Tuesday, January 4, 2011

2011లో బ్లాగ్లోకం అజెండా కూడా ఇదే అయితే సూపర్

గతంలో చంద్రబాబు ఊతపదం "నిర్దిష్ఠ ప్రణాళికతో ముందుకు పోతాం"అన్నదే. ఆయనగారి ముందుకు పోవడంతో ఎన్.టి.ఆర్ రెక్కల కష్ఠంతో /భా.జా.పా రెండు శాతం ఓట్ల బిచ్చంతో మనుగడ సాగించిన తె.దే.పా విజయవంతంగా రెండో సారి ప్రతిపక్షంలో పడ్డది.

అందుకే నాకు ప్రణాళిక అంటేనే పరమ చికాకు. ఉద్దేశం మంచిదైనప్పుడు తిక్క తిక్కగా చేసినా పిచ్చ పిచ్చగా సక్సెస్ అవుదాం.

దురుద్దేశంతో ఎంత చక్కటి ప్రణాళికలు రూపొందించుకున్నా షెడ్డైపోతాం. అయినా చంద్రబాబు ఫోబియా కాస్త తగ్గడంతో 2011లో బ్లాగ్లోకంలో  నా అజెండా ఏమిటో ఈ టపా ద్వారా పంచుకుంటా.

నా రచనలు కేవలం క్రింది విషయాల పైనే ఉండాలని ప్రయత్నిస్తా. నిజానికి జ్యోతిషం చివరన ఉన్నా కేవలం హిట్స్ కోసం అడపా తడపా వ్రాయాల్సి వస్తూంది. పది మంది చదువుతున్నప్పుడు మంచి విషయాలు వ్రాస్తే పది మందికి చేరుతుందన్న కకృత్తితోనె జ్యోతిషం మీద దృష్ఠి పెడుతున్నాను .

తమిళ బ్లాగ్లోకంలో ఉన్న స్వేచ్చ ఇక్కడ లేదు .లేకుంటేనా సంచలనం మా ఇంటి పేరు.

*ప్రజల ప్రాణాలను ఎలా కాపాడాలి ? ( హత్యలు,ఆత్మ హత్యలు,దాడులు,ప్రమాదాలను వారించే మార్గాలు)

*విద్యా,విద్యా విదానంలోని లోపాలు సవరించుకునే మార్గాలు. యువతరం మాట బాట ఎలా ఉండాలి? ఎలా ఉన్నాయి?

* ప్రజలు తమకు కావలసిన నిత్యావసరాలను తమ స్వయం కృషితో ఎలా సమకూర్చుకో వచ్చు అన్న విషయం పై సూచనలు (వృత్తి,ఉధ్యోగం,వ్యాపారం, సెర్వీసెస్ ఏదైనా సరే చట్ట బద్దంగా,దర్మ బద్దంగా)

*వివాహం సంతానం పిల్లల పెంపు

*ఆథ్యాత్మికం జ్యోతిష్యం

*ద్యానం యోగం
ఇవే శీర్షికలతో నా బ్లాగులో ఇంకెవరన్నా వ్రాయడానికి ముందుకొచ్చినా ఆహ్వానిస్తాను. పైగా నాకు నచ్చిన టపాలకు రూ.వంద పారితోషికం కూడ పంపుతా.

No comments:

Post a Comment