Friday, January 14, 2011

నా రచనలు మీలో కొందరికెందుకింత చికాకనిపిస్తాయంటే!

నాకే తెలీకుండా నేను నిజాలు వ్రాసేస్తున్నాను. అవి మీకు తెలియనివని కావు. తెలిసినా వాటి స్థానంలో కొన్ని అందమైన అబద్దాలను సర్దేసుకుని హాయిగా బ్రతికేస్తున్నారు. నేను మీరు నమ్మడానికి,అంగీకరించడానికి(మరీ బాహుటంగా) సిద్ద్దంగాలేని కొన్ని విషయాలను ప్రస్తావించేస్తున్నాను.

కొందరు మహిళలు వారి వయస్సు 40 దాటేస్తున్నా చిన్న పిల్లల్లా నంగి నంగిగా,ముద్దు ముద్దుగా మాట్లాడటానికి ప్రయత్నిస్తుంటారు. అదే కోవకు చెందినవారికి నా మాటలు పుండు మీద కారం చల్లినట్టు పని చేస్తున్నాయి.

నాకు ఈ ప్రపంచంతో/దేశంతో/రాష్ఠ్ర్రంతో  పెద్దగా పని లేదు. నేను ఏదీ ఆశించడం లేదు. నాకు ఉధ్యోగం వద్దు, బ్యాంక్ రుణం వద్దు,అగ్రెడెషన్ వద్దు,ప్రభుత్వం వారు విలేకరులకిచ్చే ఇంటి పట్టాలు వద్దు, నేను బ్రెడ్ హంటర్ గా ఉండగా పేదవాడన్న్న హోదాలో  ఎం.ఆర్.ఓ ఇచ్చిన పట్టాను సైతం క్యేన్సల్ చెయ్యించుకున్నాను. ప్రజలతో కూడ నాకు పని లేదు. వీరి ఆలోచనలు, మాటలు,చేతలు అన్నింటికి నేను వ్యతిరేకమే. పైగా నా అసంతృపితిని ముక్కు సూటిగా చెప్పేస్తుంటాను కూడా.

నేను ఇప్పట్లో (ఐదు -పది సం.ల దాక ఎన్నికల్లో పోటి చేసే ఉద్దేశం కూడ లేదు. మీరు ఇది అహం అనుకోకుంటే ఇంకో మాట కూడ చెప్పగలను. ప్రజలకే నాతో పనుంది, నాక్కావల్సిన యాభై నూరు రూపాయలు నిజాయితిగా,చట్టబద్దంగా మరే మార్గంలోనన్నా సంపాదించుకునే సత్తా,దమ్ము నాకున్నాయి. నాకు చాలా పనులు తెలుసు. (వాటి వివరాలు చెబితే మరీ చికాకు పడతారు -ఎందుకూ కొరగాని వారు).అయితే నా జ్యోతిషం,నా మేథస్సు నా ఒక్కనివద్దే లభిస్తాయి. అంటే నాదే పై చెయ్యి.

నేను కాస్త మనస్సు చంపుకుంటే, నిజాలు మాట్లాడటం మానేస్తే ఇంకా ఎక్కువగానే సంపాదించగలను. నేను సెక్స్ గురించి,దాని ఆవశ్యకత గురించి వ్రాయకున్నా నాకొచ్చిన నష్ఠమేమి లేదు. పైగా ఇంకాస్త గుడ్ విల్ పెరిగి,ఇంకో పది మంది జ్యోతిష సలహా కోసం నన్ను సంప్రదిస్తారు. ఇంకా పది రాళ్ళు ఎక్కువే సంపాదించుకో కలుగుతా.

అయినా చిర్రెత్తించే కథనాలు,టపాలు ఎందుకు వ్రాస్తున్నానా అని ఆలోచిస్తుంటే నాకు కొన్ని విషయాలు స్ఫురించాయి.

కేవలం  నా వ్యక్తిగత అభివృద్దికైతే నాకిన్ని విషయాల పై అవగాహణ ఉండాల్సిన అవసరమే లేదు. కేవలం నేనొక్కడ్ని సుఖ పడాలంటే నేను చెయ్యవలసిందీ ఏమీ లేదు. మరి ఎందుకీ ఏడుపు అని మీరడగవచ్చు.

నెనీ స్థాయికి రావడానికి నాకెన్నో ట్రీట్మెంట్స్ అవసరమాయే. నేనూ మీలో చాలా మందిలాగే ఉన్నా. కాని నేటి నాలా నేను మారడానికి చాలా కాలం పట్టింది.కారణం ఏ ఎదవా పూర్తి నిజాలు వ్రాసి ఉంచలే. నాకు దొరికినవన్ని అందమైన అబద్దాలే, ఆచరణ సాధ్యం కాని ఆదర్శాలే.

వాస్కోడకామా, కొలంబస్ల వలే ఎటువంటి రూట్ మ్యేప్ లేకనే ప్రయాణం చేసా.. నా ప్రాణాలకు సైతం ముప్పు తెచ్చుకున్నా. మరి నా పరిస్థితి మరెవ్వరికి రాకూడదన్న కరుణే నన్నిలా చేదు నిజాలను ఏకరవు పెట్టిస్తూంది.

పది మంది మన్నెనలు కోరి చేసే రచనలు పాఠకుని అహాన్ని సంతృప్తి పరుస్తాయి. మరి నేను కేవలం వీరి పట్ల కరుణ కొద్ది వ్రాస్తున్నా. నాకు వీరి మన్నెనలు అవసరం లేదు. నాలుగు ముక్కలు అలా వ్రాసుంటే మరెందరికో ఉపయోగపడేవిగా అన్న ఆలోచన నా 80వ ఏట కలిగిందనుకొండి. నేనేం చెయ్యగలను? ఏమీ చెయ్యలేను. గిల్టితో మధనపడటం మిన:

అందుకే అనుక్కున్న విషయాలు,అనుకున్న రీతిలో చెప్పేస్తున్నా. ఈ రోజు మీలో చాలా మంది కూడ నన్నో ఎదవక్రింద చూడవచ్చు. కాని ఇంటర్ నెట్ +  గూగుల్ పుణ్యమా అంటూ నా ఈ రచనలు చిరంజీవత్వం పొంది బతికే ఉంటాయి. కొన్నాళ్ళకే అబద్దాల పై చికాకు కలిగి నిజాలను నిర్భ్హయంగా ఎదుర్కొనే దమ్ము,దైర్యం కలిగి నా రచనలకోసం వెతికే వారి సంఖ్య పెద్దదై ఉంటుంది.

కాబట్టే వ్రాస్తున్నా ..జస్ట్ సాటి మనుషుల మీద ప్రేమతో ,కరుణతో - రేపు నన్ను గిల్టి బాధించకూడదన్న ఏకైక కారణంతో వ్రాస్తున్నా.

1 comment:

  1. No. Your are blogging something nonsense. You expressions hurt others and you have some personality disorder, which need to be treated at the earliest before it makes you a lunatic. Why don't you consult a good psychriatist?

    ReplyDelete