Monday, June 21, 2010

బాలయ్యా ఇక చాలయ్యా !


ఈ మాటను నెను మాట వరసకు చెప్పడం లేదు. తెలుగు సినిమా స్టైల్లో చెప్పాలంటే మనసా వాచా కర్మేణా చెబుతున్నా " బాలయ్యా ! ఇక చాలయ్యా..  నేను అంటున్నది "సింహా" గురించేనని ఇప్పటికే ఊహించి ఉంటారు. నేను ఎన్.టి.ఆర్ వీరాభిమానిని. ఒక దశలో పూజించిన వాడ్ని.కాని ఎన్.టి.ఆర్ పై అభిమానం ఎంత అడ్డొచ్చినా ఈ మాట ఆపుకోలేక పోతున్నా .. బాలయ్యా నీకు  నట జీవితం చాలు. ఇక ఆపేయి. ఇంకా ఇంకా నువ్వు తెర మీద కనిపిస్తే నందమూరి వంశం యొక్క ఘన చరిత్రకు తెర పడుతుంది. తాత పేరు నిలపడానికి ఎలాగూ జూనియర్ ఉన్నాడు. ఇక నువ్వెందుకు. నువ్వేమన్నా పొడిచేట్టున్నా ఫర్వాలేదు.

నువ్వేమీ పొడిచేట్టు లేవు. పైగా సింహా హిట్టయిందన్న తప్పుడు ప్రచారాన్ని పొరబాటుగా నువ్వే నమ్మేసినట్టున్నావు. ఇది నీ భవిష్యత్తుకు మంచిది కాదు. నా బోటి ప్రేక్షకుల ఆరోగ్యానికి మంచిది కాదు. అసలే దాసరి తిక్క సమాచారం . ఆయనతో సింహా గురించిన స్మృతులతో నువ్వు జాయిన్ అయితే అమ్మ బాబోయి తలుచుకుంటేనే వనుకు పుడుతుంది.

ఓరి నాయనో.. ఓరి బాబో  బాలయ్య క్యేలండరు 1980 కే ఆగిపోయిందేమోననిపిస్తూంది. డి.టి.ఎస్ సౌండ్స్, గ్రాఫిక్స్ మినహాయించి చూస్తే సింహా ముమ్మాటికి 1980 నాటి సినిమాయే. నేను ప్రపంచ సినిమాలను కొలబద్దంగా పెట్టుకుని ఈ మాట అనడం లేదు. అచ్చ తెలుగు సినిమాలను కొలబద్దం చేసుకునే చెబుతున్నా. ఈ నెల 17న నా కర్మ కాలి చిత్తూరు ఎమ్.ఎస్.ఆర్ థియేటరులో సింహా చూసాను.

ఇంతకీ గతంలో వచ్చిన పాండురంగా సినిమా చూసి చిర్రెత్తి  మూడేళ్ళ పాటు సినిమా చూడటమే మానేసాను. నా సినిమా యోగానికి మళ్ళీ బాలరిష్ఠ దోషంలా బాలయ్య దోషం తగిలి మరో మూడేళ్ళకు సినిమా జోలికి వెళ్ళ కూడదని డిసైడ్ అయిపోయాను.

సినిమా చూసిన రాత్రి బొత్తిగా నిద్రపోలేదంటే నమ్మండి. నా జీవితం మీద నాకే విరక్తి కలిగింది. ఇదో సినిమా.. తొక్కలో హిట్ అయ్యిందట. అందుకు గాను రాష్ఠ్ర్ర్రం లోని నరసింహ స్వామి గుళ్ళకు బాలయ్య తిరుగుతున్నాడుట. యాబైయో రోజు ఎమ్.ఎస్.ఆర్ థియేటర్లో ఫట్టుమని పది మంది లేరు.

నెను ఈ టివి వార్తలను నమ్మి మోస పోయాను. ఇంతకీ ఎమిటి  కథ?

తండ్రి కొడుకులు. విలన్ చేతిలో తండ్రి చస్తాడు. ( అతని చేతిలో నా వంటి ప్రేక్షకులు చచ్చాం). కొడుకొచ్చి పగ తీర్చుకుంటాడు.

ఈ కథకు మూలం రజిని చేసిన  బాషా. బాషాలో రజిని కాంత్ ఒకడే రెండు రకాల జీవితాలను జీవిస్తాడు. సింహాలో ఇద్దరు బాలయ్యలు. ఇద్దరూ ఒకేరకమైన జీవితం జీవిస్తారు ( అదే పశు వధ శాలలా కసాయికి పాల్పడటం).

కథను కాజేసిన వారు ఆ కథకు ఇవ్వబడిన ట్రీట్మెంట్ గురించి కూడ కాస్తా ఆలోచించి ఉండాల్సింది.

బొబ్బిలి గ్రామంలో  పదిహేను నిమిషాల పాటు (సినిమా లెక్క) విలన్స్  నరమేథం సాగిస్తారు . డాక్టర్గా ఉన్న పెద్ద బాలయ్య ఎక్కడ మందుకొట్టు పడున్నాడో తెలీదు. హఠాత్తుగా వస్తాడు. 

