2000,డిసెంబరు,23 నుండి శాక్తేయంలో అడుగుపెట్టిన నాకు ఎన్నో అనుభవాలు, అనుభూతులు కలిగినవి. వాటిలో ఒకటి అమ్మవారి దివ్య నామాల్లోని గూడార్థాలు. వాటిలో రెండింటికి నాకు స్ఫురించిన అర్థాలను ఈ టపా ద్వారా మీకంద చేస్తున్నా. మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో అంద చేస్తారని భావిస్తున్నా.
అంబికాపుర వాసిని:
అంబరం అంటే ఆకాశం. మూలాధార చక్రం భూ తత్వం. సహస్రారం ఆకాశ తత్వం. కుండలి సహస్రాన్ని అందుకుంటే అంబ సాక్షాత్కరిస్తుంది. ఆకాశాన్ని సూచించే సహస్రారాన్ని అంబరం అని అర్థం చేసుకుంటే అంబ వసించే స్థానాన్ని అంభికాపురమని చెప్ప వచ్చుగా. ఈ నేపథ్యంలో ఆవిడ అంబికాపుర వాసిని కాదా?
అన్న పూర్ణేశ్వరి :
అన్నమంటే అందరికి తెలుసు. ఈ ప్రాణుల శరీరాలను నడిపే ఇందనం. అన్నం పరబ్రహ్మ స్వర్పం అంటారుగా. ఉత్తిదే అన్నేశ్వరి అంటే సరి పోయేదిగా . అన్న పూర్ణెశ్వరి అనడం దేనికి? పూర్ణం అంటే తెలుసు నిండుతనం. అన్నానికి నిండుతనాన్ని ఇవ్వడం ఏంది?
అన్నం అన్నమేగా అని మీరు ప్రశ్నిస్తారు.
ఈ రోజు పెగ్గి ఎక్కువై దొడ్డు బియ్యాన్ని ముట్టే వారు లేరు. ఏ మాత్రం స్థోమత ఉన్నా ప్రతి ఒక్కరు ఫైన్ రకమే వాడుతున్నారు.ఒకే ఇంట ఒకే తల్లి చేతి వంట తిన్న నలుగురు కొడుకుల్లో ఇద్దరు దుర్మరణం/అకాల మరణం పాలయ్యేరు. ఒకతను స్వార్థానికి పరిమితమై భంధు సముద్రానికి, మిత్రమండలికి సైతం దూరమయ్యేడు. ఆ నలుగురిలో ఒకడినైన నేను మాత్రం ఇలా ఉ న్నాను. ఇదెలా సాధ్యమైందంటే వారు ఆరగించిన అన్నానికి ఆ అన్న పూర్ణేశ్వరి పూర్ణత్వాన్ని ప్రసాదించలేదు.
అన్నానికి పూర్ణత్వం ఏమని మీ ప్రశ్న అంతేగా? కేవలం మాంశాన్ని మాత్రమ్ పెంచే అన్నం పూర్ణమైంది కాదు. మరి భుద్దిని పెంచే అన్నం పూర్ణమైందా అంటే అది కాదు. మరి ఏది పూర్ణత్వం గల అన్నమంటే..
ఏదైతే మనిషి హృదయాన్ని పెంచుతుందో, ఏదైతే అతని హృదయంలో సంస్థ ప్రపంచానికి చోటు కలిగిస్తుందో ఆ అన్నమే పూర్ణత్వం సమ కూరిన అన్నం. అన్నానికి పూర్ణత్వం కల్పించే సత్తా ఒక్క అంబకే ఉంది .అందుకే అందుకే ఆవిడకు అన్న పూర్ణేశ్వరి అన్న బిరుదు.
No comments:
Post a Comment