Tuesday, January 18, 2011

సూరిని జగన్ చంపించాడు -ఏ. బి .ఎన్ : వెల్ డన్ ఏబిఎన్ !

ఎవరో మస్తాన్ రావు అనే వ్యక్తి. అతనిని నలుగురు జగన్ మనుషలమని చెప్పి బెదిరించారు. అతను ఈ విషయాన్ని సూసైడ్ నోట్లో వ్రాసి ఆత్మ హత్య చేసుకున్నాడు.ఇది ఏ.బి.ఎన్ కథనం యొక్క సారాంశం. జగన్ ఏదో లారి బ్రోకర్ ఆఫీసులో గుమాస్తా అనుకుందాం. అతని పరిచయాలు పరిమిత సంఖ్యలో ఉంటాయి.తనకు పరిచయం ఉన్నవారిలో ఎవరు -ఏ విషయానికి తన పేరు వాడుకుంటున్నారని తెలిసే అవకాశం ఉంది. కాని జగన్ ఒక వ్యాపార వేత్త .(లారి బ్రోకర్ ఆఫీసు కాదండి .. లక్షల కోట్ల వ్యాపారాలు సాగిస్తున్న ప్రముఖుడు)

రక రకాలైన వ్యక్తులు కలుస్తుంటారు. వెళ్తుంటారు.వారిలో మంచోళ్ళెవరు -చెడ్డోళ్ళెవరు జగన్ కి తెలిసుండాలని ఎక్స్ పెక్ట్ చెయ్యడం మూర్ఖత్వం. రాజారెడ్డిని చంపినవారు చంద్రబాబును కలిసినప్పుడు బాబు సి.ఎం.అతని చెప్పు చేతల్లో  ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ ఉన్నది కాబట్టి బాబు వాకబు చేసుకునే అవకాశం ఉంది. వారించే /బేటిని రద్దు చేసుకునే అవకాశం కూడ ఉంది అయినా కలిసారు.

కలవడం కథ ఒక వంతైతే కలిసినోళ్ళు కలవనోళ్ళు ఎవరైనా జగన్ పేరు చెబితే తమకు పనులవుతాయన్న ఆలోచన గలవారు ఎవరైనా జగన్ పేరు చెప్పుకుంటారు. అలా చెప్పినోళ్ళ టార్చర్ కి ఎవరన్నా ఆత్మ హత్య చేసుకుంటే చేసుకునే ముందు సూసైడ్ నోట్ ఇలానే వ్రాసి ఉంచుతారు.

ఆ సూసైడ్ నోటును పోలీసులు ఎందుకు పట్టించుకోలేదన్నది ప్రశ్న..ఒక సారి ఒక తల్లి,తన చంటి బిడ్డతో ఎక్కడికో వెళ్ళి పోయింది. బాధితులు నన్నాశ్రయిస్తే విలేకరినన్న హోదాతో స్టేషనుకెళ్ళి ఫిర్యాదు చెయ్యించాను. మూన్నెల్లైంది - ఎటువంటి చర్యా తీసుకోలేదు (కనీశం ఆమె ఎక్కడికి వెళ్ళి ఉంటుంది - ఆమె బంధువుల వివరాలేమి అని కూడ ఫిర్యాదుదారుడ్ని అడగలేదు)

విధిలేని పరిస్థితిలో మానవహక్కుల కమీషనుకు ఫిర్యాదు చెయ్యించాను. అక్కడికి మరో మూన్నెల్లైంది. HRC వారు పాపం వెంటనే జిల్లా ఎస్.పికి కాయితం పంపినట్టున్నారు. మనోళ్ళు దానిని పట్టించుకోలేదు. మరోసారి కాస్త ఘాటైన పదజాలంతో ఫిర్యాదు చెయ్యించాను.

