Wednesday, September 16, 2009

సోనియా ఇటలికి చెందిన మహిళ

ఆంథ్రప్రదేశ్ చిత్తూరు జిలా చిత్త్రు పట్టణం, పిళ్ళారి గుడి వీథికి చెందిన ప్రముఖ రచయిత,జ్యోతిష్కులు,పాత్రికేయులు చిత్తూరు.ఎస్.మురుగేషన్ జగన్ మోహన్ రెడ్డి తక్షణం సి.ఎల్.పి.సమావేశం ఏర్పాటు చేసి సి.ఎల్.పి.నేతగా ఎంపికై , గవర్నరును కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కోరాలని తెలిపారు. ఎలాగో శాసన సభ కాంగ్రెస్ పార్టి సభ్యుల్లో (ఎం.ఎల్.ఏ) ఒకరిద్దరు తప్ప అందరి మద్దత్తు ఉన్నందున వెంటనే జగన్ ఈ సాహసం చెయ్యాలని మురుగేషన్ విజ్ఞప్తి చేసారు.
సోనియా నాయకత్వాన్ని వై.ఎస్.భలపరచారని వై.ఎస్. లేకుంటే ఆదిష్ఠానం తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో రాష్ఠ్రంలో కాంగ్రెస్ మట్టి కరిచేదని మురుగేషన్ గుర్తు చేసారు.
సోనియా ఇటలికి చెందిన మహిళని దేశ వ్యాప్తంగా ప్రచారం జరిగిందని అప్పుడు రాష్ఠ్ర కాంగ్రెస్ సోనియ వెంట నిలబడిందన్నారు. వై.ఎస్.కు సోనియా ఇచ్చిన ప్రాముఖ్యతకు సైతం హిందుత్వా పార్టిలు మత రంగు పులిమితే వై.ఎస్.ఎంతో చాక చక్యంగా ఆ ప్రచారాన్ని తిప్పి కొట్టారని మురుగేషన్ వివరించారు. ఏ మాత్రం ఆదాయం లేని వేలాది హిందూ దేవాలయాల్లో దీప్,దూప,నైవేద్యాలకు రూ.1,500 అర్చకులకు జీతాలుగా రూ.2000 కేటాయించి ఆ దుష్ప్రచారాన్ని వై.ఎస్.తిప్పికొట్టారని మురుగేషన్ విశదీకరించారు. ఈ మెరకు మురుగేషన్ వై.ఎస్. కుమారుడు జగన్మోహన్ రెడ్డికి ఒక ఉత్తరం వ్రాసారు. సతరు ఉత్తరంలోని కీలకాంశాలు ఇలా ఉన్నాయి.

1.సోనియా వల్ల రాష్ఠ్ర కాంగ్రెసుకు ఒరిగిందేమి లేదు . తెలింగాణా విష్యంలో 2004లో తెలింగాణా ఇస్తామని టి.ఆర్.ఎస్.తో పొత్తు ఖరారు చేసింది ఆదిష్ఠానమే. తీరా ఎన్నికలయ్యాక సరైన సమయంలో సరైన నిర్ణయం అంటూ నాంచి వేసి టి.ఆర్.ఎస్.ను దూరం చేసింది ఆదిష్ఠానమే
2.అమెరికాతో అణు ఒప్పందం చేసుకుని కమ్యూనిస్టులను దూరం చేసింది కూడ ఆదిష్ఠానమే3.ఎం.ఆర్.పి.ఎస్.వారికి వై.ఎస్.ఇచ్చిన హామిని నీరు కార్చింది ఆదిష్ఠానమే
4.ఆదిష్ఠానానికి వై.ఎస్.రాష్ఠ్ర నిథులను దోచి పెడ్తున్నారని ప్రతి పక్షాలు ఆరోపణలు చేస్తే ఆదిష్ఠానం మాత్రం దానిని ఖండించిన పాపాన పోలేదు
5.వై.ఎస్.తాను అమలు చేసిన పథకాలన్నింటికి రాజీవ్,ఇందిరల పేరు పెట్టి తమ విశ్వాసాన్ని చాటుకున్నారు. అటువంటిది వై.ఎస్. పై విశ్వాసాన్ని ఆదిష్ఠానం చాటుకునే ప్రయత్నం చెయ్యక, జగన్ ను సి.ఎం.గా ప్రకటించక సతరు దిమాండును లేవనెత్తిన మంత్రులకు చీవాట్లు పెడుతుంది.
6.వై.ఎస్.నిజమైన ప్రజా భలం ఉన్న నాయకులను అక్కన చేర్చి పార్టిని భలోపేతం చేస్తుంటే కేవలం కొందరు నాయకుల పైరవిలతో చిత్తూరు మాజి ఎం.పి.డి.కె.ఆదికేశవులు, చిత్తూరు ఎం.ఎల్.సి ఆర్ గోపినాథ్ వంటి అనామకులను అందలం ఎక్కించి వై.ఎస్. అనుచరుడైన చిత్తూరు ఎం.ఎల్.ఏ.సి.కె.బాబును తద్వారా వై.ఎస్.ను ఆదిష్ఠానం అవమానించింది
7.సోనియా ప్రచారంతో ఒరిగిందేమి లేదు. కేంద్ర నాయకత్వ భహిరంగ సభలకు జనం తామంతట తమే తరలి వచ్చే రోజులు ఇందిర,రాజీవ్లతో చెల్లు. అమ్మగారి ప్రోగ్రాం ఫిక్స్ అయితే ఆ జిల్లాలోని కార్యకర్తలు,నాయకులకు మేడం గారి సభకు జనాన్ని తరలించే పని మినహా మరే పని ఉండదు. ఆ జిలాల్లో ప్రచారం మందగించి పోతుంది.
జగన్ వయస్సు:
జగన్ వయస్సును వంక పెడుతున్నారు. స్వామి వివేకానందా, జీసస్ క్రైస్ట్, నెపోలియన్, ఇలా ఎందరో మహానుభావులు యుక్త వయస్సులోనే అనుకున్నది సాధించ కలిగారు. డా.వై.ఎస్.సైతం 33 ఏళ్ళ వయస్సుకే పి.సి.సి అధ్యక్షులైనారు.

కాష్మీరులో ఫరూక్ కొడుకును సి.ఎం.చేసారు. అస్సాంలో ప్రభుల్లకుమార్ మహంతా, ఒర్స్సాలో నవీన్ పట్నాయక్ ఇలా ఎన్నో ఉధాహరణలు చెప్పొచ్చు. ప్రజా భలం లేని వౄద్దులు,అనామకులు, కేవలం భజనతో పబ్బం కడుకున్నే వారి విధేయతలకు మురిసి పోయి ఆదిష్ఠానం ఇలా జగన్ వారసత్వ విషయంలో నాంచుడు ధోరణి అవలంబిస్తూది.

కాబట్టి వై.ఎస్.జగన్ తక్షణం మేల్కొని తిరుగుభాటు చెయ్యాలి అంటూ మురుగేషన్ తమ లేఖలో గంటా పదంగా పేర్కొన్నారు. పైగా సతరు ఉత్తరం యొక్క ప్రతులను రాష్ఠ్ర ఎం.పీ.అందరికి మెయిల్ ద్వారా పంపినట్టు మురుగేషన్ చెప్పారు

No comments:

Post a Comment