Tuesday, January 25, 2011

చావు మీద భయంతో బతికేస్తున్నారు.

నేస్తం!


ఒకే దిశలో ఒకే గమ్యానికేసి సాగుతున్నవారం.

కొందరు పడవల్లో,కొందరు నావల్లో ..

అయినా నావైనా,పడవైనా చివరికి చేరేది మరణ తీరాన్నేగా

ఆలోపు తొందరేలా..



నాకూ ఈ ప్రపంచం పోకడ నచ్చడం లేదు.

అందుకని బాయ్ కాట్ చేసెయ్యాలా?

అది చేతగాని ప్రజా ప్రతినిదులు చేసే పని.



మనముందాం.. ఏ గృడ్డి ప్రపంచమా!

నీ పోకడ మాకు నచ్చలేదందాం.

మన వాణి వినిపిద్దాం

బోణి కాకుంటే బాణి మారుద్దాం

కాణీలకోసం ఖూనీలు చేసేసే

చెత్తనా కొడుకులకు తెలీదు

వారు ఎవరినో చంపినప్పుడు

వీరిలో కూడ ఏదో చస్తుందని

వారే బతికేస్తుంటే మనం చావడం దేనికి?



ప్రపంచానికి అనువుగా తమరిని తాము మలుచుకునే

పిరికి పందలు వీరంతా..

ఈ ప్రపంచాన్ని మన కలలకనుగుణంగా మార్చ చూసి

మార్చలేమేమోనన్న దిగులుతో బతుకు మీద నిరాసక్తతతో

చావు గురించి ఆలోచించామే గాని

వీరిలా "బతక" లేక చావు వంక చూసామేగాని

మోసానికి గురై యమ పాశానికి మెడలు వంచాలనుకున్నామే గాని



నిజం చెప్పాలంటే ఇక్కడ ఎవరికీ బతకాలని లేదు.

చావు మీద భయంతో బతికేస్తున్నారు.

చచ్చే ధైర్యమే మనకుంటే బ్రతకడం ఎంతో సుళువు



చావడానికే సిద్దమైనవాడు మరి దేనినైనా బతికించగలడు

చచ్చిన మానవత్వాన్ని

చచ్చి పోతున్న ప్రజాస్వామ్యాన్ని



పేదరికం మనలను మనకు పరిచయం చేస్తుంది..

తిరస్కారం మనలను మనకు దగ్గర చేస్తుంది



మనలను మనం పరిచయం చేసుకుని

మనకు మనం దగ్గరై దగ్దం చేస్తాం పేదరికాన్ని

ప్రేమిద్దాం సమస్త విశ్వాన్ని..

No comments:

Post a Comment