హెచ్.ఆర్.సి.వారు హోమ్ సెక్రెట్రికి కాయితం పంపితే వారు జిల్లా పోలీసు కార్యాలయానికి కాయితం పంపితే మనోళ్ళూ మళ్ళీ నాన్చేసారు. ఈ సారి హెచ్.ఆర్.సి వారు హోం సెక్రెట్రికి -హోం సెక్రెట్రి జిల్లా ఎస్.పి ఫోన్లు చెయ్యడంతో స్థానిక ఎస్.ఐ కదిలారు.

ఇవన్ని చెప్పడం ఎందుకంటే పోలీసులు కేసులను గాలికొదిలేయడం షరా మామూలేనని నొక్కి చెప్పడానికే. ఈ మాత్రం దానికి ఏదో తెలుగు సినిమాలోలాగా జగన్ ను ఒక ముసుగు దొంగ రేంజిలో చిత్రీకరించడం ,వై.ఎస్. ఏదో  స్థానిక ఎస్.ఐకి ఫోన్ చేసి మరి సూసైడ్ నోట్ ప్రక్కన పెట్టమని చెప్పినట్టుగా వక్రీకరించడం చూస్తుంటే ............వద్దులెండి బూతులొచ్చేస్తున్నాయి.

కాని ఏ.బి.ఎన్ కి ఒక విషయంలో థ్యాంక్స్ చెప్పాలి. నేడున్న రాజకీయ పరిస్థితిలో జగన్ 2014 దాక కష్ఠాలనడం - ప్రభుత్వాన్ని కూల్చననడం - సదా శాంతి బోధ చెయ్యడం చూసి ఇరవై ప్లస్ వన్ (?) ఎమ్.ఎల్.ఏలు మాత్రమే చేరేరు.

ఏబిఎన్ కథనంతో జగన్ ఇమేజ్ విపరీతంగా పెరిగింది. సూరిని ఎయ్యించినోడన్న ఇమేజి దెబ్బకి అరవై మంది ఎం.ఎల్.ఏలు జగన్ తో చేరుతారు.

ఈ కథనంతో చిర్రెత్తి  2014 మాట పక్కన పెట్టి జగన్ రేపో మాపో ప్రభుత్వాన్ని కూలుస్తారు. సి.ఎం.అవుతారు. ముప్పై కాదు.. ముప్పై మూడు సం.ల స్వర్ణయుగానికి నాంది పలుకుతారు. వెల్ డన్ ఆంద్రజ్యోతి

ఆ సూసైడ్ నోట్ ఆధారంగా వెంటనే జగన్ ను ఎందుకు అరెస్ట్ చెయ్యలేదని ఏబిఎన్ అడక్కనే ఆడుగుతూంది.

3 comments:

  1. lakshala kotla vyaapaaraalu level ku oka saamaanyudaina jagan elaa edigaadabbaa... evadabba sommu...?

    ReplyDelete
  2. దొంగ లం కొడుకు కాకపోతే లక్షల కోట్లెక్కడివి రా సామి...!!

    ReplyDelete
  3. ee akrama sampaadanalo kontha Sonia Gandhi ku koodaa muttajeppaadu YS, anduke Sonia thelu kuttina donga laa vyvaharisthondi jagan vishayam lo... meeru entha convince chesinaa jagan ku clean chit ivvalenu nenu. INDIA lo raajakeeyaalalo akrama sampaadana maamoole ankuntoo alaanti raajakeeya naayakulanu encourage cheyadam naaku nachchadu... Sorry...
    Mukesh Ambani koodaa GAS roopam lo sahajavanarulanu dochukontunnaadu, mari chattaalu alaa edchaayi mari. oka Business Magnet chattala lo lopaalanu CASH chesukuntunnaadu. kaani oka politician alaa cheyakoodadu. chattaalalo, vyavasthalo lopaalanu sarididdaali. anthegaani veeru koodaa Ambani la laa CASH chesukovadaaniki prayathninchakoodadu.

    ReplyDelete