Monday, January 24, 2011

పాత సినిమాలు Vs కొత్త సినిమాలు

పా.........త సినిమాల్లోను విలన్స్ ఉండేవారు ( ప్రస్తుత సినిమాల్లోని హీరోలకంటే బెటర్). తొలూత క్లైమేక్సులో ఒక కానిస్టబుల్ "పున్య్! పున్య్!" అంటూ వచ్చి విలన్ని కస్టడిలోకి తీసుకునే వాడు.శుభం కార్డు పడుతుంది. ఆతరువాతి సినిమాల్లో కానిస్టబుల్ అవినీతి పరుడు ఎస్.ఐ మంచోడు, ఆతరువాతి సినిమాల్లో ఎస్.ఐ కూడ విలన్లతో చేతులు కలుపుతాడు. డి.ఎస్.పి వచ్చి న్యాయం చేసేవాడు. ఆతరువాతి సినిమాల్లో డి.ఎస్.పి విలన్ డెన్లో మందు కొట్టి పడుకోనుంటాడు (స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్?)

ఇది క్రమేనా డెవల్ప్ అయ్యి హోమ్ మినిస్టర్ చెడ్డోడు సి.ఎమ్ మంచోడనే స్థాయికి పోయింది. ( డా.రాజశేఖర్ రెడ్డి సినిమా) . ఆతరువాత రాజకీయనాయకులందరు చెడ్డోళ్ళు పత్రికల్లోళ్ళే ఉత్తములని చూపారు ( ఆఖరి పోరాటం). ప్రస్తుతం మీడియా బతుకెంతే అందరికీ తెలిసి పోయింది.

ఈ దశాబ్దంలో కోర్టులు చురుగ్గా/ చక్కగా  పని చేస్తున్నాయనే ఇమేజ్ వచ్చింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు ఒక నవశకాన్నే ప్రారంభించాయి. ప్రస్తుతం స్పెక్ట్ర్రం కుంభకోణం విషయంలోనూ ఇదే జరిగింది.

న్యాయశాఖకు  దినకరన్ వంటి న్యాయమూర్తులు మాయని మచ్చ తెచ్చిన మాట అవతల ఉంచుతాం, తమిళనాడులో ఒక కేసు విషయమై బెయిల్ మంజూరు చెయ్యాలని తన పై వత్తిడి తెస్తూ "కేంద్రమంత్రి లైన్లో ఉన్నారని" పబ్లిక్ ప్రాసిక్యూటర్  బదిరించినట్టు న్యాయమూర్తి సుప్రీమ్ కోర్టు న్యాయ మూర్తికి లేఖ వ్రాసారు. అందులో ఆ మంత్రి పేరు పేర్కొన్నట్టు మీడియాకు చెప్పారు.

కాని అప్పటి  సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న వారు ఆ లేఖలో మంత్రి పేరు లేదని చెప్పడంతో పెద్ద దుమారమే చెలరేగింది. ఇంతకీ ఆ మంత్రెవరో తెలుసా? టెలికాం స్కామ్ కింగ్ రాజా.

ఇప్పటి మానవహక్కుల కమిషన్ కె.జి.బాలకృష్ణన్ భంధువులపైనా ఆరోపణలొచ్చిన నేపథ్యంలో కవితకు ఏది కాదు అనర్హం అన్నట్టు న్యాయశాఖ కూడ ఇటువంటివాటికి అతీతం కాదనే భావన ప్రజల్లో కలింగింది.

గతంలో నేను 1997 నవంబరు నుండి నాటి సి.ఎమ్.చంద్రబాబుగారికి నా ఆపరేషన్ ఇండియా2000 ప్రాజక్టును ప్రతిపాదిస్తూ వచ్చి -సమాదానం రాక విసిగి వేసారి -తిరుగు టపా ఖర్చులకై పది రూపాయలు ఎం.ఓ పంపాను -అదీ తీసుకున్నారే గాని స్పందించలేదు.

ఈ యవ్వారం పెయిడడ్ సర్వీసుగా మారినందున జిల్లా వినియోగదారుల ఫోరమ్ కు ఫిర్యాదు చేసాను "ఇందులో సేవా లోపం"లేదని కొట్టేసారు. రాష్ఠ్ర్ర ఫోరానికి అప్పీల్ చేసాను. నో రెస్పాన్స్. ఈ విషయమై తమిళనాడు ,ఆంద్రా హై కోర్టులకే కాదు సుప్రీం కోర్టు న్యాయ మూర్తులకు సైతం డజనుకు పైగా అన్ని ఆధారాలతో లేఖ వ్రాసాను.

కాని నా ఒక్క లేఖను సైతం సుమోటాగా స్వీకరించలేదు. కాని శంకర్ రావు కేవలం ఒక రాజకీయ నాయకుడు. అధికారం కోసం/అధికారాన్ని కాపాడుకోవడం కోసం ఏ మాటైనా చెప్పగల వ్యక్తి. ఇంతకీ అతని లేఖ మీడియా వారికి అడ్రెస్ చేయబడినది.

దానిని సుమోటాగా స్వీకరించిన కోర్టు మరి నా లేఖలనెందుకు పట్టించుకోలేదో? ఎవరన్నా న్యాయ నిఫుణులు సమాదానమిస్తే సంతోషిస్తా..

గమనిక:
హై కోర్టు ,సుప్రీమ్ కోర్టులకు నేను లేఖలు పంపినందుకు డాకుమెంటరి ఆధారాలు నా వద్ద ఉన్నాయి. మీలో ఎవరైనా కోరితే స్కాన్ చేసి పెడతాను.

No comments:

Post a Comment