Monday, January 24, 2011

విద్యా - ఉధ్యోగం - పెళ్ళి - సంతానం.. అంతేనా?

ఇటీవల సైకలాజికల్ స్ట్ర్రెస్ కి జ్యోతిష పరిష్కారం చూపే ఒక బృహత్తర భాధ్యత నా మీద పడింది.  స్ట్ర్రెస్ కి గురైన వారు ఫోన్ చేస్తారు (ప్రతి రోజు రా.9 నుండి10 లోపు) వారి మానసిక వత్తిడికి కారణమేమో తెలుసుకుని జ్యోతిష రీత్యా ఒక పరిహారం/పరిష్కారం చూపడం చెయ్యాలి.

ఈ కార్యక్రమం ద్వారా నేను ఇప్పటికి వందకు పైగా ఫోన్ కాల్స్ అట్టెండ్ చేసాను. కాని వచ్చిన ఫోన్ కాల్స్ అన్ని విద్యా -  ఉధ్యోగం -  పెళ్ళికి సంభంధించినవే. జీవితమంటే ఈ నాలుగేనా? వీటికి అవతల గాని ఇవతల గాని  ఏమీ లేదా? అనిపించింది నాకు. ఇదిలా సాగడం వెనుక కారణాలేమిటి? ఇది సబబేనా?దీని ప్రభావం ఎలా ఉంటుంది? అన్న విషయం పై నాలుగు ముక్కలు రాద్ద్దామని మొదలు పెట్టా. 

పాయింటుకొచ్చే ముందు ఈ సదవకాశం నాకెలా దక్కిందో పది ముక్కలు..పదే ముక్కలు .

గూగుల్ వారు రకరకాల సదుపాయాలు కల్పిస్తుండటం అందరికి విదితమే. అందులో ఒకటి ఎస్.ఎమ్.ఎస్. గ్రూపులు ఏర్పాటు చేస్కోవడం. అలా ఏర్పాటైన ఒక గౄపు స్ఫూర్తి . ఈ గృపును ఏర్పాటు చేసి స్వంత డబ్బు వేలల్లో వెచ్చించి పత్రికా ప్రకటనలిచ్చి మరి దానిని ఏర్పాటు చెయ్యడం జరిగింది. ( సైట్లో పెట్టిన యాడ్ కు నేను డబ్బు తీసుకోలేదు బాసు)  . ఆ గ్రూపులో ఇప్పటికి ముప్పై వేల మంది ఉన్నారని  విన్నాను. గౄపు సభ్యులకు ప్రతి రోజు ఒక పాజిటివ్ ఎస్.ఎమ్.ఎస్. పంపుతారు.

ఈ గృపును ఏర్పాటు చేసి ప్రమోట్ చేస్తున్నది చిత్త్రూరు శ్రీ కృష్ణా జ్యుయలర్స్ యజమాణి శ్రీ జితేంద్రబాబు జైన్. వారు తమ గౄపు సభ్యులకు కౌన్సిలింగ్ ఇవ్వగలరా అని అడగడం  - నేను సై అనడంతో ఈ అవకాశం దక్కింది.

జీవితమంటే విద్యా -  ఉధ్యోగం -  పెళ్ళి - సంతానం ఈ నాలుగేనా? ఒకే ఒక్క ఫోన్ కాల్ కూడ ఈ నాలుగింటికి అవతలగాని ఇవతలగాని రాలేదు. వీటికున్న గొప్పతనం ఏంది? వీటి మధ్య ఉన్న సంభంధం ఏమి? వీటికి అవతల ఏముంది?

ఈ సృష్ఠి అంతటా వ్యాపించి ఉన్నది ఒకే పవర్. అది సెక్స్ పవర్. ప్రకృతి మగ ఏనుగుకి దంతాలిచ్చింది ఆడ ఏనుగును ఆకర్షించడానికే.  నెమలి పుంజుకి పురి ఇచ్చింది , పెట్టను ఆకర్షించటానికే. పువ్వులు పూచేది తేనెటీగలను ఆకర్షించడానికే. మరి ఇవన్ని ఎందుకు?

సృష్టి ఆగిపోక సాగడానికి.

ప్రతి ప్రాణియొక్క ప్రప్రధమ కర్తవ్యాలు కొన్నే. ప్రాణలతో కొన సాగడం . తన జాతి అంతరించి పోకుండా చూడటం. తన జాతి+ తాను వ్యాప్తి చెందేలా ప్రయత్నించడం.

ఇందుక్కావల్సిన పవర్ సృష్ఠినుండే అందుతుంది.  అదే పవర్  మనిషిలోను  ఉన్నది. మనిషిలో నున్నది  ఒకే పవర్.అది సెక్స్ పవర్. అది ఊర్ద్వముఖంగా సాగితే యోగిక్ పవర్. అధోముఖంగా సాగితే సెక్స్ పవర్.

విద్య దేనికి? ఉధ్యోగం వస్తుంది కాబట్టి.. ఉధ్యోగం దేని? అప్పుడే పెళ్ళి అవుతుంది కాబట్టి. పెళ్ళి దేనికి సెక్స్ ఆ పై సంతానం ( జాతిని వ్యాపింప చెయ్యడం).

పరిమితమైన పవర్ గల ప్రాణులు ఇక్కడికి తమ సర్వ శక్తులను పోగొట్టుకుని నిర్వేదానికి జారిపోతాయి. 
పోనీ ఈ ప్రాణులు అవతలకి దూకకుంటే పీడా పోయింది. కనీశం   వీటికి అవతల ఏముందనైనా తెలుసుకోవచ్చుగా?

ప్రతి ఒక్కరికి వీటికి అవతలకెళ్ళే శక్తి సామర్ధ్యాలను ప్రకృతి ఇచ్చింది. కాని మనమే వాటిని గుర్తించడం లేదు. విద్యా -  ఉధ్యోగం -  పెళ్ళి - సంతానం వీటికి అవతల ఏదో ఉందనడానికి ఆధారం ఈ నాలుగింటిని పొందినాక కూడ మనలో ఉన్న అశాంతి,అసంతృప్తులే.

ఈ అశాంతి,అసంతృప్తులు స్మశాన వైరాగ్యంలా కరిగి పోవడంతో మనస్సు ఈ నాలుగింటి వైపే మొగ్గుతుంటుంది. తొలూత ఈ నాలుగింటిని తాను పొందాలని ఉవ్విళ్ళూరే మనస్సు ఆ పై తన వారసులు పొందాలని కుత కుతలాడుతుంది. ఇంకా వయస్సుండి -బతికే ఉంటే ఇవే విషయాలను తన మనమళ్ళకు అందించే ప్రయత్నం కూడ జరుగుతుంది. ఇదో విష వలయం. ఇందులో చిక్కుకున్న తరం అతిత్వరలో అసంతృప్తికి అశాంతికి గురవుతుంది. ఆలోపే సమాజం బ్రష్ఠు పట్టి పోయుంటుంది.

మరి ఈ నాలుగింటికి అవతల ఏముంది?వాటిని అందుకోవాలంటే  ఏం చెయ్యాలి? (తదుపరి టపాలో కొనసాగిస్తా)

No comments:

Post a Comment