సినిమాలో బొబ్బిలి ఒక గ్రామంగానే చిత్రీకరించ బడింది. కాని అక్కడ ఒక ఫైట్ జరుగుతున్న ఐదు నిమిషాల వ్యవధిలో నిమిషానికో ట్రెయిన్  బొబ్బిలి స్టేషను గుండా పోతూనె ఉన్నాయి.

ఇంతటి వయలెన్స్ జరిగి పోతుంటే స్టేషన్  మాస్టర్ ఏం పీకుతున్నాడు. పోలీసైతే స్టేట్ కాబట్టి విలన్ మ్యేనేజ్ చేసాడనుకోవచ్చు. రైల్వే మరి సెంట్రల్ గవర్నమెంట్ కదా? పోనీ పాస్ అయి పోతున్న రైళ్ళల్లో ఒక్క ఎదవకన్నా పక్క స్టేషన్ నుంది ఫోన్ చెయ్యాలన్న ఆలోచన రాదా?

అమ్మ బాబోయి ! చిత్రం పొడవున ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు కాని, విజయదశమి రోజు కాని  రోడ్దున కుంకుమ రసం అద్దుకున్నగుమ్మడి కాయలు పడి ఉంటాయే ఆవిదంగా తలలు పుచ్చకాయలా పగులుతూనే  ఉన్నాయి. అంగాలు తెగి పడుతూనే ఉన్నాయి.  ఏదో ఒక సీన్ అంటె ఫర్వాలేదు. చిత్రం పొడవునా ఇదే బావత్తు

నేను కథ జోలికి వెళ్ళడం లేదు. కథలో ఏముంది దానిని ట్రీట్ చేసే విదానంలో ఉంది దర్శకుడి ప్రతిభ.  ఒకరేమో డాక్టరట.. మరొకరేమో లెక్చరరట ఇద్దరూ కసాయి మార్కెట్ లో లాగా ప్రవర్తిస్తున్నారు.

కథ అంటేనే కాంట్రాడిక్షన్. అంటే భిన్నత్వం ఉండాలి. దశరథునికి అరవై వేల భార్యలు. కాని అతని కొడుకైన రామునికి ఒకే భార్య. తండ్రి భార్యకిచ్చిన మాట కోసం కన్న కొడుకునే అడవికి పంపుతాడు. మరి కొడుకేమో ధర్మం కోసం తన భార్యను అడవికి పంపుతాడు. ఇటువంటి కాంట్రాడిక్షన్స్ రామాయణంలోగాని మహా భారతంలోగాని కోకొల్లలున్నాయి. అందుకే అవి ఎవర్ గ్రీన్ సబ్జెక్టులుగా మిగిలి పోయాయి.

దర్శకుడు కేవలం మీసం మార్చి , బొట్టు పెడితే బిన్నత్వం వస్తుందని భ్రమించాడేమో? ఇడియట్ !

బాలయ్య ఫిసిక్కే ఒక వెరైటి ఫిసిక్. దానికి ఒక పంచ కట్టు తప్ప మరొకటి సెట్ కాదు. బాక్సు పెద్దది. చెస్ట్ చిన్నది. బొబ్బిలి గ్రామస్తుడైన బాలయ్యను ఒక రైతుగా సౌమ్యుడిగా ఎస్టాబ్లిష్ చేసి ఏదో కారణం చేత తిరగ బడేలా చేసుండొచ్చు. సరే టైటిల్ జస్టిఫై కావాలి కాబట్టి (నర "సింహా) అతన్ని ఉగ్ర నరసింహుడిగానే చూపిస్తూ పంచ కట్టుతో సరి పెట్టి ఉండ వచ్చు. డాక్టరు పంచ కట్టులో ఉండ కూడదని రూలేమి లేదుగా.

సిటిలోని బాలయ్యను జులాయి క్యేరక్టరుగా, రౌడీగా లేదా పిక్ ప్యాకెట్ గా ఎస్టాబ్లిష్ చేసి సర్ది ఉండ వచ్చు. పైగా డైరక్టరుకి స్క్ర్ర్రీన్ ప్లే అంటే ఏమిటో అ ఆ లు తెలియనట్టుంది. నేనైతే మూడు సార్లు సినిమా అయిపోయిందని లేవ పోయాను.

స్క్ర్రీన్ ప్లే అంటే ఒక స్ప్రింగును మెల్ల మెల్లగా టైట్ చేసుకుంటూ పోయి ఇంటర్వెల్ కు ఫుల్ టైట్ చేసి విరామం తరువాత రిలీజ్ చేసుకుంటూ వచ్చి చివరి పదిహేను నిమిషాల్లో ఫట్టుమని రిలీజ్ చెయ్యాలి. అది స్క్ర్రీన్ ప్లే అంటే.

ఏమిటో నవగ్రహాలు వక్రించినాయేమో గాని నేనైతే ఘోరంగా బుక్ అయిపోయా. పైగా ఈ చెత్త చినిమాకి ఒక టపా వేరు నా బొందా !

No comments:

Post a Comment