Wednesday, January 12, 2011

వివాహ పూర్వం పురుషులు పుంసత్వ సర్టిఫికేట్ పొందాలి : నటి మనోరమా

ఇది మీకైతే ఫ్లాష్ న్యూస్ అయ్యుండొచ్చు గాని తమిళులకు ఇది పాత చింతకాయ పచ్చడి.దీని పై పెద్ద దుమారమే చెలరేగింది.

ఈ విషయమై ఉధ్యమిస్తానని కూడ మనోరమ ప్రకటించారు. నిజానికి పుంసత్వ పరీక్షతో తమ క్వాలిఫికేషన్ను నిరూపించుకోవలసిన దుస్థితికి నేటు పురుష ప్రపంచం చేరుకుందంటే అది అతిశోయక్తి కాదు.

పురుషుల వీర్యంలో జీవకణాల సంఖ్య విపరీతంగా పడి పోతున్నాయి. ఒక్క రూపాయి పెట్టి ఒక రీఫిల్ కొంటే అది వ్రాస్తుందో లేదో చూసి కొంటాం. మరి లక్షలు లక్షలు కట్నాలు పోసి కొనుక్కునే మగాడిలో అసలు మగతనం ఉందో లేదో తెలుసుకునే హక్కుమనకు లేదా?

వాత్సాయనుడు తన కామ సూత్రంలో పురుషాంగం యొక్క కొలతలను ఇలా చెబుతాడు: 3 అంగుళాలు,6 అంగుళాలు,9అంగుళాలు. ఇవి ఈ రోజుల్లో సాధ్యమేనా ? ఎక్కడో నీగ్రోలకో ఏవో కొన్ని తెగలకో మాత్రమే ఉంటుంది. (ఇంతకీ పురుషాంగం సైజుకి రతిలో సుఖానికి ఏ సంబంధము లేదు సుమా ఎందుకంటే స్త్రీ యోణిలోని మొదటి 3 అంగుళాల వరకే స్పర్శ ఉంటుంది).

ఆ నాడు ఆ సైజు ఉన్నది కాబట్టే వాత్సాయనుడు తన కామ సూత్రంలో ఉటంకించాడు. అంటే నాటి మానవుల జీన్లో ఉందా రహస్యం. వారి జీవన విదానం, ఆహార పద్దతులు అలా ఉన్నాయి.

మానవుడు ఎప్పుడైతే వండుకొని తినడం మొదలు పెట్టాడో అక్కడికే అతను రోగాల పుట్టగా మారిపోయాడు.

నేను 2,3  వ తరగతి చదివే రోజుల్లో  ఐదో తరగతి పిల్లల్లో కొందరికి మీసాలు వచ్చేసాయి అంటే నమ్మండి. కాని పాపం చాలా అమాయకులు.  ఇంతకీ అది 1974-1975 సం.లే  కాని ఇప్పట్లో పదవ తరగతి అబ్బాయి సైతం నాటి 5వ తరగతి పిల్లాడిలా ఉంటున్నాడు. ఇందుకు కారణం ఏమిటి?

మన ఆహార పద్దతులు , తగిన వ్యాయామం లేక పోవడం, హైపర్ టెన్షన్స్ మాత్రమే. ఉదయమే ఇడ్లి దోశ, మద్యాహనం భోజనం/పప్పు ,రాత్రికి భోజనం పప్పు ఇవేగా మన ఆహార పద్దతులు. ఇంకా మురికి కాలువల పై పాని పూరి, బేల్ పూరి , లేదా బ్యేకరి ఐటంస్, ఐస్ క్రీంస్, ఫాస్ట్ ఫుడ్, లేదా జంక్ ఫుడ్. దీంతో అనవసర కొవ్వు చేరడం, షుగర్ రావడం అల్సర్, అజీర్తి,మలబద్దకం, ఇలా ఒకటేమి అన్ని రోగాలు వస్తాయి.

