Sunday, January 2, 2011

ఘంటశాల భగవద్గీతలో లోపాలు



భగవద్గీత పై నాకు ఎన్నో విమర్శలున్నాయి. వీటిని తమిళంలో ఏకంగా సీరియల్గానే వ్రాసి సంచలనం సృష్ఠించాను. కృష్టుడు ఎలా ఉంటాడని తెలియని వారు ఎన్.టి.ఆర్ ని చూసి కృష్టుడు ఇలానే ఉండి ఉంటాడని అనుకుంటుంటారు. ఇదే విదంగా ఘంటశాల నోటి మాటగా భగవద్గీత వింటుంటే కృష్ణుడి మాటలు ఇలానే ఉండి ఉండాలి  అని అనిపిస్తుంది. ఇందులో ఏ తర్కానికి తావులేదు.

ఘంటశాల గొంతులో ఉన్న అదోరకమైన వర్ణనాతీతమైన దైవత్వం కేవలం కాలికో బైండు పుస్తకాల్లో భంధీగా ఉన్న ఆ శ్లోకాలకు రెక్కలు తొడిగిన మాట నిజమే. పండితుల రకరకాల ఉచ్చారణలతో నలిగిన ఆ శ్లోకాల ఉచ్చారణకు ఒక నిఘంటువుగా ఘంటశాల భగవద్గీత నిలిచింది.

ఉదయ పూర్వం చలిలీ మా రాములవారి గుడివీథి దాటి వెళ్తుంటే ఘంటశాల నోట ఆ శ్లోకాలు చెవి చేరుతుంటే నా కవి హృదయం ఈ భివియంతట శ్రీ కృష్ణుడ్ని ఊహించుకుని ఉర్రూతలూగేది. గీతలోని  అహేతుకాలు, అవుట్ డేటడ్ డేటాలు అన్నీ నా బుర్రలోనుండి ఎగిరి పోయేవి.

ఇంతకీ లోపాలని శీర్షిక పెట్టి ఈ సొల్లేంటి అని మీరు విసుక్కుంటున్నారు కదా? పాయింటుకొస్తా!

నిజానికి నేను లేవనెత్తనున్న లోపానికి ఘంటశాల కారకులయ్యుండరని నా విశ్వాసం. గీత అన్నదే ఒక సంభాష్ణ. దానిని రికార్డు చెయ్యాలనుకున్నప్పుడు ఇద్దరు గాయకుల్ని ఏర్పాటు చేసి ఉండాలి.కృష్ణుడి పాత్రకు ఘంటశాల -అర్జునుని పాత్రకు మరో గాయకుడు.

అలాగే ఫలానా అద్యాయం ఫలానా శ్లోకాలు అన్న డేటాలను చెప్పడానికి మరో వ్యక్తి గొంతును వాడి ఉండాల్సింది.

ప్రస్తుతమున్న టెక్నాలజికి గీతను రీ రికార్డింగ్ చెయ్యడం చాలా తేలిక. ఎస్.పి.బాలసుబ్రమణ్యం ఈ పని చెయ్యొచ్చు. అర్జునుని వాయిస్ కు ఎస్.పి వాయిస్ సరిగ్గా సరిపోతుంది. డేటాలు చెప్పడానికి మరో బిగినర్ ఎవరినన్నా వాడుకోవచ్చు.

No comments:

Post a Comment