Friday, January 14, 2011

సాంబారుగాడి పై వేటుకు రంగం సిద్దం


ఓ ఇంట పాము దూరింది. దానిని ఆ ఇంటివారి పెంపుడు కుక్క చూసింది. మొరగడం ప్రారంభించింది. ఆ ఇంటివాడు ఆ కుక్కను నోర్ముయించడానికి కొంత సేపు ప్రయత్నించి తిక్కరేగి డబుల్ బ్యేరెల్డ్ గన్ తీసి కాల్చేసాడు. ఆ కుక్క హరీమంది.

ఆ ఇంట దూరిన పాము అంతా నిద్రపోయాక తన పని తాను చేసి పారేసింది. సరిగ్గా అదే నా విషయంలోను జరుగనుంది. జయేంద్ర పై నా విమర్శల పై కమెంటు చేసిన వారిపై ఏ చర్యా ఉండదు (పాము దూరడాన్ని ఎవ్వరూ గుర్తించలేదు) కాని వారి కమెంటు పై నా స్పందన పై మాత్రం ఖచ్చితంగా చర్య ఉంటుంది.అదేమంటే నా బ్లాగును నిషేదించడం.

బహుసా జెల్లడ,మాలికా డాట్ ఆర్గ్,కూడలిలలో కనిపించే చిట్ట చివరి టపా ఇదేనేమో? ఎందుకైనా మంచిది ఈ పేజిని బుక్ మార్క్ చేసుకొండి. ఇక జయేంద్ర పై నా విమర్శ పై వచ్చిన కమెంటు పై నా స్పందన ఇదో !

//నాయనా! నీలాగే చాలా మంది మా బ్రామ్మల మీద పడి, స్వతంత్రం వచ్చిన నాటి నుండి ఏడుస్తునే వున్నారు//
మీ వాళ్ళను మోసి మోసి భుజాలు కాయలు కాసాక,కాయ కోసి కల పండిందని మీవారే తింటుంటే చూసి ఏడవక చేసేదేముంది?

//కాని అలా ఏడవటం వల్ల మాకు లాభాలే గాని నష్టాలు లేవు//
మేం ఏడుస్తే కరిగి పోయేదానికి మీరేమన్నా మాలా  సామాన్యులా? కేవలం బుర్రతో ఆలోచించే మేధావులు కదండి. గుండె ఉన్న స్థానంలో బండను కుదుర్చుకుని (బ్రాహ్మణ )స్త్ర్రీలను సైతం మీరు పెట్టిన యాతనలు అన్ని ఇన్ని కావుగా?

బాల్య వివాహాలను నిర్భందిస్తూ " నీ కూతురు పెద్దమనిషయ్యే ముందే పెళ్ళి చెయ్యాలి.లేకుంటే ప్రతి నెల ఆమె భహిష్ఠును త్రాగాలని ఆజ్నాపించినవారుకదా?
(సతరు శ్లోకం సైతం ఉంది - మీరు  ఆధారం కోసం నిలదీస్తే భయిట పెడతా)

//మా వాళ్ళు ఇండియా లో కాకుండా చక్కగా ఇతర దేశాల్లో మంచి కీలక మైన పొజిషన్లో వున్నారు,//

కీలకమైన పొజిషన్లే అయితే అక్కడి వారు పది రూపాయలిస్తేగాని చెయ్యని పనిని మీవారు రెండు రూపాయలకు చేసి పెడ్తూ అక్కడి నిరుధ్యోగ యువత ఉసురు పోసుకుంటున్నారన్న సంగతి తెలుసులెండి సారి

//(న్యాయ బద్దంగా డబ్బు సంపాదిస్తున్నారు//
మీ వేదాల ప్రకారం సముద్రం దాటితేనే బ్రష్థులవుతారుగా.. మరి మీ వారి విదేశీయానానికి వేదాలు అడ్డురాలేదా బ్రదర్!

// కాని, ఇతర కులస్థులు వాళ్ళలో వాళ్ళే తన్నుకు చస్తూ గ్రూపులు కింద విడిపోయి //
ఇదంతా తమ పుణ్యమే కద బ్రదర్.. వర్ణాల క్రింద విభజించింది మీరే కద తండ్రి!

//వాళ్ళతో బాటు ఈ దేశాన్ని కూడా నాశనం చేస్తున్నారు//

వారికి సెక్రెట్రియేట్లో , మార్కెటింగ్ డిపార్ట్ మెంటుల్లో ,ఎస్టాబ్లిష్మెంటు సెక్షన్లలో కూర్చుని స్కెచ్ ఇచ్చేది తమవారే కదా..దొంగ లెక్కలిచ్చే ఆడిటర్లు,దొంగ కేసులు వాదించే లాయర్లు ఎంతమంది లేదూ

// ఎంత మంది బాబాలు కోట్లు సంపాదిస్తున్నారు//
మీ వాళ్ళు వేదం వింటే చెవిలో సీసంకరిగించి పొయ్యాలన్నారుగా.. చదివితే నాలిక కోస్తామన్నారుగా.ప్రతిదానికి సీక్రెట్ మెయింటెయిన్ చేస్తూ.. అసలు విషయాలను దాచి పెట్టింది మీరే కదా..

గుడ్దిలో మెల్ల మేలన్న చందంగా బాబాల వెంట పడేరు బహుజనులు

//(వాళ్ళంతా బ్రామ్మలే అనుకుంటున్నావా)//
కాదు కాని మీకు నకిలీలు

//బొట్టుపెట్టుకున్నాడు పెతీ వోడు బ్రామ్మడు కాదురా సన్నాసి,//
మీ ఈ మాటను కాదన్నానా? కాదంటానా?