మనం వాడే మేలురకం బియ్యం మెషిన్ చేత పాలిష్ చేయబడినది. దాని కొనలో (స్త్రీ యోణిలీ క్లిటోరిస్ ఎంత కీలకమో అంత కీలకం ఇది కూడ) విటమిన్ బి ఉంటుంది, మెషిన్లోకి తోసిన వొడ్లు ఈ విటమిన్ బ్ ని పోగొట్టుకుని కాని భయిట పడవు.
బియ్యం = కార్బో హైడ్రేట్గా కార్బో హైడ్రేట్ గ్లూకోస్ గా మారుతాయి.
అదనంగా ఉన్న గ్లూకోసును శరీరం గ్లైకోజనుగా మార్చి తీరాలి. ఇందుకు ఇన్సులిన్ అవసరం. అది తగ్గితే షుగరు వస్తుంది. మనం మూడు పూటలా భియ్యం తింటుంటే లీటర్ల కొద్ది ఇన్సులిన్ అవసరమవుతుంది. దానిని స్రవించే కెపాసిటి మన శరీరానికి ఉండాలిగా ?
కాబట్టి వీలైనంత వరకు భియ్యం తగ్గించి రాగులు, జొన్నలు, వంటి ఇతర దాన్యాలను కూడ వాడాలి. అలాగే ఇంకో సూత్రం ఉంది:
పచ్చిగా తింటే 100 శాం సేఫ్ , ఉడక పెడితే 50 శాతం సేఫ్ , తాళింపు చేస్తే 35 శాతం సేఫ్, వేంపుడు సాక్షాత్తు విషం.
ఏం తింటున్నాం ,ఎలా తింటున్నాం లతో పాటు ఎప్పుడు తింటున్నాం అన్నది కూడ ముఖ్యం. అడ్డమైన వేళల్లో తింటే జీర్ణం కాదు. అజీర్తి, మలబద్దకాలే అన్ని రోగాలకు మూలం. (అన్నట్టు మలబద్దకం ముదిరితే మూలం /అదే పైల్స్/కూడ వస్తుంది)

ఐస్ క్రీంస్ కథకొస్తే మన బాడి ఉష్ణోగ్రత 98.4 డిగ్రీలు. ఐస్క్రీం 0 డిగ్రీలో ఉంటుంది. ఇది వెళ్ళి మన శరీర ఉష్ణోగ్రతను తగ్గించాలని చూస్తుంది. మన శరీరం తన ఉష్ణోగ్రతను మెయింటైన్ చెయ్యాలని చూస్తుంది. అనవసరమైన టక్ అఫ్ వార్ జరుగుతుంది. ఈ పోటీలో ఏది నెగ్గినా దెబ్బ తినే ది మాత్రం మన ఆరోగ్యమే.

అలాగే జంక్ ఫుడ్స్. ఒక వస్తువు ఇన్ని గంటలవరకే భాగా ఉంటుందన్నది ప్రక్రుతియొక్క రూలు. దానిని అధిగమించటానికి మన సైంటిస్టులు వాటిలో ఏవేవో కలుపుతారు. వాటి యొక్క రి యేక్షన్ ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు. ఇక ఫాస్ట్ ఫుడ్ అంటారా ? మన ఇంట్లో అమ్మగాని, భార్యగాని మన కుటుంభంలోని నలుగురి కోసం చేస్తేనే ఏవేవో జరిగి పోతున్నాయి. అటువంటిది మనమంటే ఏమాత్రం సెంటిమెంట్ లేని, కేవలం మన పర్సులోని డబ్బే ద్యేయంగా వండి పెట్టే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల కథను మీరే ఊహించుకొండి.
మానవ శరీరంలో ఎసిమిలేషన్ (ఆస్వాదించటం) ఎలిమినేషన్ (విశర్జించటం) అనే ఈ రెండు ప్రక్రియలు సక్రమంగా జరిగితేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. సెక్సుకే కాదు మరి దేనికైనా పనికి వస్తుంది లేకుంటే మరెందుకూ పనికి రాదు.

తినడం ఒక ఎత్తైతే దానిని సక్రమంగా జీర్ణం చేసుకోవడం ఇంకా ముఖ్యం. మంచి నీళ్ళు దారాళంగా త్రాగడం, మద్యలో చిరు తిండ్లు కూల్ డ్రింక్స్ త్రాగడం, టీ కాఫి త్రాగడం వంటివి చెయ్య కూడదు. పైగా మంచిగా నిద్ర పోవాలి. ఇవన్ని సక్రమంగా జరిగితే తిన్న తిండి జీర్ణమై శక్తినిస్తుంది. ఆ శక్తిని రతికో మరొక దానికో వినియోగించుకోవచ్చు.
అజీర్తివలన నవ్వ,గజ్జి,గడ్డలు, మంట, వాయు ఉపద్రవాలు, అసిడిటి ఇలా ఒకటి కాదు ఎన్నో రోగాలొచ్చేస్తాయి. ఇంతటితో ఆగకుండా తగిన వ్యాయామం కూడ చెయ్యాలి.ఆరోగ్యమైన శరీరమే అయినప్పటికి రతిలో మరో ముఖ్య చిట్కాను ఫాలో కాకుంటే భురద కుంటలో పడినట్టే. అదేమంటే .. తిన్న తిండి పూర్తిగా జీర్ణం కాక ముందు తినడమే కాదు, రతిలో పాల్గొనడమే కాదు, రతి గురించిన తలంపులు కూడ జీర్ణ ప్రక్రియను ఆపి వేస్తాయంటే నమ్మండి.

No comments:

Post a Comment