Saturday, January 22, 2011

వేలు పిళ్ళై ప్రభాకరన్ బతికే ఉన్నాడు

వేలు పిళ్ళై ప్రభాకరన్ బతికే ఉన్నాడు అంటూ తమిళనాడు రాజకీయ నాయకుల్లో కొందరు నేతలు (వైగో, నెడుమారన్,సీమాన్) చెబుతూ వచ్చినప్పటికి శనివారం నాడు ఈ విషయాన్ని ధృవీకరిస్తూ వార్తలు గుప్పుమన్నాయి. ప్రముఖ బై వీక్లి నక్కీరన్ కవర్ స్టీరి విడుదల చేసింది. ఆ కథనం ప్రకారం : ఇటీవల అన్నా టెర్మినల్స్ లో దిగిన ఒక జంట ప్రముఖ తమిళ నేత ఒకరిని పిలిపించుకుని " ప్రభాకరన్ బతికే ఉన్నారని - వెస్ట్ ఇండీస్ ధీవుల్లో ఉన్నారని తాము కూడ అక్కడికే వెళ్తున్నామని చెప్పేరు. ఆ జంటలో పురుషుడు చిన్న రూబన్ అనే కమేండర్ అని అతను యుద్దంలోని చరమ గట్టాన తన రెండు చేతులూ పొగొట్టుకున్నవారని నక్కీరన్ తెలిపింది.

ఇది కాక ఇటీవల కెనడా దేశపు గూడచార సంస్థ "లంక యుద్దంలోని చరమ గట్టంలో చనిపోయినట్టుగా భావిస్తున్న ముఖ్యుల్లో చాలామంది బతికే ఉన్నట్టు" కెనడా  ప్రభుత్వానికి నివేదించినట్టూ వార్తలు వస్తున్నాయి.

హెష్చరిక:
మరి ఈ విషయలో సాంబారుగాడికి ఏమిటా తుత్తర అని అడగొచ్చు. చెబుతా? ప్రభాకరన్ జాతకాన్ని అనలైజ్ చేసి జూలై 11,2010 నాడు నా తమిళ బ్లాగులో "ప్రభాకరన్ మరణించ లేదు" అంటూ ఒక టపా వ్రాసాను .దానిని చూడటానికి (ఎలాగూ చదవలేరుగా) ఇక్కడ  క్లిక్ చెయ్యండి. అందులో 2011,నవంబరు 26తరువాత ఈ సంగతి ధృవీకరించ బడుతుందని కూడ పేర్కొన్నాను

No comments:

Post a Comment