Sunday, January 9, 2011

నాడు అనచివేత -నేడు స్వేచ్చ : రెండింటితోనూ నష్ఠం స్త్ర్రీకే

పుట్టడమే తల్లిగా పుదుతుంది ఆడపిల్ల. ఆరు సం.ల వయస్సుగల పాప ఏం చక్కా  అన్నం వడ్డిస్తుంది. తల్లికో,తండ్రికో అనారోగ్యం చేస్తే ఓర్పుతో వారిని కనిపెడుతుంటుంది.

కాని 50 సం.ల వయస్సున్న మగవాడు సైతం చిల్లరగా ప్రవర్తిస్తుంటాడు. ఆడపిల్ల కేవలం ఆడపిల్లే అయితే ఆమె ఎలా ఉన్నా సమస్య లేదు.

కాని ఒక విదంగా ప్రకృతి సిద్దంగానే స్త్రీ వికలాంగురాలు. శారీరక దౌర్భల్యాన్ని అధిగమించవచ్చు గాని దాంతో సంక్రమించిన మానసిక దౌర్భల్యాన్ని ఓవర్ కం కావడం ఎంతో కష్ఠం. అందుకే నేను మొత్తుకుంటున్నాను.

మొదట మీ శారీరక దౌర్భల్యాన్ని పారాద్రోలండి. సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడి. మీరెంత అందంగా ఉంటారు, ఎంత మందిని ఆకర్షిస్తారన్నది మీ భలం కాదు. మీ శారీరక బలహీనతను అంగీకరించడమే అవుతుంది.

నేను 1987లో జిల్లా ఖజాణాకార్యాలయంలో సెక్షన్ రైటరుగా పనిచేసాను అక్కడ  సావిత్రి  అని ఒకావిడ. (పేరు మార్చాను లెండి) బక్క చిక్కిన శరీరం, పొంతనలేని పొట్ట, కొత్తమిరి కట్టకన్నా ప్రేలవంగా జుట్టు, గుళ్ళ గూబ కళ్ళు.

అయితే మనం (నేను) ఆత్మనే చూద్దాం కాబట్టి ఆమెతో కూడ క్యేషువల్ గానే ఉన్నాను. దీంతో ఆమె  నాకు దగ్గరై తన ఫ్యేమిలి ఆల్బం చూపింది. అందులో ఆమె చిన్ననాటి ఫోటో చూసి బిత్తర పోయాను . ఆ రూపం అచ్చం  భానుప్రియాలా ఉండే . జస్ట్ ఒక టైఫాయిడ్ ఇంత పని చేసిందట.ఆమె ఒక డైవోర్సీ, విడాకులకు ఆమె కురూపానికి సంబంధం లేదు. ఇతర కారణాలవలనే విడాకులైంది.  అందం సంగతి ఇది.

 స్త్రీ భవిష్యత్తులో ఎదుర్కొనవలసిన సవాళ్ళు అనేకం ఉ. పీరియడ్స్, డెలివరి, ఆ సమయంలో సక్రమంగా తినలేక పోవడం , ఇప్పట్లో ఆ సవాలు డబుల్ అయ్యింది. స్త్రీ స్వాతంత్రయం పేరిట ఉధ్యోగాలు కూడ చేసి పెట్టాలిగా.

అప్పట్లో కొన్ని పనులు ఆమెకు తప్పేది. ప్రస్తుతం టూ వీలర్ నడుపుతుంది కాబట్టి అవీ ఆమె నెత్తినపడ్డాయి. ఫాస్ట్ నెస్స్ అన్నది గమ్యాన్ని చేరుకోవడంలో వస్తే ఫర్వ్చాలేదు గాని నిరర్థక, భవిష్యత్తుకు వినాశకరంగా తయారయ్యే కార్య కలాపాలవలన నష్ఠ పోయేది స్త్రీయే.

కాలం మారిందని ఎంతగా రొమ్ము బాదుకున్నా పురుషుడు మాత్రం ఆఠవిక యుగంలోనే ఉన్నాడు. తనతో పాటు పది మందితో తిరిగే ఆడ పిల్లను పెళ్ళి చేసుకోడు. కేవలం తనతో మాత్రం తిరిగుంటే అది వేరే సంగతి. కాబట్టి ఈ ఫాస్ట్నెస్స్ వలన లూజర్ స్త్రీయే.

అప్పట్లో సమాజం స్త్రీని అనచి వేతతో దోచుకుంటే ఇప్పుడు స్వాతంత్ర్యం పేరిట దోచుకుంటూంది. నేను మహిళలను కోరేది ఒక్కటే మీరు  ఫస్టఫాల్ మనుష్యులు. ఆ తరువాతే లింగ బేదం.

మీరు మీ ప్రియునికో, మీ భర్తకో ఆ గంటో /పావు గంటో స్త్రీగా ఉంటే సరిపోయేది గా. 24 గంటలు వేష ధారణ, హావ భావాలు, సిగ్గు పడటాలు, బుగ్గలు ఎర్ర బడటాలు ఎందుకనే.

ఇవి మిమ్మల్ని ఎదుటివారి ముందు నిలబెడతాయని మీరు భ్రమిస్తున్నారు. కాని వీటి వలన మీరు పండుకోవలసి వస్తుందేమో కాని నిలబడటం కల్ల. ( నా ఈ మాట సూటిగా మీ బుర్రలోకి ఎక్కాలనే కఠినమైన పదాలు వాడాను. క్షమించండి)

ఇక్కడ కలిసి తిరగడంలో ఉన్న చిక్కేమంటే ఇందులో నష్ఠ పోయేది కేవలం స్త్రీయే. గర్భ ధారణ, ఎయిడ్స్, సుఖ రోగాల సమస్య లేనప్పటికి ( కేండోంస్ ఉన్నాయి కాబట్టి) అపఖ్యాతి పాలు కావడం మాత్రం తప్పదు. లో క్లాసు, హై క్లాసు కథ ఎటో ఉన్నా మిడ్డిల్ క్లాస్ స్త్రీలకు మాత్రం ఇది గొడ్డలి పోటే కాబట్టి తస్మాన్ జాగ్రత్త ..

మనుష్యులుగా ఉండండి. మనుష్యులుగా ప్రవర్తించండి. మనుష్యులుగానే సాధించవచ్చు. మీరు స్త్రీ అన్న సంగతి కేవలం మీ జీవిత భాగస్వామికి రుజువైతే చాలు సుమా !

యుగ యుగాల్గా మిమ్మల్ని కృంగ దీస్తున్న శారీరక బలహీనతకు స్వస్తి పలకండి. పౌష్థిక ఆహారం, తగినన్ని వ్యాయామం ,అవసరమిన విశ్రాంతి విషయంలో స్వార్థ పరులు కండి.

మిమ్మల్ని కేవలం స్త్ర్రీగా చూసేవారి పట్ల జాగ్రత్త వహించండి. వారు మీకు తాత్కాలికంగా  మేలే చేసినా వారు మిమ్మల్ని మనుష్య్లులుగా తిరస్కరిస్తున్నారన్న సంగతి మరిచి పోకండి.

చాలు నాడు అనచివేతతో, నేడు స్వేచ్చతో దోపిడికి గురైంది చాలు. మెల్కొండి..

1 comment: