Thursday, September 17, 2009

మిథున రాశి


రాశి చక్రంలో సోదరులు,సాహసం,ప్రయాణాలను సూచించే మూడవ రాశియగు మిథున రాశి మితౄలారా !
మీ జీవితంలో పై తెలిపిన సోదరులు,సాహసం,ప్రయాణాలు సంగీతాలకు ముఖ్య స్థానం ఉంటుంది. అలాగే స్త్రీ పురుషులు కలిసి ఉన్న మీ రాశి సింబల్ చూడండి. మైథునం (సెక్స్) అన్న పదం నుండి రూపొందిన మిథునం అన్న మీ రాశి పేరు చూడండి. మీ జీవితంలో కొత్త మలుపులకు సెక్స్ పై ఆసక్తి లేదా విరక్తియే కారణమై ఉంటుంది. ఇక సెప్టంబరు 26 అందాక మూడున ఉన్న శని 4 కు రావడం వలన ఇంతకాలం (గత 3 సం.) మీకు లొంగి ఉన్న సోదర వర్గం మీ పై తిరుగుబాతు చేయ వచ్చు. మీలో దైర్యం తగ్గి భయం పుట్టొచ్చు. అలాగే ప్రయాణాల వలన కొంత ఇబ్బంది కలుగ వచ్చును. శని 4 నకు రావడం వలన తల్లి,ఇల్లు,వాహనం, తల్లి తరపు భంధువులు,విద్యా వైగైరాల్లో కష్ఠ నష్ఠాలు ఆశా భంగాలు తప్పక పోవచ్చు. మరి శని మహాత్మునికి అష్ఠమాధిపత్యం కూడ ఉండడం వలన తల్లికి గండం వంటిది కూడ కలుగ వచ్చును. విద్యా భంగం, స్థాన చలన, స్నేహితులతో శతౄత్వం కలుగ వచ్చును. అయితే శనికి నవమాధిపథ్యం కూడ ఉన్నందున పితురార్జితాన్ని వెచ్చించి గౄహ నిర్మాణం,ఇంతి మరమ్మత్తులు చేపట్ట వచ్చును. విద్యా భుద్దులతో అదౄష్ఠం కలిసొచ్చి దూర దేశాల్లో ఉధ్యోగం లభించే అవకాశం ఉంది. తల్లి తరపు భంధువుల సహకారం కూడ కాస్త లభించ వచ్చును

కర్కాటకం
మీ కర్కాటక రాశి, జాతక చక్రంలో తల్లి ఇల్లు,వాహణం,హౄదయం విద్యలను సూచించే నాల్గవది కావడంతో మీకు తల్లి తో హేట్ అండ్ లవ్ రిలేషన్ ఉంటుంది. ఇల్లనేది సుదూర కలగా ఉంటుంది. వాహన విషయంలోను అసంతౄప్తి తప్పదు. మీరు మెదడుతో కన్న హౄదయంతోనే ఆలోచిస్తారు. చంద్రుడు,నది,సముద్రం,నీరు,దర్పణం(మిర్రర్) వీటికున్న ప్లస్ పాయింట్స్ తో పాటు , మైనస్ పాయింట్స్ కూడ మీలో మెండుగా ఉంటాయి. గతంలో మీకు దన,వాక్కు,కుటుంభ స్థానమగు రెండున ఉన్న శని అంగట్లో అన్నీ ఉంది,అల్లుడి నోట శని ఉంది అన్న చందాన వేదించింది. లావా దేవీల్లో జాప్యం, మీకే తెలియ కుండ మీ మాటలు నిష్ఠూరంగా రావడం, మాట నిలుపుకోలేక పోవడం,నిజం చెబితే అబద్దంగా, తమాషాకు చెబితే అది నిజంగా అవుతూ మిమ్మల్ని చిక్కులో పడేసింది. కుటుంబంతో సంబంధాలుకూడ అంతంత మాత్రమే.

శని ధన భావం నుండి తొలగడం వలన పై తెలిపిన అశుభాలన్ని తొలుగుతాయి. మూడున రావడం వలన మనోధర్యం హెచ్చడం, సోదర సోదరీ మణుల స్సహకారం, ప్రయాణాలవలన మేలు జరుగుతాయి.
శని మీ రాశికి 7,8 స్థానాలకు అధిపతియై ఉండి మూడున రావడం చేత తో భుట్టువుల్లో ఒకరికి తీరని నష్ఠం కలుగును. ప్రయణాల్లో చిన్న పాటి ప్రమాదాలు ఏర్పడవచ్చును. జీవిత భాగస్వామికి ప్రయాణాల వలన వత్తిడి కలుగ వచ్చును.

No comments:

Post a Comment