Tuesday, June 15, 2010

ఎక్సైస్ ఆదాయం పై ఆధార పడకనే ఆదాయ పెంపుకు సలహాలు

ఎలాగో దగ్గర్లో ఎన్నికలేవి లేనందున (తెలంగాణలో గెలవాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టికి లేనే లేదు ( అలాంటి ఉద్దేశమే ఉంటే జగన్ యాత్రను అడ్డుకునేవారే కారుగా.)
1. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఉధ్యోగులంతటి సంఖ్యకు సరిపడేంత సంఖ్యలో నిరుధ్యోగ యువతను టెండర్ పద్దతిన (కావల్సినంత అర్హత +  అతి తక్కువ జీతం కోట్ చేసినవారిని ఎంపిక చేసుకోవడం ) అప్పాయింట్ చేసుకోవాలి.

2.ప్రభుత్వ ఉధ్యోగులందరిని మెడికో, సైకో టెస్టులు , మరియు డే టుడే అప్ డేట్స్ మీద పరీక్షలు నిర్వహించాలి. తప్పిన వారికి మూడు నెలల పాటు లాస్ ఆఫ్ పేలో లీవిచ్చి ప్రిపేర్ కమ్మని పున: పరీక్షకు ప్రిపేర్ కమ్మని ఆదేశించాలి.  మరో పరీక్ష నిర్వహించాలి. అందులోను తప్పితే గోల్డెన్ షేక్ హ్యేండ్ ఇచ్చి ఇంటికి పంపాలి. ఖాళీలను ఇది వరకే  ఎంపిక చేసి ఉంచిన నిరుధ్యోగ యువతతో పూరించాలి

3.పై  పరీక్షలన్నింటిని ఉత్తరాది రాష్ఠ్ర్రాల అధికారులచే /వైద్యులచే నిర్వహించాలి. వీలైనంత వరకు పై పరీక్షలను కంప్యూటరీకరించాలి.
4. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వారికి వారి శెలవు రోజ్ల్లో ప్రభుత్వ కార్యాలయాలను తనిఖీ చేసి  విజిటర్స్ వద్ద మాటా మంతి జరిపి రిపోర్టి సమర్పించే వీలు కల్పించాలి.
5.ప్రజల్లో 18 నుండి నిండిన ప్రతి ఒక్కరికి పోలీసు ట్రైనింగ్ తప్పనిసరి చెయ్యాలి. దీంతో ట్రైనింగ్ కాలేజిలోని లోపాలు భయిట పడతాయి. పోలీసుల లైఫ్ లోని రిస్కేమిటో ప్రజలకు అర్థమవుతుంది. అలానే వారిలో ఎవరన్నా భవిష్యత్తులో క్రైమ్ కు పాల్పడితే వారి వివరాలు డేటా బేస్ లో ఉంటాయి కాబట్టి ఇట్టే పట్టేయొచ్చు.
6.ప్రభుత్వ ఉధ్యోగులను ఏ ఊరికైనా, ఏ శాఖకైనా ,ఏ సీటుకైనా బదిలి చేసే వీలు కల్పించుకోవాలి. ఎవరిని ఎక్కడ పోస్టింగ్ చెయ్యాలన్న విషయాన్ని ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా డిసైడ్ చెయ్యాలి.
7.ప్రజలు తమ వివరాలను ప్రభుత్వానికి అందించే వీలు కల్పించాలి. కంప్యూటర్ అర్థం చేసుకునే ఫార్మెట్లో ఒక అఫిడవిట్ తో పాటు
8.ప్రభుత్వం ఒక దినపత్రిక కలిగి ఉండాలి. దానికి ప్రముఖ పత్రికల సంపాదకులు జంబ్లింగ్ పద్దతిన రోజుకొక్కరు సంపాదకీయం వహించాలి. ప్రభ్తువ ప్రకటనలు సతరు పత్రికలో మాత్రమే పబ్లిష్ కావాలి. రాష్ఠ్ర వ్యాప్తంగా తెలియ పరచాలనుకున్న ప్రకటనలు మెయిన్ ఎడిషన్ లోను జిల్లాకే పరిమితమైనవి జిల్లా ఎడిషన్ లోను పబ్లిష్ కావాలి.
9.ప్రభుత్వ కార్యాలయాలు,పాఠ శాలలు, ఐ.టి.ఐలు  కాలేజీలు,యూనివర్సిటి బిల్డింగులను  టైం షేర్ ప్రాతిపదికన ప్రైవేటు సంస్థలు వాడుకునేలా చూసి ఆదాయం పొంద వచ్చు.
10.దానికి పూర్వం వాటికి  కావల్సినంత వెలుతురు,గాలి లభించే విదంగా ఆల్టర్ చెయ్యాలి. అవకాశం ఉన్న చోట మరో అంతస్తు కట్టడం/వాటికి అనుబంధంగా షాపింగ్ కాంప్లెక్సులు కట్టడం, చెత్త బిల్డింగులైతే వాటిని కూల్చి పారేసి కొత్తవాటిని అండర్ గ్రవుండులో పార్కింగ వసతితో పాటు నిర్మించాలి
11.వారానికొక దినాన్ని కాలుష్య వ్యతిరేక దినంగా ప్రకటించి ఆ రోజు ప్రైవేటు వహాణాల రాక పోకను నిషేదించాలి.  రక్షణ ,వైద్య శాఖ వాహణాలకు,బస్సులు,లారీలకు మినహాయింపు
12.అన్ని శాఖలకు ప్రజలు ఇచ్చే అర్జీలు స్టాంపు పేపర్ మీదే అందేలా చూడటం.వాటిలో తప్పుడు సమాచారం ఉన్నట్టు రుజువైతే రూ 500 దాకా జెరి మాణా విదించే చట్టం తేవాలి
13.అలానే 24 గంటల్లో తమ పని పూర్తికావాలనుకునే వారు కాషన్ డెపాజిట్ గా వారి పని విలువలో 10% కాషన్ డెపాజిట్ గా చెల్లించే ఏర్పాటు చెయ్యాలి. వారి అర్జీలో తప్పుడు సమాచారం ఉన్నట్టు రుజువైతే
కాషన్ డెపాజిట్ తిరిగివ్వ బడ కూడదు
14.రక్షణ, వైద్య, ఫైర్ ఇంజిన్ తప్ప ఇతర శాఖల వాహణాలన్నింటిని ( ఐదేళ్ళ కంటే పాతవి) గ్లోబల్ టెండర్ పిలిచి విక్రయించి వేసి కి.మీ కు ఇంత చొప్పున ఏర్పాటు చేసుకోవాలి.
15.ప్రభుత్వ కార్యాలయాలు పని వేళలను ఉ.6 నుండి మ.2.30 కు మార్చి వెయ్యాలి. సిబ్బందికి వారి సీట్ల వద్దకే టిఫన్,భోజనం, టీ, నికోటిన్ చిక్లెట్/చాక్లెట్ అందివ్వాలి. అత్యవశర శాఖలు మినహా అన్నింటికి దీనినే వర్తింప చెయ్యాలి. (అప్పుడే టైం షేర్ ప్రాతిపదికన ఇన్ ఫ్రా స్ట్ర్రక్చర్ ను ప్రైవేటు సంస్థలు వినియోజించుకునే వీలు ఉంటుంది


(To be cont..

No comments:

Post a Comment