Thursday, January 20, 2011

ఆత్మహత్య ఆలోచనను సైతం వాయిదా వెయ్యగల కొటేషన్స్

*ఈ జీవితం వద్దనుకునేగా ఈ నిర్ణయానికొచ్చేరు. తనను వద్దనుకున్న వానికి వరంగా మారడమే జీవితంయొక్క స్పెషాలిటి. విజయపథంలో మీ తొలి అడుగు ఈ ఆలోచన.

*గెలుపు ఓటమి అంతా సిల్లి థింగ్స్. ఒక హేతువాది సంతానం లేమితో  నిబద్దత కోల్ఫోయి యాగం చెయ్యించాడు. అతనికి సంతానం కలిగిందనుకొండి అది గెలుపా? ఓటమా?
ఒక అసలు సిసలైన భాగవదోత్తముడు సంతానం కోసం గుళ్ళు గోపురాలంతా తిరిగి ఒక హేతువాది అయిన డాక్టర్ చికిత్సతో సంతానం పొందాడనుకొండి ఇది గెలుపా ఓటమా?

*మీకే కాదు ఈ భూ ప్రపంచంలో ప్రతి ఎదవ అట్టర్ ప్లాఫ్ అయినవాడే. ఆళ్ళకి ఆత్మహత్య గురించి ఆలోచించే దమ్ముల్లేవు. మీకున్నందుకు సంతోషించండి.

*జీవితమన్నదే ఒకదానిని మార్చి మరోదానిని పట్టుకోవడానికి ప్రయత్నించి చివరికి అన్ని పోగొట్టుకునే కౄయల్ గేమ్.

*మీ ఈ ఆలోచనకు కారణం పేదరికమైతే అది మరీ సిల్లి. డబ్బు ప్రతి ఎదవదగ్గరా ఉంది. అదేమి తెల్లకాకి కాదు. కొమ్మున్న గుర్రమూ కాదు.ఏదో రోజు మీ చేతికి చిక్కకా తప్పదు. మీరు సక్సెస్ కాకా తప్పదు.

*మీ పేదరికానికి ఆత్మహత్య చేసుకోవలసింది ఈ దేశాన్ని 64సం.లు పాలించిన బడా నాయకులు,వారి వారసులు,శిష్యులు,భజనపరులే. వీలుంటే వారిని చంపాలేగాని ఆత్మహత్య సిల్లిన్నర సిల్లి

*మీ నాన్న మీ తల్లితో సెక్స్ చేసినప్పడు అతని స్పెర్మ్ లో కోట్ల కొలది జీవకణాలు విడుదలయ్యాయి. ఆ కోటి జీవకణాల్లో మీరూ ఒక్కరు. ఆనాడు చక చకా ఈదుకుంటూ అండాన్ని తొలుచుండక పోతే బాత్ రూమ్ పాలయ్యేవారు. జీవన్మరణ పోరాటమది.అందులో  కోటి మందితో పోటీ పడి నెగ్గిన వారు మీరు. మిమ్మల్ని ఈ సృష్ఠి సైతం రెకగ్నైజ్ చేసింది. ఈ గుడ్డి ప్రపంచం గలిలియోను సైతం రెకగ్నైజ్ చెయ్యలేదు. మిమ్మల్ని గుర్తించక పోవడం ఈ ప్రపంచం దురదృష్ఠం కాని మీది కాదు.

*పేదరికమే మీ ఈ ఆలోచనకు కారణమైతే డబ్బున్న వారి జీవితాలను ఒక్కసారి చూడండి. ఎంత నిరర్థకంగా, ప్రేలవంగా,చెత్తగా ఉన్నాయో.

నిరుపేదకు అందే కొద్దిపాటి డబ్బు ఆక్సిజనుకన్నా గొప్పది. 
పేదవానికి అందే ఇంకొద్దిపాటి డబ్బు ఆ పూట భోజనం అంత విలువగలది. మద్యతరగతివానికి అందే డబ్బు బియ్యం బస్తాలాంటిది.
దనవంతునికి అందే డబ్బు లైసెన్స్ లేని హోల్ సేల్ వ్యాపారికి అందిన  మొదటి లోడు భియ్యం వంటిది.దానికి పార్కింగ్ స్థలం ఎలా ఏర్పాటు  చెయ్యాలబ్బా, లంచ కుండీలైన కమర్షియల్ టాక్స్ అధికారుల నుండి ఎలా కాపాడాలబ్బా అన్న చింత మొదలవుతుంది.

మల్టి మిల్లియనరుకు అందే డబ్బు జంబో జెట్ ఫ్లైట్లో వచ్చిన బాసుమతి రైస్ లోడ్  వంటిది . ఆ మంత్రిత్వ శాఖ చుట్టూ ప్రదిక్షణలు చేస్తే గాని అనుమతి లభించదు. అనుమతి లేకుండా ఉంచుకోవాలంటే అండర్ గ్రౌండులో దాచి దాని పై  సాముహిక మరుగుదొడ్లు నిర్మించుకోవలసిందే. పీతి కంపు భరిస్తూ రోజు క్రిందికెళ్ళి చూసి తరించాల్సిందే.

No comments:

Post a Comment