//ఇవాళ ఏ టివి చానల్ చూసినా ఇలాంటి బాబాలు, ఇతర మత ప్రచారకులు కోకొల్లలు, //
ఏం చేద్దాం గురూ.. మీరు మరీ కాపి రైట్ కోసం కకృత్తి పడేరు -సీక్రెట్ సీక్రెట్ అని టెన్షన్ పెట్టేరు. అసలు దొరకనప్పుడు నకిలీలకు మార్కెట్ రావడం మాములేగా?


//నీకు దేశాన్ని వుద్దరించాలనే వుద్దేశం కనక వుంటే అలాంటి బాబాలు, నీలాంటి కుహనా జ్యోతిస్యుల మీద పడు,//
మీ (వారి) అజెండా ప్రకారం పని చేసే ఎవడన్నా చేరేది శ్రీకృష్ణ జన్మస్థానం (కేంద్ర మంత్రిరాజా) లేదా ఖబర్ స్థాన్ ( రాజీవ్ గాంది) నాకా ఉద్దేశం లేదుగాని బాబాల సంగతి ఎప్పుడో ఉతికి ఆరేసి ఎండేసా.. మీకా తుత్తర అవసరం లేదనుకుంటా

నన్ను కుహానా జ్యోతిషుకుల పట్టికలో చేర్చడంతో నేనెంతటి నిజాలను నిర్భయంగా వ్రాసానో చెప్పకనే చెప్పేరు.

థ్యాంక్స్. ఇప్పటికీ ఒక్క ముక్క చెబుతున్నా వ్యక్తిగతంగా నాకు ఏ బ్రాహ్మణుని మీద గోరంత కోపమో,విరోధమో లేదు. నా ఆవేశానికి కారణం ఇప్పటికీ (ఇంత కాలం ఏలి - దోచి కూడ) భుద్ది మార్చుకోకపోవడమే..

//"గో బ్రాహ్మణులు ఎక్కడ పూజింప బడతారో, అక్కడ శుభం జరుగుతుంది"//
బ్రాహ్మణోత్తమా ! కాల దర్మం మీకు తెలియనిది కాదు. మారే కాలాన్ని పట్టి అన్నీ మారిపోతాయి. గతంలో నూటికి తొంబై శాతం వ్యవసాయం మీదే ఆధార పడి బ్రతికేవారు. పొలం దున్నడానికి ఎద్దులు అవసరం కాబట్టి గోవులకు ఎక్కడలేని ప్రాధన్యత ఇచ్చే వారు.పైగా అవి సాధు జంతువులు కాబట్టి  వాటిని కలిగి ఉండటం పెద్ద రిస్క్ లేని పని. అందుకే మీవారు మరింత కలర్ ఇచ్చి రాజులకు మస్కా కొట్టి బేవార్సుగా వేలాది ఆవులు తెచ్చుకునేవారు.అయితే వాటిని మేపడం యాదవులు చేస్తారు. అవి పాలీయడం మానేస్తే ఊళ్ళో పంచముడు తీసుకెళ్తాడు. చస్తే ఆడే తీసుకుపోతాడు. ఇది గో పురాణం వెనుకున్న అసలైన కిటుకు.

ఇక బ్రాహ్మణులంటారా at that time they were just un productive consumers of the society. ఎక్కడ తమర్ని సైతం కాయ కష్ఠం చెయ్యమంటారోనన్ని భయపడి ఇలా బిల్డప్ ఇచ్చుకునేసేరు.

// బ్రాహ్మణులు అంటే కులం కాదు (సమాజ హితవు కోరేవారు)//
ఐ సీ ! మరి నేను కూడ సమాజ హితం కోరేవాడ్నే .. మీ వాళ్ళ వలే గ్రహ దోషాలకు పరిహారంగా  యాగాలు చెయ్యమని వేలకు వేలు గుంజడం లేదు.కుజ దోషముంటే రక్త దానం చెయ్యమంటున్నా. సర్ప దోషం ఉంటే ఇతర మత గ్రంథాలు చదవమంటున్నా. మరి మీ సంఘంలో నన్నూ ఒక సభ్యునిగా చేర్చుకోమనగలరా? ఎందుకండీ ఈ హిప్పాక్రసి. బ్రాహ్మణత్వమన్నది పుట్టుకతో నిర్ణయించబడుతుందని చంటి పిల్లవాడు సైతం చెబుతాడు.


// ఇలా బ్రాహ్మల మీద పడి ఏడ్చే బదులు, అడ్డంగా కోట్లు సంపాదిస్తున్న రాజకీయ నాయకులు (?), వ్యాపార వేత్తల మీద ఆర్తికల్స్ రాయి,//

ఆర్టికిల్ ఏంది ఖర్మ! దుమ్ము దులిపాను. కేసులు పెట్టాను. పేపరుకెక్కాను . ఆమరణ నిరాహార దీక్షకూడ చేసాను.

// తర్వాత నీ సంగతి ఆళ్ళే చూసుకుంటారు? అంత దమ్ముందా?//
దమ్మా? నా కణకణాల్లో జీర్ణించుకు పోయిందదొక్కటే సుమండి..

2 comments:

  1. మీ బ్లాగు కి హిట్ల కోసం వేరే మార్గం దొరకలేదా స్వామి.

    ReplyDelete
  2. Why delay, how should we wait for that good news? When this mad-home odg will be shot by the owner with dbl-brl gun? He shud kill it with but, it is not worth a bullet.

    ReplyDelete