Saturday, January 22, 2011

ప్రేమ వైఫల్యాలు - ఆత్మ హత్యలు

ఆత్మహత్యలకు ప్రేరేపించే విషయాల్లో చాలా ముఖ్యమైంది ప్రేమ వైఫల్యం. ప్రేమ వైఫల్యం కావడం ఏంది సిల్లిగా.

వస్తవమైన ప్రేమకు టార్గెట్స్ ఉండవు (పెళ్ళి -పిల్లలు కనడం -వారు తన్ని తరిమేస్తే వృద్దాశ్రమంలో దిక్కులేని చావు చావడం) . ప్రేమంటే ప్రేమించడమే. మనం ప్రేమించిన అమ్మాయి మనలను ప్రేమించినా ప్రేమించకున్నా, నలుగురితో తిరుగుతున్నా, పది మందితో పడుకొన్నా ప్రేమిస్తూ ఉండాలంతే.

ప్రేమకు  మరొకరి అంగీకారంతో పని లేదు. అదే వాస్తవమైన ప్రేమ. ప్రెమకు నిభంధనలుండవు. ప్రేమించిన వ్యక్తి నన్నే పెళ్ళాడాలి, నాకే పిల్లలు కనాలి వంటి నిభంధనలు గల ప్రేమ అసలు ప్రేమే కాదు.

ఇటువంటి ప్రేమలను ప్రపోజల్ అని చెప్పొచ్చు. ప్రపోజల్ అన్నది చాలా స్థూలమైన విషయం.  మీరు ప్రపోజ్ చేసినప్పుడే ఎదుటి వారు డిస్పోస్ చేసే అవకాశం ఉందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.

ఈ భూమిమీదికి ఒంటరిగా వచ్చాం. పుట్టాము కనుక చావడం తధ్యం. మనం చచ్చిన క్షణాన మనం ప్రేమించినవారో, మనలను ప్రేమించినవారో  మనతో పాటు చావరు.

ఏ ప్రపంచ సుందరితో నాకు ప్రేమ(?) సక్సెస్ (?) అయినా వృద్దాప్యమూ ఆగదు, నా చావు ఆగదు.   నేను జీవించాలంటే నాకు ఆక్సిజన్ అవసరం.నీరు అవసరం. తిండి అవసరం. ఇవి స్థూలమైన అవసరాలు.ఇవి లేకుంటే చస్తానేమోగాని ప్రేమ లేకుంటే చస్తానా? నెవర్ !

కేవలం ఒక్క  జీవ కణంగా భయలు దేరి, మిల్లియన్ల కొద్ది జీవకణాలతో పోటీ పడి తల్లి గర్భాయశానికి చేరి పసి కందువుగా, చంటి బిడ్డగా, బాలునిగా,యాంగ్రి యంగ్ మ్యేన్ గా మారుతూ వచ్చిన ఈ ప్రాసస్ లో మనకు దోహద పడిన అంశాలు ఎన్నో ఎన్నెన్నో..

ఎవడో సైంటిస్ట్ ఒక టీకా కనుగొన్నాడు. లేకుంటే తల్లి గర్భమే సమాధి అయ్యేది. మరేదో సైంటిస్ట్ మరేదో టీకా కనుగొన్నాడు. లెకుంటే చంటి బిడ్డగానే చచ్చుండేవారం. ఇల ఒకటి కాదు లక్షల మంది మనలను బ్రతకనిచ్చేరు.పునర్ జీవం పోసేరు. ముందుకు నడిపేరు.

వారికి మనం మనం ఎలా  కృతజ్ఞతలు చెప్పాలి? ఆత్మ హత్య చేసుకునా? అసలు మన ప్రాణం మన సొత్తనుకుంటున్నారా? ఇది కోట్లమంది మనకు పెట్టిన భిక్షం. ఎవరో పిచ్చి ముండ నిన్ను తిరస్కరించిందని ఆత్మ హత్య చేసుకుంటావా?

ఈడ్ని మిస్ అయ్యామే అని ఆమె జీవితాంతం కృంగి కృశించి నశించేలా బతకాలే కాని చచ్చి పోవడమా? షిట్ !

ప్రేమించాలి అంటే నీకు తన గర్భంలో స్థానం ఇచ్చి,  ప్రాణం ఫణంగా పెట్టి, నిన్ను కని ,తన రక్తాన్ని పాలుగా మార్చి ఇచ్చి గుండెలకు హత్తుకుని ఇంతవాడ్ని చేసిని తల్లిని ప్రేమించు.

నువ్వేనాడూ పట్టించుకోకున్నా నీ మీదే తన ఆశలన్ని పెట్టుకుని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న తల్లి భారతిని ప్రేమించు..

ప్రేమించాలి అంటే పదేళ్ళకే పతనమై పోయే అందాన్ని ప్రేమించడం దేనికి? మానవులు ఎంతగా బ్రష్ఠు పట్టించాలని  చూసినా ఏ మాత్రం వన్నె తగ్గని ప్రకృతి కన్యను ప్రేమించొచ్చుగా?

జీవితంలో మరి దేని కోసమైనా బలి పెట్టకూడని ఒకే అంశం ఆత్మ గౌరవం. మరి దేనినైనా పోగొట్టొకుని కాపాడుకోవల్సిన అంశం ఆత్మ గౌరవం. ఆత్మహత్య అంటే నిన్ను నువ్వే అవమానించుకోవడం..

విజయం సాధించిన ప్రతి మగవాని వెనుక ఒక స్త్ర్రీ ఉంది అంటారు . అంటే ఏమర్థం? ఆటను ఆమెను ఓవర్ టెక్ చేసి దాటి విజయం వైపుగా సాగాడన్నదే.

స్త్ర్రీ అన్నది సున్న లాంటిది. ఆమెను ఇండియ స్టైల్లో కీప్ లెఫ్ట్ అన్నావంటే ఆమెకు విలువలేదు, నీ విలువ పెరగదు.

అమెరికన్ స్టైల్లో కీప్ రైట్ అను. ఆమెకూ విలువ పెరుగుతుంది. నీకూ విలువ పెరుగుతుంది.

లెఫ్ట్ రైట్ నిర్ణయించే ముందు నువ్వు గుండు సున్నై పోకుండా చూసుకో. మనిషన్నాక అతనికొక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం వెనుక పవిత్రత ఉండాలి. అప్పుడే అతనికి విలువ. అతని రైట్  సైడ్ చేరిన/చేరదీయబడిన స్త్ర్రీకి విలువ..

No comments:

Post a Comment