Wednesday, January 19, 2011

చంద్రబాబు రాష్ఠ్ర్రానికి పెద్ద దిక్కై వ్యవహరించాలి





మూరెడు ఎం.పిలను పెట్టుకుని బారెడు మంత్రి పదవులు తన్నుకు పోయిన కరుణానిది స్వార్థంతో ఆ పని చేసాడో -లేక తెమిళుల సత్తా చాటడానికి చేసాడో అది వేరేకథ. కాని కరుణానిధి ప్రవర్తనను  చూసి యావత్ భారత దేశం బెంబేలెత్తింది.

వై.ఎస్. హయాంలో కూడ బారెడు ఎం.పీలున్నప్పటికి మూరెడు మంత్రి పదవులే దక్కాయి. వై.ఎస్. ఎందుకు ఆ నాడు నిలదీయలేక పోయాడంటే ఒకటి 2009 ఎన్నికల్లో సీట్లు తగ్గడం -రెండు ఈయన గారు కాస్త గొంతు పెంచితే ఆదిష్ఠానం పంచన చేరి వంచన పూరిత నాటకాలాడటానికి కొందరు ముసలి నక్కలు సిద్దంగా ఉన్నారు.

నరసింహరావు పి.ఎం అభ్యర్ధిగా ఖరారయ్యాక నంద్యాల్లో  ఆయన కంటెస్ట్ చేసారు. ఎన్.టి.ఆర్ ఒక్క క్షణం కూడ ఆగక తె.దే.పా పోటి చెయ్యదని ప్రకటించారు.

ఇక్కడ కాన్సెప్ట్ పి.వి శతృ పార్టికి చెందినవారే అయినా అతను ఓ తెలుగు వాడు అన్నదే.
నేడు ఎన్.టి.ఆర్ లేడు. ఎన్.టి.ఆర్ అంత లేకున్నా ఒకింతవరకైనా కేంద్రాన్ని,ఆదిష్ఠానాన్ని  వారి వెక్కిలి వేషాలను అదుపు చెయ్యగల నాయకుడు వై.ఎస్. అతనూ లేక పోయాడు.

ఇక మిగిలింది చంద్రబాబు. ఎంతటినీచ చరిత్ర కలిగి ఉన్నప్పటికి రాష్ఠ్ర్రం యొక్క పెద్ద దిక్కు పోయాక ఆ ఖాళిని పూరించ గల సత్తా- అనుభవం కలిగిన ఏకైక నేత చంద్ర బాబే. ఎన్.టి.ఆర్ ని అమరుడి చేసింది తనే. తీరా అమర్ రహే అని నినదించేదీ ఆయనే.

చంద్రబాబులో ఏ మాత్రం ఎన్.టి.ఆర్ పట్ల గౌరవం ఉన్నా రాష్ఠ్ర్రంలోని పార్టీలు,నాయకులను ఒక్క త్రాటి పై  తెచ్చి ,నడిపించి తెలుగు ఆత్మ గౌరవాన్ని దేశానికి ప్రపంచానికి చాటాల్సిన నైతిక భాధ్యత చంద్రబాబు పైనే ఉంది.

గతంలో తాను సి.ఎం గా ఉన్నప్పుడు  "ప్రతి దాన్ని రాజకీయం చెయ్యడమేనా? అసలు రాజకీయమంటే ఎన్నికలప్పుడే ఉండాలి" అనే బాబు ప్రస్తుతం 365 రోజులు రాజకీయమే చేస్తున్నారు.

వై.ఎస్. పూర్తి మెజారిటితో అధికారానికొచ్చినప్పుడు ఉన్న పరిస్థితి వేరు. మెజారిటి కాస్త తగ్గాక ఆసన్నమైన స్థితిగతులు వేరు. ఆదిష్ఠానం క్రమేనా తన అసలు స్వరూపాన్ని భయిట పెట్టడం మొదలైంది.

ఏదో వై.ఎస్. పుణ్యకార్యాలు అతన్ని అలా అలా పైలోకాలకు తీసుకెళ్ళి పోయాయి కాని,ఆయన బతికుంటే జగన్ పొజిషన్లో వై.ఎస్. ఉండి ఉండేవారు. పైగా సోనియమ్మకు తాను ఇందిరమ్మకంటే ఎక్కువ అన్న ఫీలింగ్ వచ్చేసింది. (ఇంతకీ ఇందిరమ్మ కాలి గోటికి సరిపోదు సోనియమ్మ)  ఉంటే నాతో లేదా మీరంతా నా శతృవులే అన్న చందంగా ఆమె బిహేవియర్ మారింది. రాష్ఠ్ర్ర ఎం.పికలు మంత్రి పదవులు దక్కక పోవడం సోనియమ్మలో ముదిరిపోతున్న అహంకార జబ్బుకు సూచికలు మాత్రమే . ఇది కాస్తా ముదిరిందంటే ప్రజాస్వామ్యానికే ముప్పు వాటిల్లడం గ్యారంటి. అది రాష్థ్ర్రపతి పాలన కావచ్చు,ఎమెర్జెన్సి కావచ్చు, చట్ట సభను నిద్రావస్థలో ఉంచడం కావచ్చు.

ఈ పరిస్థితిలో రాష్ఠ్ర్రం పెద్ద దిక్కుగా ఉండి పార్టిలను ఒక్క త్రాటిపైకి తెచ్చే భాధ్యతను చంద్రబాబు తీసుకోవాలి. తమిళనాట ఎం.జి.ఆర్ మరణానంతరం కరుణకు ఇట్టి అవకాశమే వచ్చింది. కాని అతను ఆ పెద్దరికం అలవాటు చేసుకోక ఇప్పటికీ కాంగ్రెస్ చంక నాకే దుస్థితిలో ఉన్నాడు.

కాంగ్రెస్ ను రాష్ఠ్ర్రం నుంది తరిమి కొట్టడమే దేయంగా రాష్ఠ్ర్రం యొక్క అభివృద్ది,పరువు ప్రతిష్ఠల పరిరక్షణే లక్ష్యంగా, తెలుగు గౌరవాన్ని నిలిపే విదంగా బాబు ఒక వినూతన స్ట్ర్రేటజిని ప్రకటించాలి.

మనలో మనకు వెయ్యి వైషమ్యాలుండొచ్చు -కాని దిల్లి /కేంద్రం మాటకొస్తే మాత్రం ఒక్క మాట మీద నిలబడాలి . అప్పుడే తెలుగువారమన్న గౌరవం మనకు దక్కుతుంది.

ఈ బృహత్తర భాద్యతను స్వీకరించి బాబు కార్యాచరణ మొదలు పెడితే దిల్లీ వీథుల్లో పొర్లు దండాలు పెట్టే చంచాగాళ్ళు, స్వంత గల్లీల్లో సైతం ప్రజాబలం లెక సిల్లి రాజకీయం చేసే భజన పరుల బెడద పోతుంది.

చూద్దాం ఇప్పటికైనా చంద్రబాబు ఎన్.టి.ఆర్ స్థానాన్ని అందుకుంటారో ?లేక కనీశం వైఎస్ లేని ఖాళినన్నా పూరిస్తారో? లేక కరుణలా తయారవుతారో?

No comments:

Post a Comment