Wednesday, January 5, 2011

కేతు గ్రహం గురించిన మర్మాలు

జ్యోతిష్యంలో  అందరూ శనికి వనుకుతారు కాని వారికి కేతు ప్రభావమేమిటో తెలీదు. శనియన్నా దుస్థితిలో ఉంటేనే  దుష్ఫలితాలు ఇస్తాడు. కాని కేతు?

ఎంత మంచి పొజిషన్లో ఉన్నా కీడే చేస్తాడు. ఇదెక్కడి పంచాయితీరా బాబూ అని జుట్టు పీక్కోకండి.

ఆయన జ్నాన కారకుడు.జ్నానాన్ని ఇవ్వడం ఆయన ధర్మం. జ్నానం ఎప్పుడు  వస్తుంది? కష్థాలొస్తేనే గా జ్నానం వచ్చేది అందుకని కష్ఠాలిస్తాడు కేతువు.

ఇలాంటి గ్రహాన్ని సృష్థించిన దేవుడు ఒక విలన్ అనిపిస్తుందా?

అవును బాసు అందరం అలానే అనుకుంటున్నాం. కాని ఆయన నూటికి నూరు పాళ్ళు హీరోనే.మన రక్షకుడే.

మరి ఎందుకీ కమ్యూనికేషన్ గ్యేప్ వచ్చింది? గత జన్మం ముగిసాక మనం ఆత్మ స్వరూపులమై ఉన్నప్పుడు మనమే అతన్ని ప్రార్థించాం. స్వామీ! ముక్తి కోసమని జన్మమెత్తి
ఈ జన్మంతా వృధా చేసాను. ఈ జన్మలో ఏ ఏ అంశాలైతే నా ముక్తికి అడ్డుగా ఉన్నాయో అవేమి తదుపరి జన్మలో నన్ను ఇబ్బంది పెట్టకుండా చూడు అని మనమే ప్రార్థించాం.

ఉ.గత జన్మలో నేను మన యండమూరి వీరేంథ్రనాథ్ లాగా లీడింగ్ రైటరుగా ఉంటూ మాస్ ఫాలోయింగ్ కోసం చెత్త చెత్తవి వ్రాస్తూ టైం వేస్ట్ చేసి ఉంటాను. కాబట్టి ఈ జన్మలో నాకంత సీనొద్దు.

ఏదో నా మనస్సులో మాట భయిటకు చెప్పుకుని ఊరట పొందే అవకాశం ఉంటే చాలు స్వామి.. అని ప్రార్థించి ఉండవచ్చు.

ఇలా నేను ప్రార్థించినప్పుడు నా ఉద్దేశం ముక్తి. మరి ఈ రోజు "ఇదేంది బాయి..ముచ్చటగా మూడు వేలై మందైనా చదవని బ్లాగులో ఏం వ్రాసి ఏం పుణ్యం అని నేనే విసుక్కోవచ్చు. ఇందుకు భగవంతుడెలా భాధ్యుడవుతాడు?

ఇంతకీ నేను చెప్పనొచ్చిందేమంటే  మనకేదన్నా కీడు జరిగితే పెద్దలు అంతా మన మంచికే
నాయనా పోతే పోనీ అనే వారు.మరి అందులో లాజిక్ ఉందా? నిజముందా అని ఒక జ్యోతిష్కునిగా ఆరాదీసి నివ్వెర పోయాను. వాళ్ళ పాయింట్ 100% కరెక్ట్.మరెలా అంటారా? చెబుతా..

నా పుత్రికా రత్నం ఏడో తరగతి రెండు సార్లు ఫెయిల్ అయ్యింది. ( మనకేమో ఎస్.ఎస్.సి.లో 72%). ఇదేందిరా ఖర్మా.. మనమేమో అది పాపం, ఇది పాపం,వారి పాపాన వారు పోతారని ,అన్యాయానికి సైతం రెక్కల కష్ఠం దోచి పెట్టి ఊరుకున్నాం. మన బిడ్డెందుకిలా తయారైందని తెగ బాధ పడి పోయేవాడ్ని.

కాని నేను ఆమెకు పరిచయం చేసిన కంప్యూటర్, పెయింట్ ఆమెను అడోబ్ ఫోటో షాప్ మీదికి ఉసికొలపగా ఈ రోజు నాకు సమానంగా కొన్ని సందర్భాల్లో నాకంటే ఎక్కువే సంపాదిస్తూంది.

పేరుకు స్టుడియో పని చేస్తున్నా ఆ స్టుడుయోకి ఏ టు జెడ్ ఆవిడే. ఇదెలా సాధ్యమైంది?
ఇంతకీ ఆమెకు తమిళం,తెలుగు,ఆంగ్లం ఏది చదవడం, వ్రాయడం రావు. మరెలా సాధ్యమైంది?

నేనైతే 1987 కాలేజినుండి భయిట పడిన నాటినుండి2007దాక ఎన్ని ప్రతిభలున్నప్పటికి రోలింగ్ స్టోన్లా అడుక్కు తిన్నా. మరి ఈ రోజు వద్దన్నా డబ్బులు. ఇదెలా సాధ్యమైంది?

నా పుత్రికా రత్నం జాతకంలో పదిన కేతు. నా జాతకంలో పదో స్థానాధిపతితో కేతు కలిసారు. కేతు అంటే సన్యాసం -భిక్షాటన. ఇవే పూర్వం జరిగాయి.

భవిష్యత్తులో ఆచరణకు రానున్న అన్ని అన్వేష్ణలు కేతుగ్రహ శాఖ క్రిందే వస్తాయన్నది శాస్త్ర్రం. జ్యోతిష శాస్త్ర్రాన్ని రూపొందించినప్పుడు కంప్యూటర్లు ఉండేవి కావు. భవిష్యత్తులో వచ్చిందే. కాబట్టి ఇది కేతు శాఖకు చెందింది. అందుకే నేను నా పుత్రికా రత్నం కంప్యూటర్ పరిజ్నానంతో రెండు చేతుల్లో సంపాదించకలుగుతున్నాం.

ఆనాడు భిక్షాఠన చెయ్యకుంటే ఈ రోజు ఈ సంపాదన లేదుగా?

No comments:

Post a Comment