Monday, January 24, 2011

హై కోర్టు నోటీసులతో జగన్ పని గోవిందా!

ఇదే  ఈ రోజు స్టుడియో ఎన్ చానల్లో ప్రముఖంగా ప్రసారమిన కథనం యొక్క సారాంశం. ఇంతకీ అసలు విషయమేంటి?.గతంలో  మంత్రి శంకర్ రావు జగన్ సంస్థల్లో పెట్ట్టు బడుల గురించి కొన్ని వ్యాఖ్యలు చేసేరు. వాటిని సుమోటోగా స్వీకరించి హైకోర్టు జగన్ సంస్థల్లో పెట్టుబడుల విషయమై 52 మందికి నోటీసులు జారి చేసింది ( గమనించండి: తీర్పు వినిపించలేదు)

ఈ మాత్రానికి ఇంత అత్యుత్సాహం చూపుతున్నారంటే జగన్ దెబ్బకి ఎంతకి దిమ్మతిరిగి ఉన్నారో అర్థమవుతూనే ఉంది.  వారి ముఖ్య ఆరోపణ ఏమంటే ఉత్పత్తి ప్రారంభం కాక మునుపే షేర్లెలా అమ్ముడు పోయాయి? వాటి విలువా ఏటా ఎలా పెరిగాయి?

వారి ఉద్దేశం ఏమంటే ప్రభుత్వాన్ని,వై.ఎస్.ని మచ్చిగ చేసుకోవడం కోసం "ఎవరో" పెట్టుబడులు పెట్టారన్నదే.

మీరో నేనో వెళ్ళి ఒక సినిమా తియ్యాలనుకుంటే ఆ సినిమాకయ్యే ఖర్చు మొత్తం హాట్ కేష్ గానో, బ్యాంక్ బేలన్సుగానో కలిగి ఉండాలి. ఇదే ఒక "విశ్వసనీయత"గల సంపన్నుడు / ప్రముఖుడు సినిమా తీయాలనుకుంటే ఒక ఏ4 కాయితం మీద ఒక్క రూపాయి స్కెచ్ పెన్నుతో ప్రొడక్షన్ నెం. వన్ అని వ్రాసి బొట్టు పెట్టి  హారతి ఇస్తుంటే ఆ హారతి తాలూకు  కల్పూరం ఆరే లోపల ఏరియాలు సేల్ అయిపోతాయి. అడ్వాన్సులు కోట్లల్లో అందుతాయి.

దీనిని అవినీతి అంటారా? జగన్ ఉత్సాహవంతుడు,సమర్థుడు, విద్యావంతుడు, ఎప్పట్లోనుండో కార్పోరేట్ రంగంలో ఉంటూ అనుభవం గడించినవాడు. పైగా వై.ఎస్. తనయుడు. మాట తప్పను -మడమ తిప్పను అనే పంచ్ డైలాగుతో రీ ఎంట్రి ఇచ్చి దుమ్మురేపిన ప్రాక్టికల్ హీరో వై.ఎస్.. ఇన్ని అంశాలను పట్టి పెట్టుబడి పెట్టేవారు పెడతారు.

ఇందుకు జగన్ని భాధ్యుడ్ని చెయ్యడం ఎంతమెరకు తర్కం? ఇంతకీ నత్తి-సుత్తికి పేటెంట్ రైట్ కలిగి  ఊక దంపుడు మాటలు విసిరే శంకర్ రావు మాటల్లో ఏమెరకు పస ఉంది? నాకేమో ఇది జగన్ కు పరీక్షలా అనిపించడం లేదు.  శంకర్ రావు మాటలు ఆధార రహితమని తేలడం ఖాయం.

మీరు నేను టీ కొట్లో మాట్లాడుకోవడం వేరు.. బ్లాగుల్లో బండ భూతులు వ్రాసుకోవడం వేరు. కాని శంకర్ రావు ఒక మంత్రి .అతని మాటలు నిరాధారమైనవని తేలితే కోర్టు అభిశంసించవచ్చు. జగన్
మంత్రి పైన , దూకుడుగా ఏక పక్ష వార్తలు ప్రసారం చేస్తున్న చానళ్ళ పైన లక్షల కోట్లకు పరువు  నష్ఠదావా వేయ వచ్చు.

అదే జరిగితే చానళ్ళకు కాపలా కాస్తున్న సెక్యూరిటి కుర్చీ సైతం జప్తుకు గురికావచ్చు.

1 comment:

  1. nijame, ee desam emaithe manakenduku...? okallanu thittadam maani, mundu nenu koodaa urgent gaa addam gaa sampaadincheyaali. mari untaa bye...

    ReplyDelete