Saturday, January 1, 2011

దారిద్రియం దగ్ద చేయగా మిగిలేదే అసలైన మీరు

తల్లీ !
ఎన్నో కథలు చదివాను
మరెన్నో కథలు వ్రాసాను
ఎందరో మనుషుల జీవితాలను కంటున్నాను
వింటున్నాను
మరెందరో మనుషుల జీవితపు
సుఖ దుఖాల్లో పాలుపంచుకుంటున్నా
అయితే అమ్మా....
నా కథలో మాత్రం ఎందుకే ఇంతటి డ్రాగింగ్
క్షణాల్లో,గంటల్లో,రోజుల్లో,నెలల్లో వీరి స్థిథి గతులు
తలక్రిందలై పోతుంటే
నేను మాత్రం జస్ట్ ప్రేక్షకుడిగా -ఏలీన్ గా- గ్రహాంతరవాసిలా
ఎలా చూడగలుగుతున్నానే వీరి ఆరాటాలను -జీవన పోరాటాలను

నా తల్లికి కుచేలుని భార్య పేరు
కుదిరింది కాబట్టే
ఈ దారిద్రియం ఇలా వెంటాడుతూందా?
ఈ దారిద్రియమే నా ఆలోచనలను కేంద్రీకృతం చేసి
తాబేలువలే నన్నో లక్షయపు గూడులో చెర పెట్టిందా? లేదా బధ్ర పరచిందా?

పుట్టిన నాటినుండి నేటి వరకు
ఎదో రూపంలో
ఎదో మోతాదులో
దారిద్రియం... దారిద్రియం..
ఈ దారిద్రియాన్ని దగ్దం చేసేందుకు
ఎంతగానో ఎదిగాను
మరెంతగానో దిగ జారాను
కాని .. కాని ..కాని
దారిద్రియంలో మాత్రం మార్పు లేదు
నీడలా..పాపంలా.. శాపంలా
వెంటాడుతూనే ఉంది
ఎందుకమ్మా?
కాని ఒక్క విషయాన్ని అంగీకరిచాలి
నా పేదరికమే నిజమైన "నేను" ఏమిటో నాకు స్ఫురింప చేసింది.

కొంపదీసి ఇదీ నీ స్వరూపమేమో?
బహుసా ! నేను భవిష్యత్తులో కేవలం డబ్బు మనిషిగా
పరివర్తన (ఐ మీన్ దిగజారి) చెంది ఈ సమాజాన్ని
దోచుకుని నా జాతకాన్ని సార్థకం చెయ్యాలని
ఈ టీర్ట్మెంటా తల్లీ!

అమ్మా!
నా గోడును ఏ మాటలతో చెప్పాలనుకున్నా
అదే గోడును మరేవో   మాటలతో నీకు విన్నవించుకున్న
సందర్భాలు మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తాయి
అన్ని విదాల అర్హత ఉండిఅదృష్ఠవంతుడిగా ఎదగనిచ్చే జాతకంలోనే పుట్టాను
నా ప్రయత్నంలో అతి ఉండొచ్చు గాని
లోపం మాత్రం లేదు

ఈ దేశాన్ని ఉద్దరించాలనుకున్నాను
కనీశం నా కుటుంభాన్ని సైతం
పోషించలేని దుస్థితిలోనే ఉన్నాను
గురు చంద్ర సంయోగ ఫలమగు
పద్నాలుగు సం.ల వనవాసం ఇదేనేమో అనుకుని
ఓర్చుకున్నాను

అవీ గడిచి పోయాయి
తపస్సు చేసాను ఒక భీజాన్ని ఐదు సం.లుగా ద్యానిస్తూనే ఉన్నాను

ఏవో కొన్ని చిల్లర  అద్భుతాలు జరుగుతున్నాయి గాని
నా దారిద్రియం మటుకు దగ్దం కావడం లేదు
ఎందుకు?

గతాన్ని విడిచి పెడతాం
అప్పుడు నేను కేవలం ఒక తెలివైన చిలుకను మాత్రమే

మరి నేడు?
హే మదుర మీనాక్షి !
నీ చేతిలోని చిలుకంతటి స్థాయికి ఎదిగాను
హే అంబ!
నా పలుకులు నీ పలుకులంతగా భీభత్సాన్ని సృష్ఠిస్తున్నాయి
పూజ్యులు పూజ్యాలవుతున్నారు
రాజ్యాలే గడ గడలాడుతున్నాయి
మరి నా దారిద్రియం మటుకు కొణ ప్రాణంతోనన్నా
కొట్టుమిట్టాడుతూనే ఉంది
పొరభాటున నా దారిద్రియానికి చిరంజీవత్వం
ప్రసాదించలేదుగా?

పొరభాటున నా దారిద్రియానికి అమృత సేవనం గావించ లేదుగా?
బై మిస్టేక్.. ఈ నా దారిద్రియం నీ ప్రతిరూపం కాదు కదా?

నేను చెయ్యాలి యుద్దం!
అందుకు కావాలి నా దారిద్రియం దగ్దం
అని ఒక మూల ఆలోచిస్తున్నా

శిలనై ఉన్న నన్నుశిల్పంగా మలచింది ఈ దారిద్రియమేనో ఏమో అన్న అనుమానమూ కలుగక మానడం లేదు..

చెడ్డవానికి చెడిపోయే కాలం వచ్చే సమయాన అతనికి మంచి ఆలోచన ఇచ్చి ముంచేయడం

మంచివానికి భాగుపడే కాలం వచ్చిన సమయాన
అతనికి చిన్న చెడు ఆలోచన ఇచ్చి సెటిల్ చెయ్యడం నీ స్టైల్..

ఎందుకో డబ్బు మీద నాకున్న అపోహలను తొలగించావు

వీరి డబ్బు జబ్బును కుదర్చాలంటే నేనదే డబ్బును సంపాదించి చూపాలి..

మరీ వీరిలా డబ్బును ప్రాణంతో ముడి పెట్టుకుని,మరణానికి చేరువవుతూ కాక
ఆడుతూ పాడుతూ..

ఇంకా సంపాదిస్తా.. లక్ష్యం సాధిస్తా.. ఆపై వీరికి సృష్థి రహస్యం భోదిస్తా..

No comments:

Post a Comment