Saturday, September 19, 2009

సింహ రాశి (2009-2011)

సింహ రాశి
రాశి చక్రంలో ఐదవ రాశి అయ్యి భుద్ది,పుత్రులు,పేరు ప్రఖ్యతలనుసూచించే సిమ్హ రాసి మితౄలారా ! తొలూత మీ తెలివి తేటలు ప్రక్కదోవ పట్టినా అనుభవంతో మీబుద్ది కుశలతలు వికశిస్తాయి. ఒకటి, రెండు సంతానాలకు మించి కలుగదు. తొలూత అవమానాలే ఎదురైనా పేరు ప్రఖ్యతలు తప్ప వరిస్తాయి,. మీలో స్త్రీలు వేరే విదంగా ఉండొచ్చు గాని పురుషులు మాత్రం సోమరులుగా,శుచి శుభ్రత లేని వారిగా ఉంటారు. పైగా గతంలో మీ రాశియందే సంచరించిన శని పై దురలవాట్లను మరింత పెంచి ఉంటాడు. అంతే కాక ముఖాన జిడ్డు కారడం,తల వెంట్రుకలువ్రలడం, తెల్ల వెంట్రుకలు రావడం ,మలబద్దకం వంటి సమస్యలు వచ్చి ఉంటాయి. నీచ స్త్రీ సహవాశం, జీవిత భాగస్వామితో పేచీలు సంభవమే.

సెప్టెంబరు 26 న శని 2 కు రావడం ఖచ్చితంగా శుభ పరిమాణమే. పై తెలిపిన రుగ్మతలు క్రఏణా తొలుగుతాయి. అయితే వౄధా ఖర్చులునిష్ఠూరపు మాటలు, లావా దేవీల్లో ఆలశ్యం తలెత్తుతాయి. మాట నిలుపుకో లేక పోతారు. కుటుంభ సభ్యుల ప్రవర్తన మీకు, మీ ప్రవర్తన కుటుంభ సభ్యులకు చికాకు కలిగిస్తాయి. కొందరికి గొంతు,నోరు, నేత్రం సంభంధ రోగాలు రావచ్చు. తస్మాన్ జాగ్రత్త.
మీకు శని 6,7 స్థానాలకు అధిపతి కావున అప్పు చేయవలసి రావడం, లావా దేవీల ద్వార తగువలు సంభవం. వైద్య ఖర్చులు తప్పవేమో. అయితే భార్యా మూలక దనప్రాప్తికి అవకాశం ఉంది. అయితే అది ఒక మరణం ద్వారా, లేదా తగువ ద్వారా జరుగ వచ్చును

1 comment:

  1. నాది సింహరాసే నండి చాల చక్కగా వివరించారు.. కొన్నిలక్షణలు కలుస్తున్నాయి...వాటి విరుగుడు ఎమైన దేవుడి స్తోత్రాలు,పూజలు కూడా సెలవిస్తే బాగుంటుంది..

    ReplyDelete