత్త ప్రాణం నడియాడుతుండటాన్ని నేను
గమనించ కల్గుతున్నా
ఎటో వెళ్ళి కుళ్ళి పోవలసిన నా జీవితం ఈ మాత్రం సాగుతుండటానికి
కొన సాగుతుండటానికి నిన్ను కాక మరెవ్వరిని భాద్యులను చెయ్యగలను?
ఏ జన్మలో నీ నామం జపించానో
ఈ జన్మలో అది మళ్ళీ పున: ప్రారంభమైంది
నేను రావణుడ్ని మించిన పర స్త్రీ గమనుడను
పర భార్యా మోహితుడను
శక్తి చాలక పోవడంతో అలా దాటుకుంటూ వచ్చేసాను గాని
నేనెంతటి నీచుడనో నాకు తెలుసు
నా గడ్డు కాలాన్ని దాట వేసి నన్ను ఒడ్డున పడేసిన వాడవు
నన్నే మార్చిందంటే నీ నామం ఎంత శక్తి మంతమైందో
అర్థం చేసుకోలేనంత మూర్ఖుడను కాను
నాలో వెలసి నన్నే నీయంతటి
సుగుణ సంపన్నుడను చేసినవాడవు
నీ నామ జపం చేసినప్పటికి జన్మ రాహిత్యం పొందనిచో
అది నీకే కాదు నిన్నే జయించిన నీ నామానికి కళంకం కాగలదు.
నా జన్మ రాహిత్యం కొరకే ఈ నిస్వార్థ లక్ష్యం గై కొన్నాను.
నా సమకాలీనులకు నీ సాక్షాత్కారం కల్గించలేను
అందుకే ఈ కలిలో ఆకలి దోపిడిలను అంతం చేసి నీ రాజ్యాన్ని నెలకొల్పుతాను
వీరు చూసి తరిస్తారని.
నా జన్మ రాహిత్య లక్ష్యంతో పాటు నీ మహిమ, నీ నామ మహిమ చాటిన వానిగా
మరో మహాత్ముడనవుతాను.
రామా !
నా స్ఫూర్తువి నీవే ! నా పూజనా మూర్తివి నీవే
నీ నామ జపమే నా తపస్సు !
ఆది కావాలి నా జాతికో ఉషస్సు !
యువార్ ది సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జి
నీ నామం నాలో ప్రకంపించని క్షణం నేనో శవాన్ని
చచ్చిన శవాన్ని
నేను కుహానా ఆస్తిక వాదుల పై ఒంటికాలి పై లేచినా
నా మరో కాలుకి ఆధారం నీవే
రామా!
మరో రాముడనవుతానని ఆందోళన చెందకు
అంత సీన్ లేదు
నన్ను రక్షించు
నన్ను భక్షించ చూసే పేదరికం నుండి, గ్రహ పీడనలనుండి
నెగటివ్ వేవ్స్ నుండి నన్ను రక్షించు
కనీశం నేను కలలు కంటున్న రామరాజ్యానికి అక్షర రూపమన్నా ఇవ్వనీ..
శ్రీ రామ రామ రామేథి రమా రామే మనో రమే
సహస్ర నామ తత్తులుయం శ్రీ రామ నామ వరాననే
జై శ్రీరాం! జై శ్రీరాం ! జై శ్రీరాం!
No comments:
Post a Comment